ఉత్తరాయణం

‘క్షయ’ని తరిమికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2025 నాటికి క్షయ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ఇటీవల సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో క్షయవ్యాధి పీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తుమ్మినా, దగ్గినా ఒకరినుంచి మరొకరికి సులువుగా వ్యాపించడంతో ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది. ప్రారంభ దశలో గుర్తించి మందులు వాడేవారు అరుదుగా వుండటం, ఆరోగ్య సిబ్బంది పంపిణీ చేసే మందులు సక్రమంగా వినియోగించకపోవటంతో గ్రామాలు, పట్టణాలు అనే భేదం లేకుండా లక్షలాదిమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో వ్యాధి నిర్థారణకు రెండు మూడు వారాలు పట్టగా ప్రస్తుతం అత్యాధునిక ‘సెన్సివిటీ’ పరికరంతో క్షయకి సంబంధించిన ఒక్క క్రిమి వున్నా గంట వ్యవధిలో గుర్తించవచ్చు. ఖరీదైన ఈ పరికరాలు ప్రధాన ఆరోగ్య కేంద్రాలకే పరిమితమవటంతో అందరినీ పరీక్షించే పరిస్థితి లేదు. అనేక కేంద్రాలలో వైద్య సిబ్బంది రోగుల పట్ల నిర్లిప్తతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. క్షయరోగుల పట్ల ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేయటంతోపాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. నేతల మాటలు కార్యరూపం దాల్చినపుడే క్షయను అంతమొందించవచ్చు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
ఉద్యోగుల్లో మార్పు ఏదీ?
జపాన్ తరహాలో ఒక గంట అదనంగా పనిచేసి, కేంద్రానికి నిరసన తెలుపుదామని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల గొప్పగా ప్రకటించినా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. ఆయన మాటలను ఉద్యోగులు ఏమాత్రం పట్టించుకోలేదు. సాధారణంగా ఏ ఆఫీసులోనైనా పనిచేసే వాళ్లు కొద్దిమందే వుంటారు. చాలామంది భౌతికంగా ఆఫీసులో వుంటారు కానీ శ్రద్ధగా పనిచేయరు. మరికొద్దిమంది పని గంటలు ముగిశాక హడావుడిగా కనిపిస్తారు. ఆ సమయంలోనే వారికి అవసరమైనవి అందుతాయి మరి! ఎప్పటిలానే ఇపుడు ప్రభుత్వ కార్యాలయాలు అలాగే నడుస్తున్నాయి. కాని అదనంగా ఎవరూ పనిచేయడం లేదు.
-మైథిలి, సర్పవరం
నష్టం తెచ్చింది బడాబాబులే!
అన్ని బ్యాంకుల్లో పైసలు వేస్తే తీసుకొనే విధానమే లేదు, బ్యాంకు ఎటియంలోనూ పైసలు రావటం లేదు. ఎస్‌బిఐ అడ్డగోలు చార్జీలు, లక్షల అకౌంట్స్‌లో పేద ప్రజల ఖాతాల నుండి మినిమం బాలన్స్ లేదని వసూలుచేసి ఆ చార్జీలతో వేల కోట్ల రూపాయలను దండుకున్నారు. ఈ విధంగా వసూలుచేసిన సొమ్ములో సగం లాభం అంటూ పత్రికల్లో ప్రకటనలు! ఇది ప్రముఖ బ్యాంకు ఎస్‌బిఐ ఘనత. ఆ బ్యాంకు చైర్మన్ అవలంబించిన లాభాల సూత్రం, ఇకముందు అన్ని బ్యాంకులకు లాభాలు రావాలంటే ఇక ఇదే దిక్కు. ఆర్థికవేత్తగా, గొప్ప మార్గదర్శిగా ఎస్‌బీఐ చైర్మన్ నిలిచారు. అప్పుగా ఇచ్చిన వేల వేల కోట్ల రూపాయలను బడాబాబుల నుంచి వసూలు చేయటం చేతకాక చిన్నాచితకా మదుపరులను చావగొట్టారు.
మినిమం బాలన్స్ ఇంత ఉండాలని అన్ని ప్రముఖ ప్రచార మాధ్యమాల ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ప్రచారం చేసి, దానికి కనీసం ఓ ఆరు నెలలు వ్యవధి ఇచ్చి చేసినా బాగుండేది. అలా ప్రచారం చేస్తే ఎక్కడ ఉన్న ఎకౌంట్లు ప్రజలు మూసివేస్తారో అని రాత్రికి రాత్రి కంప్యూటర్‌కి కమాండ్ ఇచ్చి నష్టాలలో ఉండాల్సిన బ్యాంకుకు కొన ఊపిరి దశలో ఆక్సిజెన్ ఇచ్చి బ్యాంకుకి ప్రాణప్రతిష్ట చేశారు మహా ఘనకార్యం సాధించినట్లు. ప్రజల నుండి తిరుగుబాటు రావటంతో తాత్కాలికంగా ఈ మినిమం బాలన్స్ వాయిదా అన్నారు, అంతేగాని ఎంట్రీని రివర్స్ చేయలేదు. మళ్ళీ కొన్ని సవరణలతో ముందు విధిస్తామన్నారు.
- సివిఆర్ కృష్ణ, హైదరాబాద్
తిరుమలలో సొంత ప్రచారమా?
రాజకీయ నేతలు, సినిమా నటులు, ఇతర ప్రముఖులు తిరుమల నుండి ప్రకటనలు చేయడం (ఇతరుల ఆరోపణలకి ఖండనలు, తమ భవిష్యత్ ప్రణాళికలు వంటివి) చాలా విచారకరం. స్వామి దర్శనం అనంతరం వీరు ఆలయం బయట చేసే ప్రకటనలకు పత్రికలు, టీవీలో ప్రచారం ఇవ్వటం మరీ విచారకరం. తిరుమలను ఒక వేదికగా చేసుకుని ప్రకటనలు చేయటం ఏమిటి? అని ఎవరికీ తోచకపోవడం విస్మయకరం. కలియుగ దైవం కాబట్టి కలియుగపు వైపరీత్యాలకు మూగసాక్షిగా ఏడుకొండలవాడు ఉంటున్నాడేమో మరి!
-ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్