ఉత్తరాయణం

మనసు ఎన్నడూ అవిటిది కాలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు మీదపడుతున్నా
ఎగసిన ఆలోచనల మహాజ్ఞాని
వెల్లువలా మాటలు రాకున్నా
విరబూసిన విజ్ఞాన ముని
ప్రపంచంలో ఒక మూల తానున్నా,
పరిమళించిన మేధా గని
పలువురు ఇక బ్రతకరన్న
ఆలోచనలను చనిపోనీయని
అవిశ్రాంత అమరజీవి

మరణిస్తే ఎక్కడికి పోతామో
ఆలోచించవద్దని..
మనోగతం లేని ఆలోచనలను
ఇంకాస్త మెరుగుపరచమని...
స్వర్గం, నరకం బయటెక్కడా
లేనే లేవని..
బలవంతంగా వాటిని రుద్దవద్దని..

మాట నోట రాకున్నా
మహావ్యక్తి అనిపించుకున్నా
దేశాధినేతలందరూ
తన దరికే వచ్చి పలకరించినా
మాసిపోని చిరునవ్వును
ఎన్నడూ వదలలేదు కాదన్నా..
-శేష సాయికుమార్, తిరుపతి
ఆయన జీవితమే అద్భుతం
ప్రఖ్యాత ఖగోళ శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం ప్రపంచ దేశాల్లోని శాస్తవ్రేత్తలకు, ఆయన అభిమానులకు తీరని లోటు. ఇంగ్లండ్‌లో జన్మించిన హాకింగ్ కదలడానికి సహకరించని శరీరంతో చక్రాల కుర్చీకి పరిమితమైనా, కంప్యూటర్ సహాయంతో ఖగోళ పరిశోధనలు సాగించడం గొప్ప విషయం. 1970 నుండి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించారు. తనకు వ్యాధి ఉందన్న విషయం మరచిపోయి క్వాంటం థియరీ జనరల్ రిలెటివిటీలను ఉపయోగించి కృష్ణ బిలాలను కూడా రేడియేషన్‌ను వెలువరిస్తారని చెప్పడం ఆయన మేధాసంపత్తికి తార్కాణం. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా, తన ఆలోచనలతో వింత వింత ప్రయోగాలు చేస్తూ బిగ్‌బ్యాంగ్‌కు ముందు ఏమీ లేదని, విశ్వం ఆవిర్భావం ముందు ఏమి జరిగిందో వివరించారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చిన్న కణం, శక్తి పెరిగి పేలుడు సంభవించి విశ్వం ఆవిర్భావానికి దారితీసిందని బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం చెబుతోంది. అయితే పేలుడుకు ముందు ఏముందన్న విషయంపై శాస్తవ్రేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే వున్నారు. విశ్వానికి హద్దులు లేవని హాకింగ్ సిద్ధాంతం తెలుపుతోంది. ఐన్‌స్టీన్ తర్వాత అంతటి పరిశోధనలు చేసిన వ్యక్తిగా స్టీఫెన్‌కు ప్రాముఖ్యత వుంది. ఐన్‌స్టీన్ జయంతి రోజున హాకింగ్ మరణించడం యాదృచ్ఛికం. కృష్ణబిలాలు (బ్లాక్‌హోల్స్), ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ వంటి పుస్తకాలు రాశారు. భౌతిక, ఖగోళ శాస్త్ర రంగాలలో పలు సిద్ధాంతాలను ఆవిష్కరించడమే గాక, వికలాంగుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచిన స్టీఫెన్ యువతరం శాస్తవ్రేత్తలకు దిక్సూచి. ఈయనను ఆదర్శంగా తీసుకుని శాస్తవ్రేత్తలు సరికొత్త ప్రయోగాలు చేయాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట