ఉత్తరాయణం

అందీ అందని అందలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటకలో ముఖ్యమంత్రి పీఠం ‘కమలనాథుల’ చేతిదాకా వచ్చి ఆగిపోయింది. కాంగ్రెస్ స్నేహహస్తం సాయంతో- కుమారస్వామి (జేడీఎస్) పార్టీకి అవకాశం అందివచ్చేలా పరిణామం ఏర్పడింది. అంటే పరుగుపందెంలో గీత దగ్గరకు చేరిన మొదటివాడి కన్నా ముందుకి- ‘మూడోవాణ్ణి రెండోవాడు ఎత్తి విసిరినట్టు’. మరి గవర్నర్ ఏం నిర్ణయిస్తారో చూడాలి. మెజారిటీకి అతి సమీపంలోకి వచ్చిన బీజేపీకి నైతిక విజయమే ఇది. పీఠం దక్కినా, లేకున్నా పరపతి పెరిగినట్టే. దక్షిణాదిలో ముందడుగు వేసినట్టే. దాదాపు విజయం అంచులు దాకా వచ్చిన భాజపాకు 2019 సాధారణ ఎన్నికలకు ముందు నైతిక బలం చేకూర్చే తీర్పిది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి వల్లనైనా వాస్తవాలు తెలిసి రావాలి. రానున్న ఎన్నికల్లో తాను ప్రధాని అభ్యర్థినంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనాలోచిత ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ప్రకటించాల్సింది తాను ‘మంచి టీమ్ సభ్యుడిని’ అని. లీడర్‌నని కాదు. చేతిలో రెండు రాష్ట్రాల్ని పెట్టుకొని, సాంకేతికంగా ప్రాంతీయ పార్టీల స్థాయిలో ఉన్న పార్టీ, మిగతా పార్టీల్ని ఎలా కలుపుకొని వెళ్ళాలో చూడాలి కానీ, తన వెనకే అందరూ రావాలంటూ గాంభీర్యం చూపడం సరికాదు. కర్నాటక ఫలితాల తీరుతో వెంటనే మేల్కొని ఎలా అయితే జేడీఎస్‌ని ముందుకు తోసిందో, అదే కామన్ సెన్స్‌తో ముందుముందు వ్యవహరిస్తే, కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా మంచిది. ఇరు జాతీయ పార్టీలకు అందీ అందని అందలంగా మిగిలిన ముఖ్యమంత్రి పీఠం- భవిష్యత్‌లో వారి వైఖరిని నిర్దేశించే మంచి పాఠం నేర్చగలదు- నేర్చుకునే అణకువ ఉంటే.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఐపీఎల్ ఉద్దేశం ఏమిటి?
ఏటా ఐపీఎల్ టోర్నీ పేరిట 8 జట్లను ఏర్పాటు చేసి, వేసవిలో విరామం లేకుండా ఆటగాళ్లతో టి-20 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిని ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు? దీనివల్ల లాభమేమిటి? విదేశీ ఆటగాళ్లతో కలసి స్వదేశంలో స్వదేశీయులకే ఒకరికొకరిని ప్రత్యర్థులుగాచేసి, ఐక్యతను దెబ్బతీస్తున్నారు. భారతీయ ఆటగాళ్ళ మధ్యనే కాదు, ఐపీఎల్ పుణ్యమాని ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత దెబ్బతిని కీచులాటలకు దారితీస్తోంది. ఐపిఎల్‌లో ఒక టీం గెలిచిందంటే ఒకరికి మోదం. మరొకరికి ఖేదం. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? అలాగే- హైదరాబాద్ టీమ్‌లో తెలుగు ఆటగాళ్లు ఉన్నారా? చెన్నై టీమ్‌లో తమిళులెందరు? ప్రాంతాన్నిబట్టి ఆటగాళ్ళు లేనప్పుడు మరి ఈ హైదరాబాద్, బెంగళూర్, పంజాబ్ అంటూ ప్రాంతాల పేర్లేమిటి? ప్రేక్షకులను పిచ్చివాళ్ళను చేయడానికా? అంబటి రాయుడు సెంచరీ వల్ల హైద్రాబాద్ జట్టు ఓడిపోతే తెలుగువాళ్ళు గర్వించాలా? విచారించాలా? అందుకే ఈ ఐపీఎల్ విధానం మారాలి. ఏ ప్రాంతం టీమ్‌లో ఆ ప్రాంతం వాళ్ళనే తీసుకోవాలి. మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించి వనే్డ సీరిస్‌లను ఏటా ఆడించాలి. అప్పుడు ఆటగాళ్ళకీ ఐక్యత ఉంటుంది. ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత జట్టును అభిమానిస్తారు. మరింత నాణ్యమైన క్రీడాకారులు వెలికివస్తారు. టీమ్ ఇండియాలో ఇలాంటి ప్రతిభావంతులను చేర్చి ప్రపంచ అత్యుత్తమ జట్టుగా భారత్‌ను చేయవచ్చు.
- సరికొండ శ్రీనివాసరాజు, హైద్రాబాద్
ఉమ్మడి కుటుంబాలే మేలు
1986 నాటికే అమెరికాలో వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతూ విడాకుల సంఖ్య పెరిగింది. ప్రతి నలుగురు పిల్లలలో కనీసం ఒకరు తల్లి లేదా తండ్రికి దూరం కావలసి వచ్చింది. ఐక్యరాజ్యసమితి 1994 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ కుటుంబ సంవత్సరంగా’ ప్రకటించింది. భార్యాభర్తలు పిల్లల పెంపకంలో భాగం పంచుకోకపోవడం, వృద్ధుల ఆలనా పాలనా చూసుకోలేకపోవడం, వంటమనుషులను నియమించుకోవడం, హోటల్స్‌లో దొరికే ఆహార పదార్థాలపై ఆధారపడటం, ఒకే ఇంట్లో ఉన్నా మనసు విప్పి మాట్లాడుకోకపోవడం వంటి పరిస్థితుల వల్ల కుటుంబ వ్యవస్థ క్రమంగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. మానవులు సుఖ సంతోషాలతో జీవించడంలో కుటుంబ వ్యవస్థ ఆవశ్యకతను, ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఐరాస తనవంతు కృషి చేసింది. నేడు భారత్ సహా అనేక దేశాల్లో ఉమ్మడి కుటుంబాలు దాదాపు కనుమరుగైపోయినాయి. ఉమ్మడి కుటుంబాలలో అందరూ కలిసి జీవిస్తున్నపుడు ఆప్యాయత, ప్రేమానురాగాలు, ఒకరికొకరు సహకరించుకోవడం ఉండేది. అన్ని పనులను అందరూ సమానంగా చేసుకునేవారు. పిల్లలకు తాతయ్య, నానమ్మలు నీతికథలు, మంచి విషయాలు, పద్యాలు చెబుతూ వారిలో విజ్ఞానాన్ని పెంచేవారు. చిన్న కుటుంబాలు కావడం మూలాన ఎవరికివారే తాము గొప్ప అని భావిస్తున్నారు. పెద్దల పట్ల గౌరవం తగ్గింది. నేరాలు పెరిగాయి. విలువలు తగ్గాయి. ఆప్యాయత, మమకారం దూరమైంది. దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళితే పిల్లల సంరక్షణకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఉమ్మడి కుటుంబాలలో జీవిస్తున్నవారు మాత్రం ఎలాంటి అవస్థలు లేకుండా జీవిస్తున్నారు.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట