ఉత్తరాయణం

నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఉద్యోగులకు జీతభత్యాలను, పదవీ విరమణ వయసును పెంచుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో రిటైర్మెంటు వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచింది. కేంద్రం కూడా అదే బాటలో వుందనే వార్త నిజమైతే లక్షలాది మంది నిరుద్యోగుల నోట మట్టికొట్టినట్లే. ఇప్పటికే కంప్యూటరీకరణ, కారుణ్య నియామకాలు, అత్యవసరం పేరిట రిటైరైన వారిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తుంటే నానాటికీ రిక్రూట్‌మెంట్లు తగ్గుతున్నాయి. ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లతో గట్టెక్కుతామనే భ్రమతో ఇలాచేస్తే పేద నిరుద్యోగుల బ్రతుకులు నాశనమవుతాయి. ఉద్యోగ భద్రత లేని ఐటీ రంగం మినహా ప్రజల సగటు ఆదాయం కంటే ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఎనిమిది రెట్లు ఎక్కువట. (అగ్ర రాజ్యాల్లో సైతం నాలుగైదు రెట్లు మాత్రమే) అందుకే నేడు సంపన్నులు, ఉన్నత విద్యావంతులు సైతం ప్రభుత్వోద్యోగాలకు ఎగబడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం నిరుద్యోగ యువత మనదేశంలోనే ఉంది.
జీవనోపాధి లేక ఏటా ఎంతోమంది పేద నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకేనేమో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యువత నష్టపోకూడదని రిటైర్మెంటు వయస్సును పెంచే యోచన చేయలేదు. ప్రభుత్వోద్యోగులకూ సామాజిక బాధ్యత వున్నది గనుక, లక్షలాది ఖాళీ పోస్టుల భర్తీకి పట్టుబట్టితే నిరుద్యోగులకూ మేలుచేసిన వారవుతారు. నిరుద్యోగ భృతితో సమస్య తీరదు.
అర్హతలుండీ అవకాశాలు రాని పేద యువత కోసం వామపక్షాలు పోరాడాలి. పాతిక, ముప్పై సంవత్సరాల సర్వీసు తరువాత నూటికి తొంబయి మంది స్థిరపడి వుంటారు. రిటైర్మెంటు పిమ్మట ప్రశాంత జీవనానికి వారికి, కుటుంబీకులకు పెన్షన్లు, వైద్య సదుపాయాలు ఉంటాయి. అమెరికా, జపాన్ వంటి అల్పజనాభా దేశాల్లో యువత సంఖ్య తగ్గిపోతుంది గనుక అక్కడ పదవీ విరమణ వయస్సు పెంచుతున్నారు. ఇక్కడ మన పరిస్థితి వేరు. తగిన ఉపాధి లభించక యువత విదేశాల బాటపట్టి అక్కడా అవస్థలు పడటం, ఇక్కడేమో యువతలో నేరప్రవృత్తి పెరగటం చూస్తున్నాం. యువతకూ గౌరవంగా జీవించే హక్కుంది. యువశక్తిని సద్వినియోగం చేసుకుంటేనే సమాజానికి భద్రత అని గ్రహించాలి. ప్రభుత్వాలు, పార్టీలు యువతను నిర్లక్ష్యం చేస్తే సమాజంలో అశాంతి, అరాచకం పెరిగే ప్రమాదం ఉంది.

- తిరుమలశెట్టి సాంబశివరావు సెల్: 92478 70141