ఉత్తరాయణం

ఆంధ్రుల వ్యధ.. అంతులేని కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే కథ.. కథనమే వేరు. గత ఎన్నికలకు ముందు కథాంశం సమైక్యాంధ్ర సాధన, విభజన నిరోధం. ఇప్పటి కథ- ‘హోదా’ సాధన, హామీల అమలు. గెలుపుకనిపించని యుద్ధాలకు సన్నద్ధమవ్వక తప్పని స్థితి ప్రజలది. ఫలితం సంగతి చూచాయగా అర్థవౌతున్నా, రాజకీయ లబ్ధిని చేజార్చుకోకూడదన్న బింకం రాజకీయ పక్షాలది. వెరసి- అసలు ప్రయోజనాలు వెనక్కిపోతున్నాయి. జాతీయ పక్షాలు కూడబలుక్కొన్నపుడు రాష్ట్ర విభజన ఆగదని తెలిసీ సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. హక్కుల కోసం పోరాడడంలో తప్పులేదు కానీ ఫలితం తెలిసీ అనవసర యుద్ధం జరిగింది. కొంత నష్ట నివారణ చేసుకొని ఉంటే బాగుండేది. ఇక రాజకీయ పక్షాలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతాయి? ‘ముందు రాజకీయ అవసరాలు తీరితే చాలు, తర్వాత ఏమైతే అది..’ అన్న దుడుకుతనంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి, ఆ తరువాత హామీలు, లెక్కలు తీరిగ్గా చూసుకోండి’ అంటూ అధికారంలో నుంచి జారుకొంది.
నాలుగేళ్ల తర్వాత కూడా- ‘విభజన హామీలు’ అమలుకానందున రోడ్డున పడాల్సిన దుస్థితి. ఇప్పుడు ప్రధానాంశం అయిన ‘ప్రత్యేక హోదా’ విభజన చట్టంలోని అంశం కాకున్నా జాతీయ పార్టీలు అధికారికంగా ‘కమిట్’ అయిన హామీ. ఇది ప్రజల నైతిక హక్కు. ‘హోదా’ ఇచ్చి తీరాలన్న నియమమూ లేదు. కేంద్రంలో బిజెపి- ‘హోదా ఇవ్వడం కుదరదు, అంతకు తగ్గ ప్యాకేజీ ఇవ్వగలం’ అంటుంది. ఇక్కడ ఇస్తే, మిగతా రాష్ట్రాల్లో ఓట్లు పోతాయన్న భయం అందుకు కారణం. అది రాజకీయ కోణం. ‘మేం అధికారంలోకి వస్తే తొలి సంతకం హోదా ఫైలుమీదే’ అంటారు రాహుల్. వస్తే, గిస్తే అపుడు కదా, ఈలోగా ఆంధ్రులకు మొహం చూపించుకోవచ్చు అనేది కాంగ్రెస్ భావన. ఇదీ రాజకీయ కోణమే. ప్రతిపక్షాలు ఆది నుండీ ‘హోదా’ అడుగుతున్నా, అధికార తెదేపా శ్రుతి కలిపింది తాజాగా. ఇలా జాతీయ, ప్రాంతీయ పార్టీలూ రాజకీయ కళ్ళద్దాల్లోంచి సమస్యని చూస్తున్నాయి. ఈ గందరగోళంలో అసలు సమస్యలు వెనక్కిపోతే మళ్లీ రాష్ట్రానికి తీరని నష్టం. కేంద్ర విధానాలపై పోరాటం చేయవలసిందే కాని ఒకే గొంతుతో ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చెయ్యకుండా ఉద్యమించాలి. సంయమనంతో వ్యవహరించాలి అన్ని పక్షాలూ. కేంద్రం తన ప్రణాళికను, హామీల అమలులో నిబద్ధతనూ ప్రజలకు వివరించాలి. మిగతా విభజన చట్టంలోని అంశాలని ఎంతవరకూ అమలు చేసిందో చెప్పాలి. ఈసారి రాష్ట్ర బడ్జెట్ లక్షా తొంభై వేల కోట్ల రూపాయలైతే, అప్పులు రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలు. అప్పుల ఊబికి ఒక కారణం అడ్డగోలు విభజన. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం మరింతగా క్షీణించకుండా బాధ్యతగా అందరూ ఆలోచించాలి. అదీ రాజకీయాలకు అతీతంగా.
-డా డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం