ఉత్తరాయణం

ప్రజలపై పన్ను భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడం సామాన్యుడి నడ్డి విరచడమే. రోజువారీ ధరల నిర్ణయం తర్వాత ఆయిల్ ధరలు శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతూ పోవడమే తప్ప ఒక్కసారైనా తగ్గింది లేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరకు అనుగుణంగా పెట్రో ధరలు సవరిస్తామన్న ప్రభుత్వం అక్కడ తగ్గినా ఇక్కడ తగ్గించింది లేదు. అక్కడ తగ్గిన మేరకు ఇక్కడ పన్నుల రూపంలో పెంచి తద్వారా వచ్చిన లాభాన్ని ఖజానాలో జమ చెయ్యడమే తప్ప సామాన్యునికి ఊరట కలిగించిన పాపాన పోలేదు. కేంద్రం, రాష్ట్రం విధించే పన్నులు కూడా విపరీతంగా ఉంటున్నాయి. భారత్‌లో నేటి పెట్రో ధరలు దక్షిణాసియాలోనే అధికం అన్న విషయమే ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగేళ్లలో కేంద్రం తొమ్మిదిసార్లు ఎక్స్‌యిజ్ సుంకం పెంచిందంటేనే ప్రజలపై ప్రభుత్వ సానుభూతి ఏపాటిదో అర్థవౌతోంది. కేంద్రంతో ‘సై’ అంటూ రాష్ట్రం తన వంతు వడ్డిస్తోంది. రవాణా రంగం ప్రభావితం కావడంతో ధరలు దిగిరాక ప్రజలు ఆ భారం మోయాల్సి వస్తుంది. రోజువారీ పెట్రో ధరలు పెరగడంతో పోటీపడుతూ, రోజుకో బ్యాంకు దోపిడీ వ్యవహారం బయటపడుతోంది. అన్నీ వేల కోట్లరూపాయల కుంభకోణాలే. తాజాగా ఐసిఐసి బ్యాంకు సహకారంతో వీడియోకాన్ సంస్థ పోటీవేసిన 3,250 కోట్ల ప్రజాధనం లూటీ, భారీ దోపిడీలు బయటపడిన తర్వాతైనా వాటిని అరికట్టే చర్యలు తక్కువే. పన్నుల్ని కాస్తాతగ్గించడానికి ఆర్థిక సూత్రాలు వల్లించే ప్రభుత్వం, కార్పొరేట్, బ్యాంకు దోపిడీల్ని నియంత్రించడానికి వౌనం పాటిస్తోంది. ఇది ప్రజలకు పుండు మీద పెట్రోల్ పోసినట్టే. పెట్రో ధరల్ని జిఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చి నిలకడగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
రైల్వేజోన్ కోసం ఉద్యమం
గతంలో ఒడిశాకు చెందిన ఎంపీ రైల్వేశాఖ సహాయ మంత్రిగా వున్నపుడు ఈస్టుకోస్టు రైల్వే జోన్‌ను ఏర్పాటు చేశారు. అప్పుడే ఏపీలోని ఇచ్ఛాపురం నుండి దువ్వాడ వరకూ ఈ జోన్‌లో కలిపారు. అపుడు ఏపీకి చెందిన నేతలెవ్వరూ విశాఖ రైల్వే జోన్ గూర్చి మాట్లాడలేదు. ఇపుడు అన్ని పార్టీలకు చెందిన నేతలూ విశాఖకు అన్యాయం జరిగిందని ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయ లాభం కోసం నేతలు మళ్లీ ఇపుడు రైల్వే జోన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. వీరి వల్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయా? జనం ఉద్యమిస్తేనే విశాఖకు రైల్వే జోన్ కల సాకారం అవుతుంది.
- సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
చంద్రబాబు విపరీత ప్రచారం
‘ఒకే విషయాన్ని- అది అబద్ధమైనా సరే పదే పదే చెప్తే ప్రజలు నమ్మేస్తారు’ అన్నది గోబెల్స్ సిద్ధాంతం. దాన్ని ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తున్నట్టు అనిపిస్తోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సకల అనర్థాలకు భాజపాయే కారణం అని ఆయన ప్రజల్లోకి ప్రచారం చేస్తున్నారు. ఇందుకు తగిన ప్రతిస్పందన గాని, ఖండనలు గాని భాజపా నుంచి కూడా రావడం లేదు. భాజపా రాష్ట్ర నేతల అరకొర ప్రకటనలు ప్రజల్లోకి ఎక్కడం లేదు. జాతీయ స్థాయిలో ఆ మాత్రం ప్రతిస్పందనా లేదు. భాజపాలో ప్రజా సంబంధాల శాఖ లేదా? ఉంటే అది సరిగా పనిచేయడం లేదనే చెప్పాలి.
-ప్రవీణ్, కాకినాడ