ఉత్తరాయణం

ప్లాస్టిక్‌తో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణం ఇపుడు ప్లాస్టిక్ ఆవరణంగా మారిపోతోంది. ఎటుచూసినా ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు పేరుకుపోయి పర్యావరణానికి తీరని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ విషయంలో ప్రపంచంలోని మొదటి పది దేశాల జాబితాలో భారత్ ఉండడం ఆందోళనకరమైన వాస్తవం. రోజుకి దేశంలో 15 వేల టన్నుల ప్లాస్టిక్ వినియోగవౌతోంది. అందులో తొమ్మిదివేల టన్నులు రీ-సైక్లింగ్ కోసం వెనక్కి చేరుతున్నా మిగిలిన ఆరు వేల టన్నులు భూమిలోకి, నీటిలోకి చేరుతున్నట్టే. ఈ లెక్కలు కూడా కనీస స్థాయివి. ఒక్కరోజులోనే ఈ స్థాయిలో చెత్త పేరుకుపోతుంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటి? ప్లాస్టిక్ నాశనం లేనిది. ఏ నేలా కలుపుకోలేనిది, ఏ నీరూ తడపలేనిది. అందుకనే సముద్రాలు కాలుష్యవౌతున్నాయి. భూమి నిస్సారమవుతోంది. వెరసి జీవరాశులు నశిస్తున్నాయి. కోరి తెచ్చుకొంటున్న ఈ ముప్పుని తప్పించుకోవడం సమాజం చేతిలోనే ఉంది. ప్లాస్టిక్ వినియోగాన్ని కనీస స్థాయికి తగ్గించుకోవాలి. ప్రమాదకరమైన పలుచని ప్లాస్టిక్ సంచుల తయారీని నిషేధించడంతో పాటు, అన్ని రకాల ప్లాస్టిక్ తయారీని గణనీయంగా తగ్గించాలి. మార్కెట్లోనుంచి వచ్చిన ప్రతిదీ వినియోగానంతరం తిరిగి వెనక్కిచేరి రీ సైక్లింగ్ పొంది పునర్వినియోగం జరిగేలా చూడాలి. ఒకేసారి వినియోగించడానికి తయారౌతున్న స్ట్రాల, కప్పులు, స్పూన్లు లాంటివి పూర్తిగా బ్యాన్ చెయ్యాలి. గోగునార ఉత్పత్తుల్ని ప్రత్యామ్నాయంగా ప్రమోట్ చెయ్యాలి. ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకొనేలా చర్యలు తీసుకోవడంతోబాటు విచ్చలవిడిగా పారవేయకుండా చైతన్యం తీసుకురావాలి. ప్రభుత్వం, మీడియా, పౌర సమాజం బలంగా పూనుకుంటే మార్పు మెల్ల మెల్లగా మొదలౌతుంది. ప్రభుత్వం ప్లాస్టిక్ తయారీని నియంత్రించకుండా వినియోగదారుల వద్ద ఆక్రోశం వెలిబుచ్చడంలో అర్థం లేదు. రువాండా లాంటి పేద దేశం నియంత్రించగలిగింది, మన దేశం నియంత్రించలేకపోవడం అంటే అది సంకల్పం బలం లేకపోవడం వల్లే.
-డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు సబబే
తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షదాయకం. ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతిస్తారు. అయితే, కృష్ణా నదీమతల్లిని విస్మరించకుండా ‘కృష్ణా ఎన్టీఆర్ జిల్లా’ అని నామకరణం చేయడం సముచితం. కేవలం ఎన్టీఆర్ జిల్లా అని కాకుండా కృష్ణా నది పేరును కూడా కొనసాగించాలి. జగన్ ప్రకటన నేపథ్యంలో సిఎం చంద్రబాబు తనకే ఈ క్రెడిట్ రావాలని ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఏమైనప్పటికీ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేస్తేనే అంతా సంతోషిస్తారు.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు

కాశ్మీర్‌కు హిందూ సీఎం కావాలి
కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్ తదితర రాష్ట్రాలకు ముస్లిం నేతలు ముఖ్యమంత్రులయ్యారు. ముస్లింలకు అవకాశం ఇవ్వడం నిజమైన సెక్యులరిజం అంటూ చాలామంది చంకలు గుద్దుకున్నారు. మరి జమ్మూ కాశ్మీర్‌కి హిందువు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ముఖ్యమంత్రి కావడం దేవుడెరుగు, కాశ్మీర్‌లో లక్షలాది మంది హిందువులను హింసించి అక్కడి నుంచి తరిమివేశారు. సెక్యులరిస్టులమని చెప్పుకునే వారు ఏనాడూ నోరెత్తరు. ఇక హిందువు ముఖ్యమంత్రి కావాలని వారు ప్రకటించగలరా? 70 సంవత్సరాల నుండి ముస్లిములే ముఖ్యమంత్రులుగా కొనసాగారు. కనీసం ఒక్కసారైనా హిందువు ముఖ్యమంత్రి అయితే జమ్మూ కాశ్మీర్‌లో ప్రశాంతత నెలకొనే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ కూడా విమర్శించకపోవచ్చు. ఎందుకంటే, ఇది భారత్ ఆంతరంగిక విషయం కదా!
-ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్

మన్మోహన్ నీతులు..
‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, జనం కళ్లు తెరవాలి’ అని ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనడం ఆశ్చర్యకరం. నిజానికి ఆయన హయాంలోనే ప్రజాస్వామ్యానికి తీరని ముప్పు ఏర్పడింది. మంత్రివర్గం తయారుచేసిన తీర్మానం ప్రతిని రాహుల్ పబ్లిక్‌గ్గా చించిపారేశాడు. పార్లమెంటు ఆమోదం లేకుండా ఏర్పడిన సలహా సంఘం సూచనల మేరకు మన్మోహన్ సింగ్‌ని ప్రధాని కుర్చీలో కూచోబెట్టి వెనుక నుంచి సోనియా పాలించింది. అప్పుడే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. మన్మోహన్ పాలనలో లెక్కలేనన్ని స్కామ్‌లు జరిగినా ఆయన చూస్తూ ఊరుకున్నప్పుడే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది.
-కృష్ణ, కొండయ్యపాలెం