ఉత్తరాయణం

ఎనిమిదో వ్యసనం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సప్త వ్యసనాలు’ మనిషిని నైతికంగా దిగజారుస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యసనాలను మించిన మరో వ్యసనం ఇప్పుడు ఆబాల గోపాలాన్నీ పీడిస్తోంది. మన సమయాన్నంతా మింగేస్తూ, సెల్‌ఫోన్ వ్యసనం ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. గతంలో సెల్‌ఫోన్లు ఉండేవా? అప్పుడు మన పనులేమైనా ఆగాయా? జనాలు బతకలేదా? ఇప్పుడు చేతిలో మొబైల్ లేకుంటే ప్రాణం పోయినంత పనే! ఇంటింట్లో ఎన్ని సెల్‌ఫోన్లో! పాతరోజుల్లో పిల్లలను ఆడించడానికి పాటలు పాడటమో, కథలు చెప్పడమో, బొమ్మలు ఇవ్వడమో చేసేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలలో ఓపిక నశించి, పిల్లలను ఆడించడానికి స్మార్ట్ఫోన్లనే ఆటవస్తువులుగా ఇస్తున్నారు. సెల్‌ఫోన్‌లో కార్టూన్ సీరియల్స్, గేమ్స్ వంటివి అలవాటు చేస్తున్నారు. కథలు చెప్పాల్సిన పెద్దలు టీవీ సీరియల్స్‌కు, మొబైల్ ఫీచర్లకు బానిసలు అవుతున్నారు. ఇక బడికి పోయే పిల్లలూ, కాలేజీపోయే యువతా ‘సెల్’మత్తులో మునిగి, తమ విలువైన సమయాన్ని వృథాచేసుకుంటూ, భవిష్యత్తును అంధకార మయం చేసుకుంటున్నారు. యూ ట్యూబ్‌లో సినిమాలు, పాటలు, మొబైల్ గేమ్స్ సహా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మునిగిపోయి చదువును అటకెక్కిస్తున్నారు. యువత ఫేస్‌బుక్‌లో అపరిచితులతో స్నేహాన్ని కలుపుకుంటూ రకరకాలుగా మోసపోతున్నారు. చెడు స్నేహాల ప్రభావంతో అశ్లీల చిత్రాలు చూడటంవల్ల వారి ఆలోచనలు మారి, సమాజానికి భారంగా తయారవుతున్నాయి. ఫోన్‌లో మాట్లాడుతూ, మ్యూజిక్ వింటూ వాహనాలను డ్రైవింగ్ చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. వీరి మూలంగా ప్రమాదాలు జరిగి ఎందరో అమాయకులు బలిఅవుతున్నారు. ఇక తల్లిదండ్రులూ, పెద్దలూ సెల్‌ఫోన్లలోని ఫీచర్ల మాయలో పడి పిల్లలను పట్టించుకోవడం లేదు. ఇది పిల్లల ఉజ్జ్వల భవిష్యత్‌కు గొడ్డలిపెట్టు. కార్యాలయాలలో పనులను ఆపేసి, ఉద్యోగులు సైతం అదేపనిగా మొబైల్ ఫోన్స్‌లో మాట్లాడటం వలన పనులకు ఆటంకం- ఫలితంగా ప్రజలకు ఎంతో కష్టం కలుగుతోంది. మితిమీరిన సెల్‌ఫోన్ల వాడకం మానవారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.
సెల్‌ఫోన్‌ను పరిమితంగా అవసరం మేరకే ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలకు స్మార్ట్ఫున్లు ఇవ్వడం మానుకోవాలి. ఆటపాటలు, కథలతో పిల్లల మధ్య గడపాలి. చిన్నారులు పలురకాల క్రీడలను ఆడే అవకాశాన్ని కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో సెల్‌ఫోన్ల వినియోగానికి స్వస్తిచెప్పాలి. ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారికి చట్టపరంగా వెంటనే శిక్షలు అమలు జరపాలి. జీవితానికి పనికివచ్చే విషయాలను సెల్‌ఫోన్ ద్వారా నేర్చుకోవచ్చు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అనేక లాభాలు సైతం ఉన్నందున సెల్‌ఫోన్లను పరిమితంగా, ప్రయోజనాత్మకంగా వాడాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

శరణార్థుల సంక్షేమం పట్టదా?
యుద్ధాలు, ఇతర కారణాల వల్ల సర్వస్వం కోల్పోయి, గతిలేక ఇతర ప్రాంతాలలో జీవిస్తున్న శరణార్థుల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. ఆఫ్రికా, ప్రపంచంలో సుమారు 70 మిలియన్ల శరణార్థులు వివిధ దేశాల్లో ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ శరణార్థుల పిల్లలు పాఠశాలలకు వెళ్ళే అవకాశం లేదు. బాల్యంలోనే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వైద్య సౌకర్యాలు తగిన విధంగా లేవు. సరైన సంపాదన లేక కొందరు స్ర్తిలు బలవంతంగా వేశ్యావృత్తిలోకి దిగుతున్నారు. మొదట్లో ఆఫ్రికాలో మాత్రం శరణార్థుల దినాన్ని ఏటా జూన్ 20వ తేదీన జరుపుకునేవారు. శరణార్థుల హోదా, స్థితిగతులను గూర్చి ఐక్యరాజ్యసమితి 1951లో ఒక సదస్సు నిర్వహించింది. దానికి గుర్తుగా 2001 నుండి జూన్ 20న ఏటా ఈ దినాన్ని పాటించాలని 4.12.2000 తేదీన ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఆ తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ (ఓఎయు)వారు ఆఫ్రికా శరణార్థుల దినాన్ని 2002 సంవత్సరం నుండి జూలై 9వ తేదీకి మార్చారు. యు.యస్. హైకమిషనర్ ఫర్ రివ్యూజేస్ వారు శరణార్థుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మన దేశంలోనూ ఇతర దేశాల నుండి వచ్చిన శరణార్థులు జీవిస్తున్నారు. వీరికి ఇళ్లు, వ్యవసాయ భూములు వుండవు. ఏదో ఒకచోట తల దాచుకుని జీవితాలను వెళ్లదీస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ శరణార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారిని ఆదుకోవాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో బతికేలా అవకాశాలు ఇవ్వాలి. శరణార్థులను చిన్నచూపు చూడకూడదు. వీరికి సంక్షేమ పథకాలను అమలు చేయాలి.

(నేడు ప్రపంచ శరణార్థుల దినోత్సవం....)
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట