ఉత్తరాయణం

వాననీటికి అడ్డుకట్ట ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిమందికీ ఉపయోగపడే మంచి విషయాలను ఎవరు చెప్పినా ఆచరించి ప్రయోజనం పొందాలి. ఇంకుడు గుంతల ఆవశ్యకత గురించి తెలిసినా నేడు చాలా అపార్టుమెంట్లలో వాటిని ఏర్పాటు చేయడం లేదు. భవనం మీద నుంచి వర్షపు నీరు ఎంత వృథాగా పోతుందో అపార్టుమెంట్ వాసులు ఆలోచించాలి. ఎంతసేపూ భూగర్భం లోనుంచి నీటిని తోడటమే తప్ప, భూమిలోకి నీటిని ఇంకించే చర్యలు ఏ మాత్రం తీసుకోవడం లేదు. చెరువులు, ఇంకుడు గుంతలు ఎక్కడుంటాయో అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. ఆ పరిసరాలన్నీ చల్లదనంతో, పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. అందుకే ఇంకుడు గుంతలను నిర్మించి వాటిని సంరక్షించాలి. వృథాగా పోయే వాననీటికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాల అభివృద్ధికి తోడ్పడాలి. లేకుంటే భవిష్యత్తులో దారుణ నీటి ఎద్దడి తప్పకపోవచ్చు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

-కాయల నాగేంద్ర, హైదరాబాద్