ఉత్తరాయణం

‘పోలవరం’పై చిత్తశుద్ధి ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం బహుళార్థ సాధక నీటి పారుదల ప్రాజెక్టు అనుకున్న రీతిలో నిర్మాణం సాగకపోవడం శోచనీయం. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ముందుకి సాగాల్సిన పనులు జాప్యం కావడంతో నేతలందరిదీ బాధ్యతే. వేలాది మంది ప్రజలు, అందులో ఎనభై శాతం మంది పేద గిరిజనులు నిర్వాసితులుగా మిగులుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారికివ్వాల్సిన నష్టపరిహారం పరిమాణమే సందిగ్ధతలో పడడం అవాంఛనీయం. కేంద్రమంత్రి గడ్కరీ తన అధికారిక పరిశీలనలో భాగంగా నిర్వాసితులతో ముఖాముఖి జరిపి ఉన్నట్లయితే భరోసాగా ఉండేది. నిధులకు కొరతలేదు కానీ, ఇవ్వాలంటే సాంకేతికంగా కొన్ని సందేహాలున్నాయని కేంద్ర మంత్రి చెప్పడం డిప్లొమసీ. నిత్యం ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి ఇప్పటికే సందేహ నివృత్తిచేసి ఉండాల్సింది. సందేహం సాంకేతికమే అయితే తీవ్ర జాప్యం అయ్యేవరకు ఎదురుచూసి ఉండరు. అంతకుమించిన కారణాలుండొచ్చని సామాన్యుడి సందేహం. జాతికి మేలుచేసే జాతీయ ప్రాజెక్టుకి గ్రహణం పట్టరాదు. సాకుల లాకులేసి సాగునీటిని బంధించరాదు.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఏసీబీ ఘనత తెలిసిందే..
ఏపీలోని అన్ని జిల్లాల్లో శాశ్వత భవనాలు నిర్మించి, అవినీతి నిరోధక శాఖను బలోపేతం చేసి అక్రమాలకు ‘చెక్’ పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం పెద్ద జోక్. ఏసీబీ అధికారులు పట్టుకునేది బిల్లు కలెక్టర్, గ్రామాధికారి, గుమాస్తా లాంటి చిన్న ఉద్యోగులనే. ఉన్నతాధికారుల జోలికి వారు వెళ్లరు. రాజకీయ నేతల జోలికి అస్సలు వెళ్లరు. విశాఖలో భూకబ్జాల బాగోతాన్ని వెలికి తీసేందుకు ఇటీవల ‘సిట్’ వేశారు. నివేదికను మాత్రం బయటపెట్టలేదు, ఎవరికీ శిక్షలు లేవు. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంట్రాక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలివ్వడం ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రికి తెలియదా? నేడు చాలామంది నేతలు రాజకీయాల్లోకి వచ్చేదే ‘మేత’ కోసం. సేవకోసం కాదు!
-ప్రభాస్, కాకినాడ
యూ ట్యూబ్‌లో వివాదాలు
ప్రముఖ సామాజిక మాధ్యమమైన ‘యూ ట్యూబ్’లో వస్తున్న వివాదాస్పద అంశాలను సెన్సార్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది రాజకీయ నేతలకు, సెలబ్రిటీస్‌కు సంబంధించిన పాత విషయాలను, ఎప్పుడో మరణించిన వారి వ్యక్తిగత అంశాలను యూ ట్యూబ్‌లో పెట్టడం సబబు కాదు. కులాల వారీగా సినీనటులు గురించి, రాజకీయ నేతల గురించి ఇస్తున్న సమాచారం ఎవరికీ అవసరం లేదు. నేతలు, సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వివాదాలను యూ ట్యూబ్‌లోకి ఎక్కించడం అనైతికం. ఇష్టానుసారం చేసే వ్యాఖ్యల వల్ల, పోస్టింగ్‌ల వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది.
-ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం