ఉత్తరాయణం

శిశు మరణాల తీరు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య విడుదలైన రెండు ముఖ్య నివేదికలు భారతదేశ ప్రతిష్ఠలో డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వ, అధికార వర్గాల ప్రకటనలు, ప్రతినలే తప్ప పనులు మాత్రం ముందుకు కదలడం లేదన్న వాస్తవాన్ని ఇవి తెలియచేస్తున్నాయి. మొదటి నివేదిక ‘యునిసెఫ్’ ఇచ్చినది. ఏడాది వయసులోపు శిశువుల మరణాల్లో ప్రపంచంలోనే మనది ముప్పైవ స్థానం. పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 25 మంది సంవత్సరం లోపే మరణిస్తున్నారు. 2016లో 2.40 లక్షల మంది ఆ వయసు చిన్నారుల ప్రాణాలు రాలిపోయాయన్న మాట. పేద దేశాలైన బంగ్లాదేశ్, ఆఫ్రికాలోని పేద దేశం రువాండా కూడా ఈ గణాంకాల్లో మనదేశం కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. మన దేశపు ఆర్థిక బలానికి ఏమాత్రమూ సరితూగలేని రువాండా 1990లో వెయ్యి మందికి 40 మంది చిన్నారుల్ని కోల్పోయే స్థితి నుండి, మెరుగైన స్థానానికి చేరుకుంది. శ్రీలంక కూడా శిశు మరణాల రేటు ప్రజారోగ్య చిత్రాన్ని పట్టి చూపుతుంది. పేద దేశాల కన్నా ప్రజారోగ్యం కాపాడడంలో భారత్ వెనకబడి ఉండటం, అదే సమయంలో సూపర్ పవర్ అవుతామని మన నేతలు ప్రతినలు బూనడం హాస్యాస్పదం. మరో నివేదిక ట్రాన్స్పరెంట్ ఇండెక్స్ సంస్థది. 180 ప్రపంచ దేశాల్లో అవినీతిలో భారత్‌ది 81వ స్థానం. గతానికి, ఇప్పటికీ స్థాన మార్పిడి అస్సలు లేదు. గతంలో లాగానే నలభై పాయింట్లతో ఇదే స్థానం. వివిధ శాఖల్లో అవినీతి, ప్రజల అనుభవాలు, అభిప్రాయాలతో ఈ ర్యాంకులిస్తారు. అవినీతిని వ్యతిరేకించే కలాలకు, గళాలకు ఉండే ప్రాణాపాయ స్థితిని అంచనా వేస్తారు. ఈ విషయంలో కూడా దేశం ప్రమాదకర స్థానంలో ఉండడం బాధాకరం. బయటపడుతున్న వరుస కుంభకోణాలు చూస్తుంటే ముందు ముందు మరింత అవినీతిలో అగ్రగామి దేశంగా భారత్ దూసుకుపోతుందేమోనని దిగులు పుడుతుంది. అవినీతిని కట్టడి చేసి, విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్లగలిగే సుపరిపాలనని ప్రభుత్వాలు అందించలేకపోతే భారత్ భవిష్యత్తుని ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ‘సూపర్ పవర్’ స్వప్నాలు తరువాత.. మన పరువు దిగజారకుండా ఉండాలంటే బలమైన రాజకీయ సంకల్పం అవసరం.

-డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం