ఉత్తరాయణం

అ(తి)విశ్వాస తీర్మానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో ఎట్టకేలకు తేదేపా, ఇతర విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాబోతోంది. ముందుగా ఈ తీర్మానం ప్రతిపాదించిన తెలుగుదేశం చర్చకు నాయకత్వం వహించే అవకాశం పొందడం ఆ పార్టీ అదృష్టం. గతంలో బడ్జెట్ సమావేశాల్లో ముందుండి తీర్మానాలు ప్రతిపాదించిన వైకాపా ఈసారి చర్చల్లో పాల్గొనలేకపోతోంది- ప్రత్యేక హోదాపై ఆ సభ్యులు చేసిన రాజీనామాల కారణంగా. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ససేమిరా అన్న ప్రభుత్వం ఈసారి వెంటనే అంగీకారాన్ని తెలపడం మంచి పరిణామం. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టే పాటి మద్దతు లేదని ఎవరన్నారని లోక్‌సభలో పెద్ద ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనడం అతివిశ్వాసం. పలు అంశాలపై ప్రతిపక్షపు ఆరోపణల్ని తిప్పికొట్టేస్తామని ప్రభుత్వం భావించినా అదీ అతి విశ్వాసమే. అటూ ఇటూ ప్రత్యర్థులిద్దరూ అవసరానికి మించి గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ అంతిమంగా ప్రజలకు అర్థవంతమైన జవాబులను చర్చ అందివ్వగలదని ఆశ. ముఖ్యంగా విభజన చట్టం అమలులో ప్రభుత్వ వైఫల్యం తెలుగుదేశం సమర్థవంతంగా ఎండగట్టాల్సి ఉంది. బిజెపి ఎన్నికల ప్రచారానికి ఇది ట్రయిల్ రన్ అవుతుంది. ఏ రకంగా చూసినా తీర్మానంపై చర్చ వివిధ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోల్ని ప్రతిబింబించడం ఖాయం. అంతకుమించి ఒరిగేదేమీ లేకున్నా ప్రజలకు అదే మహద్భాగ్యం- ఆ మాత్రం కుదురుగా జరుగబోతున్నందుకు. సమస్యలు అలానే ఉంటాయి మళ్లీ ఎన్నికలకు ప్రచారాస్త్రాలుగా మిగిలిపోతూ...
-డా డి.వి.జి.శంకర్‌రావు, పార్వతీపురం

అంతా కుట్రదారులేనా?
‘మోదీ, అమిత్ షా, పవన్, జగన్‌లు దుష్టచతుష్టయం’ అంటూ తేదేపా ఆడిపోసుకుంటున్నది. మరి తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్నదేమిటి? కాంగ్రెస్‌తో తెరమరుగు సయోధ్య పాటిస్తూ ఇతర విపక్ష నేతలతో జట్టు కట్టలేదా? వీరిని దుష్టాష్టకం అంటే తప్పుకాదేమో! ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరితోనైనా జత కట్టవచ్చు. ఎదుటి పక్షాలను ఓడించడమే వారి లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలు తెలిసినవారెవరూ ఆ లక్ష్యాన్ని తప్పు, కుట్ర, కుమ్మక్కు అనరు. అనకూడదు. అందరూ తమ పార్టీనే బలపరచాలి, అలా బలపరచని వారు కుట్రదారులు అనుకోవడం ఫాసిజం. ఏకపక్షస్వామ్యం అవుతుంది గాని ప్రజాస్వామ్యం మాత్రం కాదు.
-జ్ఞానబుద్ధ, కాకినాడ