ఉత్తరాయణం

రైతే- రారాజు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతన్నపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నాయి. కేంద్రం పత్తి విత్తనాలపై గత పదేళ్లుగా వసూలుచేస్తున్న రాయల్టీని తగ్గించింది. వ్యవసాయ పెట్టుబడులకు ఎకరాకు నాలుగువేలు చొప్పున తెలంగాణా ప్రభుత్వం పందేరం, జొన్న, మొక్క జొన్నలకు గిట్టుబాటు ధర లేనందున బస్తాకు రెండువందల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం అందిస్తుంది. తాత్కాలిక ఆకర్షిక పథకాలకు రైతన్న జీవన చిత్రం తెల్లారదు.
క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న నీటి వనరులు, ఆయా ప్రాంతాలకు అనువైన పంటల ఎంపిక, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచటం, అధిక దిగుబడికి సరైన యాజమాన్య పద్ధతులు ఆచరించటం, నకిలీలు నివారించటం, ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తే పెట్టుబడి అదుపులో ఉంచి అప్పుల ఊబినుంచి ఆదుకున్నట్లౌతుంది. భూసారాన్ని పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయాధికారులతో సమిష్టిగా సదస్సులు నిర్వహించటం, దోమకాటు, ఎలుకల నివారణకు ప్రభుత్వమే పటిష్ఠమైన చర్యలకు శ్రీకారం చుట్టాలి. వరదలు, తుఫాన్ల సమయంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయటం, తగురీతిలో రైతుకు ఆపన్న హస్తం అందించటం, రంగుమారిన ధాన్యాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలుచేయటం, వరి, మిర్చి, పత్తి వంటి పంటల సమయంలో తగినన్ని గోదాములు లేక ఆరుబయటే నిల్వ ఉంచటంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు భద్రత లేకుండా పోతుంది. వ్యవసాయ ఖాశాధికారుల ఖాళీలు తక్షణం భర్తీచేయటం, మామిడి, సీతాఫలం, సపోట, జామ వంటి ఉత్పత్తులకు కోల్డ్‌స్టోరేజీనందు అనుమతించటం, వీటితోపాటు చేప, రొయ్యి, జల ఆహార ఉత్పత్తులకు విదేశీ విపణినందు అమ్మకాలు జరిపేందుకు ప్రభుత్వాలు విశేషంగా కృషిచేస్తే రైతుకు ఆదాయంతోపాటు ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం లభ్యవౌతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించవలసిన విధానాలను శాస్తవ్రేత్తలతో తరచు సంప్రదింపులు జరిపే విధంగా అనుభవాలను పంచుకునే విధంగా విరివిగా సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం ప్రముఖ పాత్ర పోషించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, దమ్ము యంత్రాలు రైతులకు అందిస్తుంది. ఈ పంపిణీ అక్కడక్కడా అనర్హులు ఎగరేసుకుపోతున్నారు. ట్రాక్టర్లున్న, కొనుగోలుశక్తి ఉన్న భూస్వాముల పరవౌతున్నాయన్న అపప్రద మూటగట్టుకుంటుంది. ఈ పథకానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా అర్హులకు అందక అభాసుపాలౌతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల దృష్టితో చూడకుండా రైతు సంక్షేమమే పరమావధిగా తలిస్తే, క్షేత్రస్థాయిలో వారు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోనికి తీసుకుంటే రైతు-రారాజే కాగలడు. ప్రపంచంలో అత్యధిక శాతం జనాభా సేద్యంపై ఆధారపడ్డది మన భారతదేశంలోనే. అయితే రానురాను వ్యవసాయంపై ఆధారపడ్డ రైతన్నలు ప్రభుత్వం, ప్రకృతి చిన్నచూపు కారణంగా అణగారిపోతున్నారు. పచ్చని పంట పొలాలు, పారిశ్రామిక కారిడార్లు, సెజ్‌లు, అపార్ట్‌మెంట్లు, రహదారులుగా రూపాంతరంచెంది భూదేవి గుండెలను కాంక్రీటు కప్పేస్తుంది. ప్రభుత్వాలు తాత్కాలిక సహాయంకంటె శాశ్వతమైన ప్రణాళికలతో రైతన్నలను ఆదుకున్ననాడే భూదేవి పచ్చని పంట పొలాలతో నిత్యహారతులతో శోభాయమానంగా విరాజిల్లగలదు.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం