ఉత్తరాయణం

టీటీడీ సంపదపై కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల బాలాజీ ఆలయాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి తీసుకోవాలని ఆలోచన చేసి, విమర్శలు వెల్లువెత్తడంతో వెనకడుగు వేసినప్పటికీ- కేంద్రం వైఖరి సమంజసం కాదు. పురావస్తుశాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకుంటేనే ఆ ధార్మిక స్థలాన్ని కాపాడగలమని అనుకుంటే పొరపాటే. టీటీడీ సంపదపై పెత్తనం చెలాయించడానికే సదరు మార్పులు దోహదపడతాయి. ఇంతవరకూ తమ పరిధిలోఉన్న చారిత్రక సంపద, కట్టడాల్ని సంరక్షించడంలో కేంద్రం చిత్తశుద్ధి చూపిస్తోందా? అంటే అదీ అనుమానమే. తాజాగా దేశ వారసత్వ సంపద అయిన- ఢిల్లీలోని ఎర్రకోట నిర్వహణ బాధ్యతని కేంద్రం ప్రయివేటుపరం చేసింది. వివిధ కట్టడాలతోపాటు, పాతిక కోట్లు కేటాయించి ఎర్రకోటని ఐదేళ్ళపాటు నిర్వహించి, బదులుగా ఆ ప్రయివేటు సంస్థ బోలెడు ఉచిత ప్రచారం పొందుతుంది. దేశభక్తిని రగుల్కొలిపే చారిత్రక కట్టడం ఒక ప్రయివేటు సంస్థ ప్రచార వేదికగా మిగులుతుంది. ప్రభుత్వం ఆమాత్రం ఖర్చుచేసి, దాని పవిత్రతను కాపాడలేదా? ఇలాంటి పరిస్థితుల్లో వెంకన్న ఆలయాన్ని మేమే కాపాడుతాం అంటే ఎలా నమ్మాలి? తిరుమలను కాపాడాల్సిన అవసరమూ, ఆగత్యమూ ప్రస్తుతానికి లేవు. ఎర్రకోట దారిలోనే, వెంకన్న ఆలయ నిర్వహణ ఏదో కంపెనీకి వరంగా మారితే, కోట్లాది భక్తుల విశ్వాసం, పవిత్రత నిలిచేనా? ఇలాంటి అనుమానాలు మొదలవడంలో అర్థం లేదా? ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించే పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

సుప్రీం తీర్పు భేష్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్‌ను కొంత సవరించి దేశ ప్రజలకు సుప్రీం కోర్టు న్యాయం చేసింది. ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితో జరిగింది. ఈ చట్టం క్రింద అనేకమంది అమాయకులపై దురుద్దేశంతో కేసులుపెట్టి పీడించడం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పుడు ఫిర్యాదు అందినప్పుడు, దర్యాప్తులో అది అవాస్తవమని తేలితే, జామీనుపై ఆంక్షలుండవని చెప్పింది. ఫిర్యాదులు అందినపుడు, తగిన హోదాగల అధికారులచే విచారణ చేయించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్టులు చేయరాదు. సుప్రీం తీర్పు పట్ల దేశంలోని మెజారిటీ ప్రజలు సంతోషిస్తున్నారు. కేవలం ఓట్ల కోసం ఇలాంటి చట్టం తేవటమే తప్పు. ఈ చట్టాన్ని సుప్రీం రద్దు చేయలేదు. రాజకీయ నాయకులు చట్టాలను తెలుసుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను అగౌరవ పరుస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వంద కోట్ల ప్రజలకు అన్యాయం తలపెట్టి, రాష్టప్రతి దగ్గరకు వెళ్లారు. చట్టాలు తెలియనివారు దేశాధినేతగా ఎలా పనికివస్తారు? ఓటు బ్యాంకు రాజకీయాలు మాని, ప్రజల క్షేమాన్ని ఆశించకపోతే ఎలా? ప్రజలందరికీ చట్టాలు సమానంగా వుండాలని నేతలు గ్రహించాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

అయ్యో.. ‘కింగ్ మేకర్’!
జాతీయ రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తిలేదని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల సింగపూర్‌లో ప్రకటించారు. రాజకీయ నేతలు కాదంటే ఔనని మనం అర్థం చేసుకోవాలేమో. తెలుగు రాష్ట్రాల సీఎంలు కెసీఆర్, చంద్రబాబుల వారసులు ఇప్పటికే మంత్రి పదవుల్లో ఉన్నారు. తమ కుమారులు ముఖ్యమంత్రులు కావాలన్న ఆశ వీరికి సహజమే. తాను జాతీయ నాయకుడు కావాలన్న కోరికతో కేసీఆర్ ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ అంటూ పలు రాష్ట్రాలకు వెళుతూ రాజకీయ ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నారు. అయితే- శరద్‌పవార్, మమతా బెనర్జీ వంటి వారు కాంగ్రెస్‌తోనే కూటమి అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుని సంప్రదించే వారే లేకపోయారు. కర్నాటక ఎన్నికల్లో తమ పార్టీకి ప్రచారం చేయమని దేవెగౌడ కెసిఆర్‌ని అడిగాడు, కానీ చంద్రబాబు వైపు చూడనేలేదు. ఒకనాటి ‘కింగ్‌మేకర్’ పరిస్థితి ఇదీ. అందుకేనేమో- వైరాగ్యంతో జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు.
- గిరిధర్, కాకినాడ