ఉత్తరాయణం

సమన్వయ లోపంతో సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం లోపించడం ఇప్పుడు సమస్యగా మారుతోంది. ఆ మధ్య మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వివాదం సంచలనంగా మారింది. ఇప్పుడు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఆ జిల్లా కలెక్టర్ దేవసేన మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ సమస్యపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టి నాయకులకు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం కుదిరేలా చర్యలు తీసుకుంటే ప్రగతి పరుగులుతీస్తుంది.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
పాలపిట్టకు కష్టాలు
తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. విజయదశమి రోజున ఆ పక్షిని చూస్తే అంతా మంచే జరుగుతుందన్నది ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు పాలపిట్టల ప్రాణంమీదకు వచ్చింది. పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో బంధించేందుకు ఇటీవల చాలామంది ప్రయత్నించారు. పంజరాల్లో వాటిని బంధించి జమ్మికోసం వచ్చే వారికి చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దసరా రోజున ఆ పక్షులను చూస్తే శుభం జరుగుతుందన్న ఆశతో ప్రజలు కూడా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎటొచ్చీ ఈ తంతు పాలపిట్టలకు ప్రమాదంగా మారింది.
-ఎస్.ఎస్.రాజు, వనస్థలిపురం
పారామెడికల్ శిక్షణ సరికాదు
గ్రామీణ వైద్యవిధానం బలోపేతం చేసేందుకు వైద్యంలో శిక్షణ పొందిన ఎ.ఎన్.ఎమ్, ఆశ కార్యకర్తలు సేవలు అందిస్తున్నారు. అయితే ఎటువంటి వైద్య పరమైన అర్హతలు లేని గ్రామీణులకు పారామెడికల్ శిక్షణతో ఆరోగ్య సేవలకు అర్హులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 465 ఉత్తర్వును విడుదల చేసింది. రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఉత్తర్వులు విడుదల చేసినమాట నిజమే. అయితే క్షేత్రస్థాయిలో ఇది సమస్యలకు కారణం కానున్నది. నిపుణులైన వైద్యుల వద్ద శిక్షణ పొంది, ప్రజారోగ్యంపై దీర్ఘకాలం అవగాహన కల్పించుకున్న ఆర్‌ఎమ్‌పి, పిఎమ్‌పిలుగా పట్టా పొందిన పల్లెల్లో నామమాత్ర రుసుముతో విశిష్ట సేవలందిస్తున్నవారు చాలామంది ఉన్నారు. అయితే వారి సేవలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఇప్పుడు సాధారణ శిక్షణ పొందినవారికి ప్రజారోగ్య బాధ్యతలు అప్పగించడంలో అర్ధం లేదు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం