ఉత్తరాయణం

విందు రాజకీయాలు కలిసొచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2019లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ తొలి సంతకం పెడతానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. తొలి సంతకం పెట్టాలన్న తపన తీరాలంటే ఆయన ప్రధాని అవ్వాలి కదా! ఇక, ప్రత్యక్ష రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్న సోనియా గాంధీ పుత్రోత్సాహంతో ప్రాంతీయ, జాతీయ పార్టీల్నీ ఏకతాటిపైకి తెచ్చి భాజపాని చిత్తుచేయాలని 17 మంది విపక్ష నేతలను ఆ మధ్య విందుకు ఆహ్వానించారు. రాహుల్ ఆహ్వానిస్తే ఎవరూ రారని భయం కాబోలు సోనియా ఆహ్వానించారు. ఎవరి ఆశలు వారివి. ప్రధాని పదవి కోసం కొట్లాడుకోకుండా కనీసం ఎన్నికల వరకైనా కాంగ్రెస్ నేతలు కలసికట్టుగా ఉంటారని ఆశిద్దాం.
- గునే్నశ్, కొవ్వాడ
నైతికవిద్య తప్పనిసరి
సమాజంలో దుర్మార్గం నానాటికీ పెరుగుతోంది. ఎంతోమంది యువకులు విద్యార్థి దశనుండే చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రుల అతి గారాబం చేసి, పట్టించుకోకపోవడం వల్ల చాలామంది యువకులు చెడు మార్గాలు పడుతున్నారు. కొందరిలో నేరప్రవృత్తి పెరుగుతోంది. దోపిడీలు, దొంగతనాలు, స్ర్తిలపై దాడులు, అత్యాచారాలు, అక్రమాలు తదితర దుర్గుణాలను పెంచుకుంటున్నారు. సమాజానికి భారంగా తయారవుతున్నారు. నేరస్థుల కారణంగా సమాజానికి రక్షణ కరవైంది. పెద్దపెద్ద చదువులు, ఉన్నత ఉద్యోగాలు మనిషి ప్రవర్తనపై ప్రభావం చూపడం లేదు. అందుకే విద్యార్థులకు నైతిక విద్య తప్పనిసరి చేయాలి. 1వ తరగతి నుండి కళాశాల చదువువరకు తప్పనిసరిగా నైతిక విద్య అవసరం. చిన్నతనం నుంచే వారికి నీతి నిజాయితీ, మంచి ప్రవర్తన అలవడేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. వినయం, సౌశీల్యం, సత్ప్రవర్తనలను పెంచేందుకు గురువులు బాధ్యతగా కృషి చేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
కేంద్రాన్ని తిడితే నిధులొస్తాయా?
ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఎగదోసి పార్లమెంటు సాగకుండా చేసి, ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రోజూ కేంద్రాన్ని విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఏ ప్రభుత్వమైనా బ్లాక్‌మెయిలింగ్‌కి లొంగదని చంద్రబాబుకి తెలియదా? ఎన్ని నిధులిచ్చినా అవి అవినీతిపరుల జేబుల్లోకి పోతున్నాయన్న అనుమానంతోనే కేంద్రం ఏపీ సర్కారును లెక్కలు అడుగుతోంది. టీడీపీ పట్ల ఇన్నాళ్లూ సానుకూలంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక్కసారి ఎదురు తిరగడంతో చంద్రబాబు అంచనాలు తలకిందులు అయ్యాయి.
- చంద్రిక, కాకినాడ