ఉత్తరాయణం

వేసవి సెలవుల్లో తరగతులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ఇంటర్ బోర్డు కళాశాలలకు సెలవులు ప్రకటించినా హైదరాబాద్‌లో యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయ. ఒకవైపు ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు కనీసం వారం రోజులపాటు కుటుంబ సభ్యులతో గడపకుండా తిరిగి ద్వితీయ సంవత్సరం తరగతులకు వెళ్లాల్సి రావడంతో, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతిరోజూ సుమారు పదహారుగంటలకుపైగా విద్యార్థులు తరగతి గదులలో వుంటూ తీవ్ర సంఘర్షణకు గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ర్యాంకులు, మార్కులు బాగా రావాలనే లక్ష్యంతో వేసవి తరగతులకు పంపుతున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా వివిధ జిల్లా కేంద్రాల్లోని కార్పొరేటు కాలేజీలలో సైతం వేసవి తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తున్నారు. విద్యార్థులకు ఇష్టం లేకున్నా తరగతులకు హాజరుకావాల్సిన దుస్థితి దాపురించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని మంత్రులు, ఎంపిలకు కార్పొరేటు కాలేజీలు వుండడంతో అధికారులు కూడా చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. విద్యార్థుల మెదడు పనితీరుపై ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నా కళాశాలలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. వేసవిలో తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలపై అధికారులు దాడులు నిర్వహించి వాటి గుర్తింపును రద్దుచేయాలి. విద్యార్థుల వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రాధాన్యతనివ్వాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
జాతీయ పార్టీల పరిహాస దీక్షలు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైకాపా పార్లమెంటు సభ్యులు ఆమరణ నిరాహారదీక్ష ప్రశంసనీయం. వయోభారాన్ని లక్ష్యపెట్టకుండా కొందరు ఎంపీలు దీక్ష చేయడంలో అర్థముంది. అయితే, ఇందుకు భిన్నంగా జాతీయ పార్టీలు పరిహాస దీక్షలు చేస్తున్నట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ సమైక్యత కోసమంటూ ఒక రోజు నిరాహార దీక్ష పాటించింది. ఉదయం ఎనిమిదిన్నరకు కడుపు నిండా టిఫిన్ తిని అనుచరులు దీక్షకు కూర్చుంటే, ఆ పార్టీ అధినాయకుడు రాహుల్ వారితో మధ్యాహ్నం ఒకటిన్నరకు జత కలిశారు. మధ్యాహ్నం భోజనం చేసి, చిన్న కునుకు తీసి వచ్చాడో లేదో తెలియదు కానీ ఆ విధంగా ఫలహార దీక్ష చేసి, నిరాహారదీక్ష అనడమే పెద్ద జోక్. ఇక భాజపా శ్రేణులతోపాటు ప్రధాని మోదీ ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. దేవీ నవరాత్రుల్లో తొమ్మిదేసి రోజులు ఏకబిగిన నిరాహారం పాటించే మోదీకి ఇదో లెక్క కాకపోవచ్చు. కానీ దీక్షకు చెబుతున్న కారణమే కామెడీగా వుంది. పార్లమెంటు సమావేశాల్ని ప్రతిపక్షాలు పాడుచేసినందుకట! లోక్‌సభ నాయకుడిగా ప్రధాని- ఆ వాయిదాల సందర్భంలోనే ఈ దీక్షేదో చేస్తే ఫలితం ఉండేది. పార్లమెంటు నిరవధిక వాయిదా తర్వాత ఈ దీక్షతో ఉపయోగమేమిటి? వారిది ఫలహారదీక్షయితే, వీరిది పాప పరిహారదీక్ష. మొత్తానికి ఇరు జాతీయ పక్షాలవీ పరిహాస దీక్షలే.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం