ఉత్తరాయణం

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిరోజులుగా ఏ దినపత్రిక తిరగేసినా బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణాలు జరిగాయన్న వార్తలే వస్తున్నాయి. సామాన్య ప్రజలు బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, కొద్దిగా రుణం కావాలన్నా సంబంధిత అధికారులు సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. ఏటీఎంల నుంచి డబ్బు తీసినా, మినిమం బ్యాలెన్స్ లేకున్నా భారీగా చార్జీలు వడ్డిస్తున్నారు. రుణాలకు సంబంధించి చెల్లింపులు ఆలస్యమైతే బ్యాంకు అధికారులు నానా హంగామా చేస్తారు. సంతకంలో లేదా వేలిముద్రలో చిన్న తేడా వస్తే ఖాతాదారులకు నరక యాతనే. సామాన్య, మధ్య తరగతి వారిని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న బ్యాంకులు బడాబాబులకు దాసోహం అవుతున్నాయి. వేల కోట్ల రూపాయల రుణాలను వారికి ఉదారంగా ఇస్తున్నారు. రుణాలు ఎగవేసి విదేశాలకు పలాయనం చిత్తగించే ఘరానా మోసగాళ్లను ఏమీ చేయలేక పోతున్నారు. భారీగా కుంభకోణాలు జరుగుతుండగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇలాంటి కుంభకోణాలు జరిగే అవకాశం ఉందా? వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన వారిని స్వదేశానికి రప్పించి కఠినంగా శిక్షించరా?
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
విగ్రహానికి రూ. 3వేల కోట్లా?
గుజరాత్ ప్రభుత్వం నర్మదా నది ఒడ్డున సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించడం విస్మయం కలిగిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2013లో పటేల్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వేల కోట్ల రూపాయలు కేటాయించడం సమంజసమా? ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు పోటీలు పడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మహనీయులను స్మరించుకునేలా వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం తప్పుకాదు. కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే మహనీయుల పట్ల మనకు గౌరవం ఉన్నట్టా? ప్రజాధనాన్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేయడం పాలకులకు తగునా? విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి తగిన విధి విధానాలను రూపొందించడం ఎంతో అవసరం. శిథిలావస్థకు చేరిన విగ్రహాలకు మరమ్మతులు చేయించడంపైనా శ్రద్ధ చూపాలి.
- కొలుసు శోభనాచలం, గరికపర్రు
నిందలు వేస్తే సరా?
బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కవ్వింపుచర్య అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అనడం హాస్యాస్పదం. మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వకూడదా? కేటాయింపులకు, ప్రత్యేక ప్యాకేజీలకు నిబంధనలు, పరిమితులు ఉంటాయి. కేవలం ఏపీకే నిధులన్నీ ఇస్తారా? కాగా, కేంద్రం ఏపీకి ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారని, ఖర్చుల వివరాలు సరిగా ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. స్మార్ట్ సిటీలు, ఉపాధి హామీ పథకం, సర్వశిక్ష అభియాన్ వంటి పథకాల్లో నిధుల వినియోగానికి సంబంధించి అవినీతి ఆరోపణలున్నాయి. ఈ లోపాలను సరిదిద్దుకోకుండా నిధులు ఇవ్వడం లేదని కేంద్రంపై నిందలు వేయడం సరికాదు.
- చంపక్, కాకినాడ