ఉత్తరాయణం

గ్రామీణులకు వైద్యం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి జిల్లాలో దాదాపు ఒకటి లేదా రెండు మెడికల్ కాలేజీలున్నాయి. ఏటా వందలాది మంది డాక్టర్లు బయటకు వస్తారు. జిల్లాకు 40 నుంచి 50 మండలాలున్నాయి. మండలంలో 40 నుంచి 50 వేల జనాభా వుంటుంది. మండల కేంద్రంలో ఒకటి, మరొక ప్రధాన గ్రామంలో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. గ్రామాల్లోనే నేటికీ 65 శాతం ప్రజలు నివసిస్తున్నారు. ఒకటి, రెండు ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చలేవు. 500 జనాభా వున్న పెద్ద గ్రామాలలో సైతం ఎంబిబిఎస్ డాక్టర్లు లేరు. కనీసం 5వేల జనాభాకు ఒక డాక్టర్ అదీ ప్రైవేట్ డాక్టర్ సేవలు అవసరం. రెండు మూడు గ్రామాల జనాభా కలిపి మొత్తం 5000 వుంటే అక్కడ ఆ గ్రామాలకు ఒక ప్రైవేట్ డాక్టర్ అవసరం అవుతారు. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం ఉండదు. కూలిపనులు చేసేవారు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకూ పట్టణానికి వెళ్లాలంటే వారి సంపాదన అంతా వైద్యానికే సరిపోతుంది. ప్రభుత్వ డాక్టర్లు చాలామంది పల్లెల్లో వైద్యం అందించడానికి ఇష్టపడరు. ప్రతి మండలంలో కనీసం ఒక ఆయుర్వేద, ఒక హోమియోపతి డాక్టరు వుండడం అవసరం. ప్రభుత్వ పరంగా ఎన్ని పథకాలు పెట్టినా గ్రామీణ ప్రజలకు వైద్యం అందడం లేదు. ఈ సమస్య ఇంకా ఎన్నాళ్లు..?
-సుగ్గు జనార్దన, జమ్మలమడుగు
ఆర్థిక నేరగాళ్లను శిక్షించరా..
మన దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించి దోషులకు శిక్షలు పడటంలో ఇంత జాప్యం ఎందుకు? ఈ తరహా నేరగాళ్లు దేశం విడిచిపెట్టి బ్రిటన్, బెల్జియం, గల్ఫ్ దేశాల్లో జల్సాగా బతుకుతున్నారని వార్తలు వింటున్నాం. లలిత్ మోదీ, నీరవ్ మోదీ, విక్రమ్ కొఠారి లాంటి ఘరానా నేరస్థులు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని దర్జాగా ఎగ్గొడుతూ వైట్‌కాలర్ నేరస్థులుగా ముద్రపడ్డారు. బ్యాంకులకు రూ. 9వేల కోట్లకు టోపీ పెట్టిన కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మన పాలకుల అండ లేకుండానే లండన్ చెక్కేశారా? తాజాగా నీరవ్ మోదీ అనే వజ్రాల వ్యాపారి బ్యాంకులను ముంచేసి పలాయనం చిత్తగించాడు. ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారాలపై ప్రధానమంత్రి స్పందించటం లేదు. కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయలు అప్పులు ఎలా ఇస్తున్నారు? సామాన్యులకు కొద్దిగా అప్పు కావాలంటే నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. రిజర్వు బ్యాంకు అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు ఈ విషయాలు తెలియకుండా జరిగడం ఆశ్చర్యంగా ఉంది. ఎన్‌డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు పరోక్షంగా సహకారమందిస్తోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్‌లో వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఎన్నికలలో లోపాయికారీగా సహకారమందిస్తారని ఆశ కావచ్చు. చెరువుకు చినుకుల ఆశ, చినుకులకు చెరువాశ అంటే ఇదేనేమో! ఇలాంటి ఘరానా మోసగాళ్ళను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
- జి.అశోక్, గోధూర్

ప్రగతికి కేంద్రం మోకాలడ్డు
ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారు. అనేక దేశాలు తిరిగి పెట్టుబడిదారులను ఆహ్వానించటం, నదుల అనుసంధానం చేసి బీడు భూములను సస్యశ్యామలం చేయడం అభినందనీయం. గతంలో ఎన్నడూ కానరాని ప్రగతి ఈ నాలుగేళ్లలో పరుగులు పెడుతుంది. నిధులు ఇవ్వక కేంద్రం మోకాలడ్డుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించవలసిన భాజపా నేతలు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రవర్తించటం సరికాదు. ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విభజన కష్టాల నుంచి గట్టెక్కవచ్చని ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఎన్‌డీఎ సర్కారు తీరు చూస్తే కాంగ్రెస్ వారే నయమని అనిపిస్తోంది. భాజపా నేతల తీరు మారకుంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని గమనించాలి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం