ఉత్తరాయణం

నీటి సమస్యపై నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మనుగడకు నీరు ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. ప్రతి వ్యక్తి రోజుకు ఆరు లీటర్ల పరిశుభ్రమైన మంచినీళ్ళు తాగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో సూచించింది. వేసవికాలం ఆరంభంలోనే తెలంగాణలో మంచినీటికి కటకట ఏర్పడి ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇప్పుడే నీటికొరత ఈ విధంగా ఉంటే మే, జూన్‌లలో పరిస్థితి ఏమిటి? తాగునీటి సమస్య పట్ల ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించడం క్షంతవ్యం కాదు. మరోవైపు కలుషిత జలాలతో అతిసార వ్యాధి వ్యాపిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. ఈసారి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంచినీటి కొరత దారుణంగా ఉంది. పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలు మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ నీళ్ళను కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడింది. రక్షిత మంచినీటి పథకాలు మూలనపడడంతో ప్రైవేటు వాటర్ ప్లాంట్లు విరివిగా వెలుస్తున్నాయి. ప్రజలకు నీటి సౌకర్యం కల్పించే బాధ్యత పాలకులు మరచిపోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు వచ్చే నియోజకవర్గ నిధులను మంచినీటి సౌకర్యాలను కల్పించేందుకు వినియోగించాలి. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయినా ఇంకా తాగునీటి సమస్య కొనసాగడం దారుణం.
- గూరుడు అశోక్, గోదూర్
‘అవిశ్వాస’ రాజకీయం!
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని వైకాపా అధినేత జగన్ ప్రకటించినపుడు- మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం కుదరదని ఈసడించిన ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు అవిశ్వాసం అంటూ అదే పల్లవి అందుకున్నారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ భాజపాపై దుమ్మెత్తిపోసి బద్నామ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో తనకు లాభిస్తుందని చంద్రబాబు ఆలోచన. అయితే ఆరోపణలకు సమాధానం చెప్పేటప్పుడు ప్రతిపక్షాలు గలభా సృష్టించి ప్రభుత్వ వాదన ప్రజలకు చేరకుండా చేస్తాయోమోనని భాజపా అనుమానం. అందుకే అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు రాకుండా చూస్తోంది భాజపా.
- శుభ, కాకినాడ
కాంగ్రెస్ మాటల్ని నమ్మాలా?
‘కాంగ్రెస్ పార్టీ గతంలో ఏపీకి ‘హోదా’ ఇస్తామన్నా, మీకెందుకు సాధ్యం కాదు’ అని ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు భాజపాని ప్రశ్నించడం అమాయకత్వమా? నంగనాచి తనమా? నిజంగా ‘హోదా’ ఇవ్వదలచుకుంటే ఆ విషయాన్ని కాంగ్రెస్ విభజన చట్టంలోనే చెప్పేది. ఇప్పుడు అధికారంలో లేని, వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని కాంగ్రెస్ ఇచ్చే హామీలను ఎవరు నమ్ముతారు? ఒకాయన తన ఆస్తిని సంతానానికి, భార్యకు ఇచ్చేస్తూ వీలునామా రాయించాడు. నీ ఆస్తులు ఎక్కడున్నాయని అడిగితే- ‘ప్రస్తుతం రూపాయి కూడా లేదు. ఇకపై సంపాదించాలి’ అన్నాడట! అలా ఉంది కాంగ్రెస్ వ్యవహారం!
- ప్రసాద్, గొడారిగుంట