ఉత్తరాయణం

బడి పిలుస్తోంది.. భయమేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికి ‘బడి పిలుస్తోంది’ పేరిట వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయం. పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని గుర్తిస్తూ ఆ దిశగా అడుగులు వెయ్యడం ముదావహం. అయితే, ఈ ప్రయత్నాలతోబాటు విద్యార్థి ఆరోగ్యం, పోషణపై శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఎంతోఉంది. ముఖ్యంగా ఈనెలలో విషజ్వరాలు, మలేరియా ఇతర సాంక్రమిక వ్యాధులు వ్యాప్తిలో ఉంటాయి. గత కొనే్నళ్లుగా గిరిజన ప్రాంతంలోని వసతి గృహాల్లో, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు క్రమం తప్పక జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలోనే పదుల సంఖ్యలో విద్యార్థుల మరణాలు నమోదవుతున్నాయి. ఇవన్నీ అధికారిక గణాంకాలే. అధిక సంఖ్యలో అనారోగ్యాలతో పిల్లలు చదువులకు దూరవౌతున్నారు. ఈ సీజన్‌లో వసతి గృహాల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంతోబాటు దోమకాటు నుండి రక్షణ చర్యలు, పరిశుభ్రమైన తాగునీరు, పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఆరోగ్య తనిఖీలే గాక వెంటనే తగిన వైద్య చికిత్స అందే ఏర్పాట్లుండాలి. జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేస్తే, పైనుండి సరైన పర్యవేక్షణ వుంటే ఈ దుస్థితిని అరికట్టడం సాధ్యమే. తల్లిదండ్రుల్లో, పిల్లల్లో భయాందోళనలు తగ్గి విద్యాశాతం పెరిగేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వం విద్యతోపాటు ఆరోగ్యాన్ని కలిపి కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
పారిశుధ్య కార్మికుల వెతలు
పారిశుధ్య కార్మికులు సమాన పనికి సమాన వేతనాలు పొందటం లేదు. తక్కువ వేతనాలు పొందుతూ శ్రమదోపిడీకి గురవుతున్నారు. కేవలం నెలకు ఐదారు వేల రూపాయలతో వాళ్ళు కుటుంబాలను ఎలా పోషించుకుంటారు? గ్రామాల్లో వీరి వేతనాలు ఐదువేల కంటే తక్కువే. ప్రత్యేక పారిశుధ్య వర్గంగా వీరిని గుర్తించి కార్మిక చట్టాల్లో మార్పులు చేయాలి. ఎందుకంటే వారుచేసే పని చెత్తను ఊడ్చి, ముగురునీరు శుభ్రం చేయడం. మన పరిసరాల్లో అన్నిరకాల చెత్తలుంటాయి. వాటిని అనారోగ్యకర పరిస్థితుల్లో ఎండనక, వాననక శుభ్రం చేసే బాధ్యత పారిశుధ్య కార్మికులదే. అలాంటి కార్మికులు సరిగా పనిచేస్తేనే దేశం పరిశుభ్రంగా ఉంటుంది. ఈ కారణంగానైనా పారిశుధ్య కార్మికులకు పనికి తగిన వేతనాలివ్వాలి. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారాలు, దుర్వాసనలే దర్శనమివ్వటం సభ్య సమాజానికి తలవంపే. దీంతో పర్యావరణం విపరీతంగా కలుషితమవుతోంది. మన దేశంలో స్వచ్ఛ్భారత్ సాకారం కావాలంటే ముందుగా వారికి వేతనాలను పేరివిజన్ కమిషన్ సిఫార్సులకనుగుణంగా పెంచాలి. సగటున ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చెల్లించే వేతనం వారికి చెల్లించాలి. వారికి ఆరోగ్యకార్డులు, భవిష్యనిధి, పెన్షన్ తదితర సౌకర్యాలుండాలి. సామాజిక నిర్మాణం, పర్యావరణ, ఆరోగ్యకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచి, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరముంది.
- జి.అశోక్, గోధూర్
దూషణ పర్వాలెందుకు?
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని భాజపాతో దోస్తీ రద్దుచేసుకున్న వేళ- ‘జపాన్ తరహాలో ఎక్కువ పనిచేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పిమ్మట- ప్రధాని మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు. తెదేపా నేతలైతే ఎవరి ఇష్టం వచ్చినట్లువాళ్లు మాట్లాడుతున్నారు. కేంద్రం అంటే రాష్ట్రం కంటే క్రింది స్థాయి అన్నట్లు, కేంద్రమంత్రులు రాష్ట్రంలో తిరగలేరని, రైళ్ళు నడవవని, తెలుగువాళ్ళతో పెట్టుకోవద్దు అంటూ ప్రాంతీయ దురభిమానం రెచ్చగొడ్తున్నారు. పోరాటాలు సమస్యలపైనే తప్ప వ్యక్తిగతం కారాదు. తెలంగాణ నేతలు లౌక్యంగా తాము కోరుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగా, ఏపీ నేతలు సమైక్యత అని మంకుపట్టుపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేసిన హైద్రాబాదు ఆదాయంలో వాటా కోసం పట్టుపట్టితే నేడు ఏపీ కూడా అగ్రస్థానంలో ఉండేది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే వెనుకబడ్డ బిహార్, ఒడిశా వంటి ఎన్నో రాష్ట్రాలు క్యూలో వుంటాయి. హోదా దక్కిన మేఘాలయ, మణిపూర్, మిజోరాం వంటి చిన్న రాష్ట్రాలతో పోల్చుకోరాదు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ఆదాయం 60 శాతానికి తగ్గించుకొని రాష్ట్రాలకు 30 నుండి 40 శాతం నిధులు పెంచి ఆదాయం పెంచామంటున్నారు.
ఇక మన ప్రజాప్రతినిధులు, మంత్రులు రాజ్యాంగం సాక్షిగా రాగద్వేషాల కతీతంగా ప్రజాసేవ చేస్తామని ప్రమాణం చేస్తుంటారు. మరి ఎంతమంది అలా సేవ చేస్తున్నారు? మన రాజకీయ నేతలు హరిశ్చంద్రుల, శ్రీరామచంద్రుల వారసులు కారు. రెచ్చగొట్టే నేతలు పోలీసు భద్రత మధ్య బాగానే వుంటారు. గ్రామీణ ప్రాంతాల అమాయకులే పార్టీ ఘర్షణలతో తలలు పగలగొట్టుకుని ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. పోలవరం, రాజధాని, రైల్వేజోన్ వంటి విభజన హామీలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి. ప్రభుత్వోద్యోగ సంఘాల నేతలు కూడ రాష్ట్భ్రావృద్ధికి తమవంతు బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని ప్రకటించారు. వారి సేవలను కూడ సద్వినియోగం చేసుకుని, పాలనా యంత్రాంగాన్ని మెరుగుపరచుకొని ముందుకుసాగాలి. కేంద్రంతో వైరం పెట్టుకుంటే రాష్ట్రానికే నష్టం.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట