ఉత్తరాయణం

అప్పు.. మొదటికే ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుండి బ్యాండ్ల రూపంలో అప్పులు చెయ్యడానికి సిద్ధపడుతున్నారు. బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు. ఈ నిర్ణయం సబబు కాదేమో? ఇప్పటికే రాష్ట్రం నెత్తిమీద రూ. 2,25,000 కోట్ల ఋణం ఉంది. ఇది ఈ ఏడాది బడ్జెట్ కన్నా ఎక్కువ. అప్పులు చేయకుండా అభివృద్ధి అసాధ్యమే. కానీ మితిమీరిన అప్పులతో ముప్పే. ఏ ఉద్దేశంతో రుణం కోరుతున్నామో, దానివల్ల ఎలాంటి ఫలితాల్ని ఆశిస్తున్నామో, అందులో సంభావ్యత ఎంతో బేరీజు వేసుకోవాలి- ఒక వ్యక్తి అయినా, రాష్టమ్రైనా. ప్రభుత్వం తరఫున రైతు సాధికార సంస్థ మూడు వేల కోట్ల రుణాన్ని వివిధ బ్యాంకుల నుండి తీసుకుంది. ఇంకో వెయ్యి కోట్లు ఆంధ్రాబ్యాంక్ నుండి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆ నిధులతో రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. కష్టమైనా అది ఆమోదయోగ్యమే. రైతుకి ఊరట వెంటనే అవసరం కనుక. విద్య, ప్రజారోగ్యం, వౌలిక సౌకర్యాల కల్పనకు, ఆదాయం పెంపుకోసం ఎన్ని పాట్లు పడినా తప్పులేదు. కానీ రాజధాని నిర్మాణానికి అప్పులు అవసరమా? అది ప్రాధాన్యతా అంశం కాదు జాతి నిర్మాణానికి. అధిక ప్రయోజనం చేకూర్చే పనులు వేరే ఉన్నాయి. రాజధాని పునాదులను అప్పుల మీద నిర్మించబూనడం నగుబాటు. ప్రభుత్వం తమ ప్రాధాన్యతలను పునర్ నిర్వచించుకోవాలి.
-డా. డి.వి.జి. శంకర్‌రావు, పార్వతీపురం
‘విద్య’లో సంస్కరణలు ఏవీ?
నేటి విద్యా విధానంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గడం లేదు. మార్కులు, గ్రేడులే లక్ష్యంగా తప్ప ఆటపాటలు, కళలు, నైతిక విద్య వంటివి కరవైపోయాయి. ఫలితంగా చాలామంది విద్యార్థుల ప్రవర్తన గాడి తప్పుతోంది. చదువుతోపాటు ఆటపాటలు తప్పనిసరిగా ఉండాలి. కళలనూ నేర్పాలి. 1వ తరగతి నుండి కళాశాల స్థాయి వరకు నైతిక విద్య తప్పనిసరి చేయాలి. విద్యార్థులకు క్రమం తప్పకుండా పురాణాలు, జానపద, చారిత్రాత్మక, సాంఘిక కథలను చెప్పాలి. వారిచేత చెప్పించాలి. మంచి నీతులను గ్రహింపజేయాలి. నైతిక విద్యకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమిస్తే ఇది సఫలం అవుతుంది. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో నైతిక విద్య తప్పనిసరి చేయాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం