ఉత్తరాయణం

ఇదీ బాబు హుందాతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య పది రోజుల పాటు అసెంబ్లీలోనూ, టెలికాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని మోదీని, భాజపాని ఏకిపారేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండాకులు ఎక్కువ చదివిన ఆయన అనుచరులు మోదీని ‘నరకాసురుడు, రావణుడు, హిట్లర్’ అంటూ నోరారా తిట్టారు. హామీలు అమలు పరచాలంటూ తాము మర్యాదగా అడుగుతుంటే భాజపా ఎదురుదాడి చేస్తోందని అమాయకత్వం నటించారు చంద్రబాబు. తను ఎవరినైనా విమర్శించవచ్చు, ఎదుటివారు అరకొరగా అయినా తనని విమర్శిస్తే దాన్ని ఎదురుదాడి అని చంద్రబాబు భావిస్తారు. తనలాంటి సమర్ధనేతను విమర్శించే వాళ్లంతా ద్రోహులు, భాజపా తొత్తులు అని కూడా ఆయన అంటారు. రాజకీయాల్లో బాబుది ఎంత హుందాతనం!
-సుభాష్, కాకినాడ
జాతీయతా భావం ముఖ్యం
ఏపీకి నిధులు లేవంటూ ఈశాన్య రాష్ట్రాలకు రూ. 3,000 కోట్లు ఎలా ఇచ్చారు? ఇది మనల్ని అవమానించడమే- అని చంద్రబాబు అనడం తగదు. ఈశాన్య రాష్ట్రాల మొత్తం బడ్జెట్ ఏపీ బడ్జెట్‌లో సగం కూడా లేదు. అక్కడ రోడ్లు లేవు, ఫ్యాక్టరీలు లేవు. ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని అక్కడ మత మార్పిడులు విరివిగా సాగుతున్నాయి. పక్కనే పొంచి ఉన్న చైనా మన దేశ భూభాగాలను కబళించడానికి కాచుకొని ఉంది. ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి పరచకపోతే కొన్ని రాష్ట్రాలైనా పరాధీనం అయిపోతాయి. దేశ భద్రతకు ఇతర రాష్ట్రాల భద్రతకు పెనుముప్పు వస్తుంది. అందుకని అక్కడ ఎక్కువ ఖర్చుపెట్టవలసి వస్తోంది. ఉమ్మడి కుటుంబం అనే భారత దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ విచ్ఛిన్నం కారాదు. మన దేశంలోని ఏ భాగం కూడా విదేశీయుల పాలనలోకి జారిపోకూడదు. ప్రాంతీయ పార్టీలు సొంత లాభం కొంత మానుకుని జాతీయ భావం అలవరచుకొని దేశాన్ని సంరక్షిస్తేనే మన రాష్టమ్రూ సురక్షితంగా ఉంటుందని నేతలు గ్రహించాలి.
-ప్రేమజ్యోతి, కాకినాడ

‘హోదా’ రాజకీయ స్టంట్
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనలు రాజకీయ స్టంట్‌గా కనిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా గుర్తుకురాని ప్రత్యేక హోదాపై ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ధర్నాలు, నిరసనలు చేయటం సరికాదు. రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలంటూ జిమ్మిక్కులు చేశారు. ప్రజలు సైతం దీన్ని గమనిస్తున్నారు. హోదా కోసం కాంగ్రెస్, సిపిఐ వంటి పార్టీలు మొదటి నుంచీ ఆందోళనలు చేస్తుండగా, సినీనటుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి కార్యాచరణను రూపొందించటం లేదు. ముందునుంచీ పార్టీలకు అతీతంగా ఉద్యమం చేసి ఉంటే ‘హోదా’ దక్కేది. ఏపీకి హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల నుండి అటువంటి డిమాండ్లు వస్తాయన్న ఆలోచనతో భాజపా కాలయాపన చేస్తోంది. తమ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం లేకపోవడంతో భాజపా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా హోదా కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేయటం శుభ సూచకంగా చెప్పవచ్చు.
-అయినం రఘురామారావు, ఖమ్మం