ఉత్తరాయణం

ఉద్యోగ భద్రత కోసం నిరీక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఒప్పంద, కంటింజెంట్ ఉద్యోగులు తమ సర్వీసులు క్రమబద్ధం కావాలంటూ దశాబ్దాల తరబడి నిరీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వు 143 (తే 16- 3-1984దీ) ప్రకారం ఐదు సంవత్సరాలు సేవలు పూర్తిచేసిన వారిని , ప్రస్తుతం పనిచేసేవారిని (ఐదేళ్లు నిండగానే) పర్మనెంట్ చేయాలని స్పష్టం చేస్తోంది. సుమారు లక్షా పాతికవేలమందికి ఉద్యోగ భద్రత ఏర్పడింది. 25-11-1993న అప్పటి ప్రభుత్వం ఐదేళ్ళు నిండినవారికి ఉద్యోగ భద్రత కల్పించింది. పిడబ్ల్యు వర్క్‌షాపు- ధవళేశ్వరంలో 1991 నుండి పనిచేస్తూ పదవీ విరమణ చేసిన, చనిపోయినవారు మినహా మిగిలిన ఇరవై మంది ఇంకా దినసరి కార్మికులుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరి సేవలు అవసరం. లాకులు, ఎత్తిపోతల పథకాలు, మరమ్మతులు వంటి పనులతో జల వనరుల శాఖలో వీరు పనులు చేస్తుంటారు. వారు పనిలో చేరిన పిదప సుమారు రెండు వందల మంది వరకు పదవీ విరమణ చేశారు. మరణించటం జరిగింది. వీరు ప్రస్తుతం యాభై సంవత్సరాల వయసు పైబడినవారే. పర్మనెంట్ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే వారసులకు కారుణ్య నియామకం, భార్యకు పింఛన్ లభిస్తుంది. ప్రస్తుతం పని వదల్లేక, మరో పనికి మారలేక ఎప్పటికైనా ఉద్యోగ భద్రత కలుగుతుందనే నమ్మకంతో వీరంతా సుమారు ఇరవై ఏడేళ్లు ఈడ్చుకువచ్చారు. గత ఎన్నికల ముందు ఈ వర్గాలకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సుమారు నాలుగేళ్లు గడచినా ఈనాటి వరకు వీరి సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించిన జాడ లేదు. ఇటువంటివారు అతికొద్దిమంది మాత్రమే పనిచేస్తున్నారు. జలవనరుల శాఖలో ఖాళీలను, అనాదిగా చేస్తున్నవారి సేవలను గుర్తించి వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
‘కూటమి’ కూర్పు ఎలా..
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను సమైక్యపరచి థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుచేసే దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు సానుకూలతను తెలిపాయి. డిఎంకె, జనసేన వంటివి సుముఖంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జాబితాలోని కొన్ని అంశాలను రాష్ట్రాలకు బదలాయింపు చేసుకునేందుకు, రాష్టల్రే కొన్ని అంశాలపై స్వయంగా నిర్ణయాలు తీసుకొనే విధంగా థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుకు కృషి జరుగుతోంది. ఎన్ని పార్టీలు ఈ ఫ్రంట్‌లో భాగస్వాములవుతాయో వేచి చూడాల్సి ఉంది. అయితే, కదలికలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. సారథిని ఎన్నుకోవాల్సిన అవసరం వుంది. జాతీయ రాజకీయాలలోకి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అభ్యుదయ భావాలున్న వామపక్షాలు ఎవరివైపు మొగ్గుచూపుతాయో? తగు సమయం వున్నందువల్ల ఆ పార్టీలు మిన్నకుండి వున్నాయి. కాంగ్రెస్, బిజెపిలను ఎదుర్కొనేందుకు కేసీఆర్ నడుం బిగించారు. పొత్తులు, ఎత్తులు ఏవిధంగా వుంటాయో కాలమే నిర్ణయిస్తుంది.
-అయినం రఘునాథరావు, ఖమ్మం
ఇంటింటా ప్రచారం దేనికి?
ఈమధ్య ఏపీ సీఎం చంద్రబాబుకి ‘గోబెల్స్’ ఆరాధ్య దైవం అయినట్టున్నాడు. జగన్, పవన్, భాజపా నేతలు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని ఇంటింటా ప్రచారం చెయ్యమని ఆయన తన పార్టీ క్యాడర్‌ని ఆదేశించాడు. కేసుల మాఫీ కోసమే జగన్ ప్రధాని మోదీ చుట్టూ తిరుగుతుంటే- చంద్రబాబు ఎవరి చుట్టూ తిరిగి తనపై కేసులు లేకుండా చూసుకున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పవన్, భాజపా కుమ్మక్కు అయితే- భాజపాకి ఆగర్భ శత్రువులైన వామపక్షాలతో పవన్ కలిసి హోదా కోసం కోర్టుకి వెళ్తానంటాడా? దీనికి చంద్రబాబే జవాబు చెప్పాలి.
-సి.మైథిలి, సర్పవరం