ఉత్తరాయణం

అంబేద్కర్ చెప్పిందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ రాజ్యాంగ రచనకు సారథ్యం వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటలను నేడు రాజకీయ నేతలు పెడచెవిన పెడుతున్నారు. అణగారిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కేవలం పది సంవత్సరాలు కొనసాగించి, ఆ తర్వాత వాటిని రద్దు చేయాలని అలనాడు అంబేద్కర్ కోరారు. ఎంతో దూరదృష్టితో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే, ఓటుబ్యాంకు రాజకీయాలలో మునిగి తేలుతున్న రాజకీయ పార్టీలు రిజర్వేషన్లను పొడిగిస్తూనే వున్నాయి. ఓట్ల కోసం మరికొన్ని వర్గాలకు రిజర్వేషన్లను ఎర వేస్తున్నారు. రాజకీయ నాయకులకు దేశ క్షేమం కన్నా- ఓట్లు, పదవులే ముఖ్యం. ఇప్పటికైనా అంబేద్కర్ కోరికను మన్నించి రిజర్వేషన్లను రద్దు చేయాలి. ఏ రకమైన రిజర్వేషన్లయినా దేశ ప్రజలను విభజించేందుకు తప్ప దేశ క్షేమానికి, జాతి ఐక్యతకు ఉపయోగపడవు. కులాన్ని, మతాన్ని దూరం పెట్టిననాడే దేశం ఒకటిగా మసలుతుంది.
- జి.శ్రీనివాసులు, అనంతపురము
మొక్కుబడి ఉత్సవాలు..
మహనీయుల జయంతి, వర్ధంతులను, వివిధ దినోత్సవాలను నిర్దేశించిన రోజునే నిర్వహించాలి. అయితే ఇటీవల కొన్ని సంస్థలు ఈ సంప్రదాయానికి తిలోదకాలివ్వడం విచారకరం. తమకు తీరుబడి అయిన రోజున వాటిని జరపడాన్ని హర్షించలేం. నిర్ణీత తేదీకి బదులుగా ముందు వచ్చే ఆదివారమో లేదా తరువాత వచ్చే ఆదివారమో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న దాఖలాలు కోకొల్లలు. సెలవుదినం వృథా కారాదన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. పనిదినాల్లో దినోత్సవాలు వస్తే సాయంత్రం పూట వీటిని నిర్వహించుకునే వెసులుబాటు ఉండనే ఉంది. వేరే రోజుల్లో రాబోయే లేదా గడిచిన దినోత్సవాలను జరపడం మంచిది కాదు. ఈ విషయాన్ని ఆయా సంస్థల ప్రతినిధులు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కాగా ఆరోజు పనిదినం కావడంతో చాలా సంస్థలు అంతకుముందు ఆదివారం (18న) నాడు కార్యక్రమాలు జరిపాయి. నిర్దేశించిన రోజునే దినోత్సవాలు జరపడం సహేతుకంగా ఉంటుంది.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు