ఉత్తరాయణం

ప్రకృతి చేసిన హెచ్చరికలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఇసుక తుఫాన్లు రెండు రోజుల వ్యవధిలోనే వందలాది ప్రాణాల్ని బలిగొనడమే కాకుండా భారీగా ఆస్తి, పంట నష్టాల్ని మిగిల్చాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్లు కొన్ని గంటలపాటు విలయాన్ని సృష్టించాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా హఠాత్తుగా విరుచుకుపడ్డ ఈ ఉపద్రవాలు ఒక రకంగా ప్రకృతి పంపుతున్న ముందస్తు సంకేతాలు. అధిక వేడి, అధిక తేమ తదితర విపరీత మార్పుల వల్లనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నవౌతాయని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. మన దేశంలో పర్యావరణాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పుకోవడానికి ఉదాహరణలు కోకొల్లలు. మొక్కల్ని పెంచి, అడవుల్ని కొట్టేసే ధోరణి ఇక్కడే వుంది. వంద సంవత్సరాల క్రితం దేశ భూభాగంలో 43 శాతం ఉన్న హరిత ప్రాంతం, నేడు అంతకు సగం కన్నా తక్కువకి పడిపోయిందంటే కారణాలు సుస్పష్టం. తాత్కాలిక వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు విచ్చలవిడిగా ప్రకృతిని నాశనం చెయ్యడం మామూలైపోయింది. చట్టాలకు కళ్ళు మాత్రమే కాదు, కోరలు కూడా లేవు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు తాను జరిపే బహిరంగ సభ కోసం యమునా నదీ తీరాన్ని పాడు చేస్తారు. అందుకు ప్రతిగా 10 కోట్ల రూపాయలు హరిత ప్రాంత అభివృద్ధి కోసం కట్టమని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్తే, వేల కోట్ల రూపాయల అధిపతికి మనసు కష్టమైపోతుంది. ససేమిరా అంటారు. ప్రభుత్వం సరేనంటుంది. ప్రధాని కార్యాలయం బుల్లెట్ రైలు మార్గం కోసం 77 హెక్టార్ల అడవిని ఒక్క కలం పోటుతో కేటాయించేస్తుంది. అటవీ హక్కులు, పర్యావరణం ఏదీ గుర్తుకురాదు. రాజధాని నగరాల నిర్మాణాలకైనా, రియల్ ఎస్టేట్లకైనా వేలాది ఎకరాల పచ్చని నేలలు మాత్రమే దొరుకుతాయి-అదీ అవసరానికి మించి. మరోవైపు ప్రపంచంలో 20 కాలుష్య పట్టణాల్లో మన దేశానివే 14. అక్కడ నివశిస్తున్న వారంతా రోజుకి 23 సిగరెట్లు కాల్చిన ఫలాన్ని పొందుతున్నారు.. ఊపిరితిత్తుల వ్యాధుల రూపంలో. అలా ఉత్తినే సిగరెట్లు కాల్చిన ఫలం పొందుతున్నందుకు ప్రభుత్వాలు లగ్జరీ పన్ను విధించినా విధించొచ్చు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నందుకు. నీటి ఎద్దడి, అధిక వేడి, వ్యాధులు రూపంలో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వాలు పర్యావరణ రక్షణ దిశగా కఠిన నియమాల్ని ఏర్పరచాలి. పౌర సమాజం, మీడియా ప్రజల్ని చైతన్యపరచాలి. ఇప్పటికే ఈ విషయంలో ఆలస్యమైంది.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

అన్నదాత విలవిల
తెలంగాణ వ్యాప్తంగా ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్ల వాన మూలంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. గాలి దుమారం, వడగండ్లవాన వల్ల అనేక జిల్లాల్లో కరెంటు స్తంభాలు కూలడం, చెట్లు విరగడం, ఇళ్లు కూలడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. మామిడికాయలు నేలరాలడం, మొక్కజొన్న కంకులు తెగడం, పసుపు, మిర్చి పొట్ట దశలో వున్న వరిగింజలు రాలి నేలపాలుకావడం రైతులకు తీవ్ర నష్టాలను కలుగజేసింది. సకాలంలో వర్షాలు కురవక ఈ యేడు రైతులకు పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన విధంగా వడగండ్లవాన రైతుల జీవితాలలో కన్నీళ్లు పెట్టించింది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్, యాదాద్రి, జనగాం జిల్లాలలో అపార నష్టం కల్గించింది. కళ్లాల దగ్గర ధాన్యం, మిర్చి వర్షం మూలంగా కొట్టుకుపోయింది. మామిడి రైతులకు కోలుకోని విధంగా నష్టం జరిగింది. అనేక ప్రాంతాలలో పిడుగులు పడి పశువులు మృత్యువాత పడ్డాయి. వేలాది హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి వడగండ్ల వర్షాల మూలంగా నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

సచిన్‌ను ఆదర్శంగా తీసుకోండి
తన రాజ్యసభ పదవీకాలంలో పొందిన మొత్తం జీతభత్యాలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళం అందించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందనీయుడు. నెల్లూరు జిల్లాలో ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కొందరు సినీనటులు, రాజకీయ నేతలు కూడా గ్రామాలను దత్తత తీసుకుని సేవాభావాన్ని చాటుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రాజధాని, సచివాలయం, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలు నవ్యాంధ్రను వేధిస్తున్నాయ. ప్రవాసాంధ్రులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఏపీకి చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేసిన, నూట యాభై చిత్రాల్లో నటించిన అగ్రనటుడు చిరంజీవి ఇక స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం