ఉత్తరాయణం

రైల్వేజోన్‌పై సాగదీత ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి- ‘విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యం కాదు. అయినా జోన్ ఏర్పాటుతో మీకేం లాభం? ఒక జనరల్ మేనేజర్ పోస్టు రావడం తప్ప’ అని వ్యాఖ్యానించినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. అయితే ఇంకెందుకు ఆలస్యం? కేంద్రం పెద్ద ఖర్చేమీ లేని జోన్ ఏర్పాటు చేసి, తద్వారా విభజన చట్టం హామీని, ఉత్తరాంధ్ర ఆకాంక్ష సులువుగానే నెరవేర్చేయొచ్చని భావించొచ్చు కదా! అది మానేసి, జోన్ విషయంలో మిగతా రాష్ట్రాల అభిప్రాయాలంటూ నసగడం దేనికి? ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా రైల్ జోన్ ఏర్పాటుచేస్తే ఒడిశాకు గానీ, పశ్చిమ బంగకు గానీ, ఛత్తీస్‌గఢ్‌కి గానీ అభ్యంతరమెందుకు? అదే మాట వారిని నిలదీసి ఒప్పించవచ్చు కదా! ఈస్ట్‌కోస్ట్ డివిజన్‌లో రైల్వేకి అధికాదాయం సమకూరుస్తున్నది విశాఖ స్టేషనే. దీనిని కోల్పోవడం, పరిపాలనపై పట్టు కోల్పోవడం అంటే ఈస్ట్‌కోస్ట్ జోన్‌కి నష్టం. కాబట్టి పొరుగు రాష్ట్రాలు సహజంగానే వ్యతిరేకిస్తాయి. అయితే ప్రత్యేక రైల్వే జోన్ అన్నది ఆంధ్రుల హక్కు. పైగా విభజన చట్టంలో కేంద్రం పూచీపడిన అధికారిక హామీ. ఆంధ్రుల ఆకాంక్షని సాకారం చెయ్యాల్సిన కేంద్ర ప్రభుత్వం కమిటీలంటూ సాగదీసి, చివరికి పరిహాసమాడడం అప్రజాస్వామికం. ఇదే ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజాధనం వ్యయంతో పరిమిత లాభం గల బుల్లెట్ రైలు ప్రాజెక్టుని ఘనంగా తలకెత్తుతుంది. ముంబయి, అహ్మదాబాద్ నగరాల మధ్య ఎన్నో విమానాలు ఎగురుతున్నాయి. అంతకుమించి రైళ్లు, బస్సులు ఏడు గంటల ప్రయాణంతో ప్రయాణికుల్ని చేరవేస్తున్నాయి. ఆ ప్రయాణ సమయం మూడు గంటలకి తగ్గించడానికి లక్ష కోట్లు ధారబోసి ప్రయాసపడాలా! దానివల్ల కలిగే లాభమేపాటిది? ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతతో ఆలోచిస్తే అర్థవౌతుంది ఏది అవసరమో, ఏది అనవసరమో?
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం
బెదిరింపులకు లొంగుతారా?
నలభై ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత ఇపుడు ఏపీ సీఎం చంద్రబాబులో ఉత్సాహం తొణికిసలాడుతోంది. చిన్నప్పటినుంచి అతడు డిఫరెంట్ అట! ఏవేవో ఘన కార్యాలు చేయాలనిపించేదట. కేంద్ర సహకారం లేకపోయినా విదేశీ సంస్థలు తనని చూసి ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయట. ఇన్ని పరిశ్రమలు వస్తోంటే ప్రత్యేక హోదా ఎందుకట? హోదా ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని, సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆయన అనడం ఎందుకు? ఇలాంటి బెదిరింపులకు ఏ ప్రభుత్వమూ తలవంచదని ఈ అనుభవజ్ఞుడికి తెలియదా? తెలివైన నాయకుడు పార్లమెంటులో చర్చించి సాధించుకోవాలి గాని రోడ్డెక్కడం ఎందుకు?
- ధర్మతేజ, గొడారిగుంట
చట్టసభల పరువుపోతోంది
ప్రస్తుతం చట్టసభల సమావేశాలు జరుగుతున్న తీరు ప్రజలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత నిందారోపణలు చేసుకోవడంతో విలువైన సమయం హరించుకుపోతోంది. ప్రజల సమస్యలపై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను అనే్వషించవలసిన నేతలు వ్యక్తిగత దూషణలకు వేదికగా చట్టసభలను ఉపయోగించుకోవడంతో విలువైన ప్రజాధనం వృథా అవుతోంది. ప్రజాస్వామ్యవాదులకు ఉండవలసిన సహనం, సంయమనం నేటి నేతలలో లోపించడమే ఇందుకు కారణం. అధికార, ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత దూషణలకు స్వస్తి పలికాలి. సహనంతో వ్యవహరిస్తూ చట్టసభల గౌరవాన్ని కాపాడాలి.
- కాయల నాగేంద్ర, హైదరాబాద్
అలంకారానికే ఏటీఎంలు
పెద్దనోట్ల రద్దు తర్వాత ఎ.టి.ఎం.ల వద్ద రద్దీ తిరుపతిలో దైవదర్శనం కోసం కట్టిన క్యూలని తలపించింది. క్రమక్రమంగా ఆ కష్టాలు తొలగిపోయాయనుకున్నాము. కానీ ఎ.టి.ఎం.ల వద్ద తిప్పలు షరా మామూలైనాయి. బ్యాంకులలో నగదు లేక ఎ.టి.ఎం.లలో డబ్బులు ఉండటం లేదు. అత్యవసర పరిస్థితి ఏర్పడి డబ్బులు డ్రా చేయాలంటే, ఏ ఏ.టి.ఎం. వద్ద చూసినా ‘నో క్యాష్’ బోర్డులే. నగదు కోసం తిరిగి తిరిగి బైకులు, కార్లలో ఇంధనం వృథా. సమయం వృథా. ఇక సామాన్యులు, నిరుపేదల తిప్పలు ఇన్నీ అన్నీ కావు. డబ్బులే వేయనప్పుడు ఇన్ని ఎ.టి.ఎం.లు ఎందుకు? జనాలను వెర్రి వెంగళప్పలను చేయడానికా? పనిచేయని ఎ.టి.ఎం.లను తొలగించండి లేదా ఎ.టి.ఎం.ల వద్ద నిత్యం డబ్బులు నిల్వ ఉండేలా చేసి సామాన్యుల కష్టలను తొలగించండి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం