ఉత్తరాయణం

భాజపాకు ప్రమాద ఘంటికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి గుణపాఠం కావాలి. తమను ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయని భాజపా నేతలు చెబుతున్నా, ప్రజాభిప్రాయం అనుకూలంగా వుంటే ప్రతిపక్షాలు ఏకమైనా ఓడించలేవు. ఓటమికి దారితీసిన కారణాలను తెలుసుకుని, ప్రధాని మోదీ ఇకనైనా ప్రజాసమస్యలపై దృష్టి సారించాలి. ప్రజాకర్షక పథకాలను పెంచకపోయినా ఫరవాలేదు గాని, విపరీతమైన పన్నులు, అధిక ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజానీకానికి ఉపశమనం కలిగించాలి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వంటగ్యాస్‌పై సబ్సిడీ ఇస్తున్నామని పాలకులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు, కాని కొద్దిమొత్తం సబ్సిడీ కోసం బ్యాంకులకు వెళ్ళటం- ‘సంచి లాభం చిల్లు పూడ్చిందన్న’ట్టు పేదలకు అదనపుఖర్చు తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. పెన్షన్ సౌకర్యం, స్థిరాదాయం లేని లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు, సామాన్యుల చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీ తగ్గిస్తున్నారు, బడాబాబులకు సంబంధించి లక్షల కోట్ల మొండి బకాయిలపై మాత్రం చర్యలు లేవు. అభివృద్ధి పేరుతో చేపట్టే హైవేలు, విమానాశ్రయాలు, బుల్లెట్ రైళ్ళ వంటి పథకాలు సామాన్య ప్రజానీకానికి ఉపశమనం కలిగించవు. ప్రభుత్వ భూములను, సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో పెద్దలకు కట్టబెడుతుంటే ఆర్థిక అసమానతలతో, ఆందోళనలతో సమాజం అల్లాడుతుంది. నేడు ప్రజలు ఎప్పటికప్పుడు మార్పుకోరుతున్నారు. గతంలోవలె ఎవరినీ గుడ్డిగా సమర్ధించటం లేదు. ఇకనైనా పేదల పక్షపాతిగా మోదీ మసలుకుంటేనే భాజపా ప్రభుత్వానికి మనుగడ సాధ్యం. అభివృద్ధి మంత్రం ఒక్కటే పనిచేయదు. అగ్రరాజ్యంగా ఎదగకపోయినా ఫరవాలేదు గాని పేదరికం, అసమానతలను నిర్మూలించాలి. ఉద్యోగులకు వేతనాలే కాదు, సిబ్బంది సంఖ్య పెంచి నిరుద్యోగం తగ్గించాలి. జాతీయ పార్టీలు బలహీనపడి కర్నాటక వలే ‘కుమార సంభవం’ పునరావృత్తమైతే, ఎన్ని ఆదర్శాలు వల్లెవేసినా ప్రాంతీయతత్వం, రాజకీయ అస్థిరత పెరిగి జాతీయ సమైక్యతకు, అభివృద్ధికి భంగం వాటిల్లే ప్రమాదం వుంది. కనుక భాజపా నేతలు ఏకపక్ష ధోరణితో కాకుండా మిత్రపక్షాలతో లౌక్యంగా వ్యవహరించాలి.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నరసరావుపేట

మాట నిలుపుకోండి..
‘తియ్యటి మాటలు- చప్పటి అట్లు’ సామెతలా ఉంది ప్రధాని మోదీ వైఖరి. మాటలు మధురంగా ఉన్నా, చేతలు చప్పటి అట్టులా ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై మోదీకి మునుపటి ఆసక్తి, అనురక్తి, అభిమానం లేవని స్పష్టమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మొదట ప్రకటించినా, ఆ తర్వాత అది కుదరదన్నారు. ‘హోదా’కు బదులుగా ఇస్తామన్నా ప్యాకేజీ అయినా సరిగా ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాలకు నిధులిచ్చే సమయంలోనైనా మోదీకి ఏపీ గుర్తుకు రావడం లేదు. విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తామన్నా, దానికి ఎంతకాలం పడుతుంది? సమయం మించి పోయాక సహాయం చేసే పరిస్థితి ఉంటుందా? కేంద్రం తప్పక సాయం చేస్తుందని ఏపీ ప్రజలు ఆశగా ఉన్నారు. మాట తప్పితే మోదీ మోసం చేశారన్న భావన జనంలో నాటుకుపోతుంది. ప్రజలు ఆగ్రహిస్తే వారిని శాంతింపచేయడం ఎవరి తరం కాదు.. మోదీ ఇకనైనా వౌనం వీడాలి.
- కాలిపు కూర్మావతారం, పాతపట్నం