ఉత్తరాయణం

మృగాలు సిగ్గుపడుతున్నాయ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడో అసీఫా.. ఇక్కడో అయేషా
నిమిషానికో నిర్భయ.. అడుగుకో అనామిక
బడిలో, గుడిలో
నగరిలో, నడివీధిలో, నట్టడివిలో
పుణ్యభూమి భారతావనిలో

ఎటుచూసినా పసిమొగ్గల ఆర్తనాదాలే
విషమించిన, విషనాగుల పశువాంఛకు
అకారణంగా.. అమానుషంగా
నేలరాలుతోన్న పసిడి ప్రాణాలే

నిర్బల చట్టాలూ,
దుర్బల పాలకులూ,
తోడేళ్లకు తోడుగా తోడెళ్ళే రాబందులు
కామాంధుల కొమ్ము కాసే నాగరిక ఉన్మాదులు
నిర్భయంగా రొమ్ము విరిచే వేళ
బర్బరులకు వెయ్యగలమా పగ్గాలు?

క్రూరమృగాలూ సిగ్గుపడుతున్నాయి
మృగాళ్ల స్వేచ్ఛను చూసి
సగం చచ్చుబడ్డ శిక్షాస్మృతిని చూసి
-డా డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ఎన్నాళ్లీ దుర్మార్గాలు?
దేశంలో రోజురోజుకీ చిన్నారి బాలికలు మొదలుకొని, వృద్ధుల వరకూ స్ర్తిలకు రక్షణ కరవైంది. కామాంధుల చేతిలో ఎంతోమంది అతివలు అనునిత్యం బలి అవుతున్నా పాలకులకు చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం. పాఠశాల స్థాయి విద్యార్థులు మొదలుకొని, వృద్ధుల వరకూ చాలామంది మగవాళ్ళ ఆలోచనలు దుర్మార్గంలో వెళ్తున్నాయి. ఫలితంగా బాలికలపై, మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, భౌతిక దాడులు అధికమయ్యాయి. ఈ భారతావనిపై అత్యాచారాలు చేసే మృగాళ్ళు స్వేచ్ఛగా, దర్జాగా బతుకుతుండగా బాధిత మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడమో, జీవితాంతం నరకయాతన పడటమో జరుగుతోంది. ఈ ‘నాగరిక’ యుగంలో ఇది నిజంగా సిగ్గుచేటు. మహిళలకు రక్షణ కల్పించడం పాలకుల తక్షణ కర్తవ్యం. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, ప్రేమోన్మాద దాడులు, గృహహింసకు పాల్పడుతున్న వారికి కొన్ని దేశాలలో అమలవుతున్న అత్యంత కఠినమైన శిక్షలు తక్షణం మనదేశంలోనూ విధించేలా చర్యలు తీసుకోవాలి. మాతృ స్వరూపమైన స్ర్తిని స్వేచ్ఛగా బతకనివ్వండి. మహిళల రక్షణకై కఠినమైన చర్యలను ఆచరణలో చూపాలి. ఎన్నికలలో పోటీ చేసేవారు కూడా తమ వాగ్దానాలతో మహిళల రక్షణకు కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్