ఉత్తరాయణం

ఖజానా నిండితే చాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద పన్నుల సంస్కరణగా అభివర్ణించదగ్గ ఏక పన్ను వ్యవస్థ (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడాదైంది. లాభనష్టాల్ని సరైన రీతిలో అంచనావేయాల్సిన అధికార, ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే విశే్లషిస్తున్నాయి. ఆర్థిక విజయం సంపూర్ణమంటున్న అధికార పక్షపు వాదన, పూర్తి వైఫల్యమంటున్న ప్రతిపక్షపు ఖండన రెండూ అర్ధసత్యాలే. ఖజానా నిండడమే విజయం కాదు. అందులో సామాన్యుడికి ఊరట ఎంతన్నది చూడాల్సి ఉంది. పన్నురాయితీ లాభాలు గానీ, అధిక లాభాల్ని పిండే కంపెనీలు వినియోగదారునికి కొంత వెనక్కి ఇచ్చేలా చూసే యాంటీ ప్రాఫిటీరింగ్ విభాగం ఎంతమేరకు క్రియాశీలకమో, తద్వారా ఎంత ఉపయోగం జరిగిందో ఎక్కడా లెక్కల్లేవు. జీఎస్టీ ప్రవేశపెట్టిన ఏడాదిలోనే 376 సార్లు అంటే రోజుకి ఒక్కసారికన్నా ఎక్కువగా సవరణలు జరిగాయి. అంటే దానర్థం ఈ ప్రక్రియ సంక్లిష్టమైనది, మరింత సులభతరం కావాల్సిన అవసరం ఉందన్నమాట. దేశమంతటినీ ఒకే మార్కెట్‌గా రూపుదిద్దడంలో విజయం కనబడుతున్నా, పన్నుల చెల్లింపులు ఇంకా సులభతరం కావాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ చెప్తున్నట్టు ఒకే శ్లాబ్ సాధ్యం కానప్పటికీ శ్లాబులు మరింత పెరగకుండా చూడాలి. ప్రజారవాణాకి, సరకుల రవాణాకి ముఖ్య వనరైన ఇంధనంపై ఇబ్బడిముబ్బడి పన్నుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇంధనంపై పన్ను జీఎస్టీ పరిధిలో అదుపులో ఉండాలి. ప్రభుత్వం అంతిమంగా చూడాల్సింది. పన్ను సులభంగా లాక్కున్నామా, గుంజి లాక్కున్నామా అన్నదికాదు.. న్యాయంగా, సరైన పరిణామంలోనా? అన్నది ముఖ్యం. ప్రధాని సరిగ్గానే చెప్పారు- ‘పాలకీ, కారుకీ ఒకే పన్ను కుదరదు’ అని. కానీ పరోక్ష పన్నులు చిరు పాల వ్యాపారినీ, కారు యజమానినీ ఒకేలా ట్రీట్ చేస్తాయి. అందుకనే ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సంస్కరించాలి.