ఉత్తరాయణం

బ్యాంకువారి నిలువు దోపిడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఓ శాఖలో 11వేల కోట్ల రూపాయల మేరకు మోసం జరిగి, భారీగా నష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి. ముగ్గురు, నలుగురు ఉద్యోగుల చేతివాటం వల్లే ఇదంతా జరిగిందన్నది ఎవరికైనా గగుర్పాటు కలిగిస్తుంది. ఒక బడా వ్యాపారికి మేలు జరిగేలా ‘లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్’ జారీ చేయడం ద్వారా ఈ మోసం జరిగిందని బ్యాంకు వర్గాలు చెప్పడం విస్తుగొలుపుతుంది. ఆ రకమైన ‘గ్యారంటీ ఉత్తరాలు’ తీవ్రమైన తనిఖీ క్రియ దాటి, వివిధ పరీక్షలను నెగ్గాల్సి ఉంటుంది. అలాంటిది అలవోకగా వేల కోట్ల రూపాయల పూచీకత్తులు వివిధ దశలను దాటి, బ్యాంకును నష్టపరిచాయంటే ఎన్ని పెద్దతలకాయలకు దీనితో సంబంధం ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఒక్క శాఖలోనే ఇంత పెద్ద ఆర్థిక మోసం జరిగిందంటే- ఇక దేశవ్యాప్తంగా ఉన్న వేలాది బ్యాంకు శాఖల్లో ప్రజాధనం దోపిడీకి గురి కావడానికి ఉన్న అవకాశాల గురించి ఆలోచిస్తే మతి పోతుంది. ఇటీవల వివిధ బ్యాంకులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రతి బ్యాంకు నష్టపోయిన మొత్తం వేల కోట్ల రూపాయల్లో ఉంటోంది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది అగ్రస్థానం. ఎనిమిది వేల కోట్ల మేరకు ఎస్‌బిఐకి ఆర్థిక నష్టం జరిగిందని వార్తలు వచ్చాయి. ఇవన్నీ అధికారికంగా, పాక్షికంగా తేలిన కొన్ని గణాంకాలు మాత్రమే. ఇక బ్యాంకుల్లోని నిరర్థక ఆస్తులు, మొండి బకాయిలను లెక్కకడితే లక్షల కోట్ల రూపాయల్లో నష్టం జరిగినట్టు భావించాలి.
బ్యాంకు యాజమాన్యాల నిర్వాకాలు ఇలా ఉంటే, ప్రభుత్వ చికిత్సలు వేరేలా ఉన్నాయి. ఉద్యోగుల బాధ్యతారాహిత్యం, ఇతరులతో కుమ్మక్కు కావడం వల్ల బ్యాంకులు దివాలా తీస్తే- దానికి ఖాతాదారుల సొమ్ము నుంచి సర్దుబాటు చేస్తారట. పైసా పైసా కష్టపడి ఖాతాదారులు కూడగట్టుకున్న సొమ్మును ‘బెయిల్ ఇన్’ పేరుతో బ్యాంకుల పాలు చేయాలన్నమాట. ఎవరో ఘరానా మోసగాళ్లు చేసే పనికి సామాన్యులు బలి కావాలా? అదీ అధికారికంగా.. బ్యాంకు ద్వారా! కష్టజీవుల శ్రమఫలాన్ని కొందరు బలవంతంగా లాగేసుకోవడం ఇంటే ఇదే. సామాన్య రైతుకు బ్యాంకుల నుంచి పంట రుణాలు దక్కవు. సగటు వేతనజీవి ఇల్లు కట్టుకుందామంటే అప్పు పుట్టదు. విద్యార్థుల ఉన్నత చదువులకు సాయం అందదు. కొద్దిపాటి రుణానికే లక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు ఘరానా వ్యాపారులతో చేతులు కలిపి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. రైతులకు వడ్టీ మాఫీ చేయాలంటే ఆర్థిక సూత్రాలను వల్లె వేసే బ్యాంకులు తప్పుడు పత్రాలపై కోట్లాది రూపాయలను బడాబాబులకు ధారపోస్తుంటాయి. ఇది ఎంత అన్యాయం? బ్యాంకుల్లో ప్రజాధనం లూటీ అవుతున్నా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి.
-డా. జీవీజీ శంకరరావు, పార్వతీపురం
అనంతపురానికి మరో రైలు వేయండి
పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నం నుంచి అనంతపురానికి మరో రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఇకనైనా చొరవ చూపాలి. విశాఖ నుంచి వెళ్లే భువనేశ్వర్- బెంగళూరు (ప్రశాంతి) ఎక్స్‌ప్రెస్, బెంగళూరు- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిత్యం ప్రయాణీకులతో కిటకిటలాడుతుంటాయి. ఈ రైళ్లలో అనంతపురం వెళ్లాలంటే రిజర్వేషన్ దొరకడం దుర్లభం. జనరల్ బోగీల్లో నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. అనంతపురం వెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ రైలును ఏర్పాటు చేయాలి. ఇందుకోసం రైల్వే శాఖ తగినన్ని నిధులను విడుదల చేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు