ఉత్తరాయణం

ఉత్తరాలు- ఉత్త ‘రాళ్లు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నటి దాకా మిత్రులుగా కొనసాగిన ఎన్డీఏ, తెలుగుదేశం పాలక పక్షాలు ‘బంధాన్ని’ వదులుకొని, ఇప్పుడు ఉత్తరాల యుద్ధం మొదలుపెట్టాయి. భాజపా అధ్యక్షుడు అమిత్ షా తొమ్మిది పేజీల నిందారోపణల లేఖను ఏపీ సీఎం చంద్రబాబుకి రాయగా, చంద్రబాబు అంతకన్నా పెద్దదైన బుక్‌లెట్ రూపంలో తిరుగు జాబు పంపారు. అయితే లేఖలన్నీ, లెక్కలన్నీ అందరికీ తెలిసిన తీరులోనే సాగుతున్నాయి. ‘రాజకీయ లబ్దిని ఆశించే కోణంలో కాకుండా రాష్ట్భ్రావృద్ధి కోణంలో ఆలోచిస్తే మమ్మల్ని అర్థం చేసుకొనేవాడివి’ అంటూ అమిత్ షా నిందిస్తే, ‘మా మీద ఉత్తరాల రూపంలో రువ్వే రాళ్లను పోలవరంలో వేస్తే డ్యామ్ నిర్మాణం పూర్తయ్యేది’ అన్నట్టుగా చంద్రబాబు బదులిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయిన పిదప ఇంకా ఆ చట్టంలోని అంశాలపై ఈ రకమైన యుద్ధాలు అధికార పక్షాల మధ్య జరగడం హర్షణీయం కాదు, సమర్థనీయం అంతకన్నా కాదు. ఆరోపణల్లేని అసలు సిసలైన అంకెలు ప్రజలకు కావాలి. తిట్ల దండకాల ఫలితంగా ప్రజల నుండి ఇరువురికీ దక్కే మార్కులేవీ ఉండవు. కేంద్రం రెండు లక్షల కోట్లను రాష్ట్రానికి నాలుగేళ్లలో కేటాయించినట్లు భాజపా అధ్యక్షుడు చెప్పారు. ఆ నిధులు మిగతా రాష్ట్రాలకు మల్లే రొటీన్‌గా, వాటాగా మన రాష్ట్రానికి వచ్చాయా? లేక విభజన చట్టం మేరకు ప్రత్యేకంగా వచ్చాయా? అన్న స్పష్టత కావాలి. ప్రత్యేక హోదా ఇవ్వడం, ఇవ్వకపోవడంలో 14వ ఆర్థిక సంఘం పాత్ర ముఖ్యం కానపుడు, దాని గురించే మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తున్నారు? ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకి ఇంత తక్కువగా నిధులు కేటాయిస్తే అవి పూర్తికావడానికి ఎనే్నళ్లు పడుతుంది? ఇలాంటి విషయాలపై కచ్చితమైన జవాబులిస్తే భాజపాపై ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. కేంద్రం నుండి సహకారం ఇంత తీసికట్టుగా ఉన్నపుడు ప్రజల్ని చైతన్యపరచాల్సిన తెదేపా నాలుగేళ్లుగా చూసీ చూడనట్టుగా ఎందుకు ప్రవర్తించిందో స్పష్టపర్చాలి. చేతికి అందాల్సిన సాయం సమయానికి అందకపోతే నష్టమెంతో తెలిసీ జాగుచేయడం ఎందుకు జరిగింది? ఊబిలో మునిగిపోతున్న రాష్రానికి పైకి లాగే దిశగా, ఓ హక్కుగా రావాల్సిన చేయూత రాకుండా పోవడం, బాధ్యులు మిన్నకుండా ఉండడం రెండూ తప్పులే. సరిదిద్దుకోవాల్సిన సమయం ఇదే.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
కేంద్ర నిధులకు లెక్క చూపరా?
ప్రత్యేక ప్యాకేజీ క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని, ఖర్చులకు తగిన లెక్కలు చూపిస్తే అదనపు నిధులు విడుదల చేస్తామని కేంద్రం అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల ఖర్చుపై వివరాలు చెప్పడం లేదు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల వూపింది. ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం అడగటంలో తప్పేముంది? ఆ వివరాలు ఇచ్చినప్పటికీ అదనపు నిధులు రాకుంటే కేంద్ర ప్రభుత్వానిదే తప్పవుతుంది. ఇన్నాళ్లూ వౌనం వహించి ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ‘హోదా’ కావాలంటూ ఆందోళనకు దిగటం సరైనదా? కేంద్రంపై వ్యతిరేకతను ప్రదర్శించడం సరైనది గాదు. రాజకీయ కోణంలో ఆలోచిస్తూ చేపట్టిన ఆందోళనలకు ఫలితం ఉంటుందా?
-జి.శ్రీనివాసులు, అనంతపురము
బాల్య వివాహాలను ఆపాలి
ఎంతోమంది సంఘ సంస్కర్తలు పోరాటాలు సలిపినా, చదువుకున్నవారి సంఖ్య ఎంతగా వృద్ధి అవుతున్నా, మనం కంప్యూటర్ యుగంలోకి ప్రవేశించినా- నేటికీ కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఆగడం లేదు. పేదరికం, అధిక సంతానం, అవిద్య వంటి కారణాలు బాల్య వివాహాలకు దారితీస్తున్నాయి. వీటిని ఆపడానికి మరిన్ని పోరాటాలు జరగాలి. నిరుపేద ఆడపిల్లల ఉన్నత చదువులకు ప్రభుత్వం, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు సాయం చేయాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో ఆడపిల్లలను ప్రేమోన్మాదుల నుండి కాపాడాలి. ఆడపిల్లల చేత మధ్యలోనే చదువు మాన్పించిన తల్లిదండ్రులకు స్ర్తివిద్య ప్రాధాన్యతను తెలియజేయాలి. బాల్య వివాహాలు జరగనివ్వకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ఆటో ప్రమాదాలకు అంతం లేదా?
నిజామాబాద్ జిల్లా మెండోర గ్రామ శివారులో బావిలోకి ఆటో దూసుకెళ్లిన సంఘటనలో 11మంది మృత్యువాత పడడం విషాదకరం. మృతులలో ఐదుగురు చిన్నారులు ఉండడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. అనుభవం లేని ఆటోడ్రైవర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రకటించారు. అంతేగాక పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని, మితిమీరిన వేగంతో ప్రయాణించి రోడ్డుపై గుంతను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలోకి ఆటో పడిపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఉదంతం ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఆటోప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా సెవెన్ సీటర్ ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కొందరు ఆటోలను నడుపుతున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని ఆటోలు రోడ్లపై సంచరిస్తున్నాయి. వివిధ ప్రదేశాలకు కూలీ పనులకోసం వెళ్ళేవారు ఆటోలను ఆశ్రయిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. రవాణా, పోలీసు అధికారుల తనిఖీలు లేకపోవడం, ఫిట్‌నెస్ లేని ఆటోలను నడుపుతుండడం, మద్యం సేవించి ఆటోలను నడపడం, త్వరగా గమ్యస్థానానికి వెళ్లాలనే ఆతృత, ఎంత ఎక్కువమందిని తీసుకెళ్తే అంత ఎక్కువ సంపాదన అని ఆటోడ్రైవర్లు ఆశపడడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కొంతమంది డ్రైవర్లు విచక్షణ కోల్పోయి ఆటోలు నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. పరిమితికి మించి ప్రయాణీకులను తీసుకువెళ్ళే ఆటోలను అధికారులు సీజ్ చేయాలి. ఆటో డ్రైవర్లకు కౌనె్సలింగ్ నిర్వహించాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జెడలపేట