ఉత్తరాయణం

తెలుగు గ్రంథాలను తెప్పించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో కలిపి) ఏర్పడింది. గత 65 ఏళ్ల కాలంగా- తంజావూర్‌లోని సరస్వతి మహల్‌లో ఉన్న వేలాది తెలుగు గ్రంథాలను రాష్ట్రానికి తీసుకువచ్చి, వాటిని జనానికి అందుబాటులో ఉంచాలన్న ధ్యాస ప్రభుత్వాలకు కలగలేదు. అసలు తెలుగుభాషనే పట్టించుకోని వారికి ప్రాచీన గ్రంథాల గురించి ఆసక్తి ఉండకపోవటం విస్మయకరం కాదు. తమిళులు ఈ తెలుగు పుస్తకాలను వదులుకోవడానికి ఇష్టపడరు (వారికి ఉపయోగం లేకపోయినా సరే). తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో ఉన్న తెలుగు ప్రాచీన గ్రంథాలను, వ్రాతప్రతులను, తాళపత్ర గ్రంథాలను తెప్పించే ప్రయత్నం తెలుగు రాష్ట్రాలు చేయాలని మనవి.
- ఎన్.మధుసూధనరావు, హైదరాబాద్
లేనిపోని భయాలు..
తన నీడను చూసి తానే భయపడుతూ, అంతా భాజపా కుట్ర అనే స్థాయికి చేరుకున్న చంద్రబాబు ఈమధ్య చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. ఆయన తాజా భయం- రాష్ట్రంలో ఎంపీల సంఖ్యను కేంద్రం తగ్గించేస్తుందేమోనని! ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యను నిర్ణయించేది జనాభా. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆ సంఖ్య మారే అవకాశం లేదని చంద్రబాబుకూ తెలుసు. ఎన్ని కుంపట్లు వీలైతే అన్ని కుంపట్లు రాజెయ్యడం ప్రస్తుతం బాబు అజెండా. ఇలా ఎంతకాలం భావోద్రేకాలను రెచ్చగొడతారు? కేంద్రంపై గుడ్డి వ్యతిరేకత వల్ల తన పట్ల ప్రజల్లో నమ్మకం సడలిపోతున్నదని ఆయన గ్రహించాలి.
- భాస్కర్, కాకినాడ
అభివృద్ధిలో వివక్ష వద్దు
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనమా? దక్షిణాది ఆదాయం అంతా ఉత్తరాదిలో ఖర్చుపెడుతున్నారు.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిరోజూ హోరెత్తిస్తున్నారు. మరి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందేమిటి? రాష్ట్రం మొత్తం ఆదాయాన్ని హైదరాబాద్‌లో పోశారు. ఇప్పుడా హైదరాబాద్ తెలంగాణకు పోయింది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం వల్ల ఇతర జిల్లాలకు చంద్రబాబు నష్టం కలిగించినట్టే కదా. ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర, డెల్టా ప్రాంతాలన్నింటికీ సమానంగా నిధులు ఖర్చుపెడుతున్నారా? డెల్టాలో ప్రాజెక్టులకు ఖర్చు ఎక్కువ కాదా? గ్రామాలకు, పట్టణాలకు తగిన స్వేచ్ఛ ఇస్తున్నారా? కేంద్రం నిధులివ్వాలంటూ చంద్రబాబు ధర్మపోరాటాలు చేస్తే ఫలితం ఉంటుందా?
- శాంతి చంద్రిక, సామర్లకోట