ఉత్తరాయణం

మధ్యంతర భృతిని ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని జూన్ 2 నుంచి అమలుచేస్తామని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ మాట మార్చారు. ఐదేళ్లకోసారి వేతన సవరణ చేసి ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాలను సవరిస్తున్నారు. ప్రతిసారీ వేతన సవరణ ప్రక్రియ ప్రారంభమై- రెండేళ్ళ తర్వాత గానీ వేతనాల స్థిరీకరణ పూర్తికావటం లేదు. వేతన సవరణ సంఘం సిఫార్సులతో నివేదిక సమర్పించాక, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగి, మార్పులు చేర్పులతో ప్రభుత్వామోదం పొందాలి. ఆ తర్వాత ఉత్తర్వులు వెలువడాలి. ఈ తతంగం పూర్తికావడానికి సుదీర్ఘ సమయం తీసుకుంటోంది. 1 జూన్ 2018 నుండి వర్తింపజేసే 11వ పీఆర్సీ చైర్మన్‌గా చిత్తరంజన్ బిశ్వాల్‌ను మరో ఇద్దరు సభ్యులను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వేతన సవరణ సంఘం నియామకం పూర్తయినా ఇంతవరకు మధ్యంతర భృతి విషయంలో పురోగతి లేదు. ఆర్నెల్లకోమారు ఇచ్చే కరవుభత్యంతో పాటు, ఐదేళ్ళకోమారు ఇచ్చే పీఆర్సీని ప్రభుత్వం ప్రతిసారీ జాప్యం చేస్తోంది. నిత్యావర సరకుల ధరలు చుక్కలనంటుతున్న ఈరోజుల్లో వేతన జీవులకు మధ్యంతర భృతి కొంతలోకొంత ఊరటనిస్తుంది. పాలకులు కొత్త పన్నులు ప్రకటించిన ప్రతిసారీ వాటిని రాత్రికి రాత్రే అమల్లోకి తీసుకొస్తారు. కానీ ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలను మాత్రం పెండింగ్‌లో పెట్టేస్తారు. మధ్యంతర భృతిపై ప్రభుత్వం సత్వరమే స్పందించి ఉద్యోగుల సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.
- జి.అశోక్, గోధూర్
నిందితులను శిక్షించాల్సిందే
మన ప్రభుత్వాలు చేయని పని అమెరికా ప్రభుత్వం చేస్తోంది. టాలీవుడ్ తారలకు సంబంధం ఉందంటున్న సెక్స్ కుంభకోణాన్ని అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని దోషులను కఠినంగా శిక్షించేందుకు సమగ్ర విచారణ జరుపుతోంది. సాంస్కృతిక ప్రదర్శనల పేరిట విదేశాలకు వెళ్లే కొంతమంది సినీతారలపై ఒత్తిడి చేయడం వంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై అమెరికాలో శిక్షలు కఠినంగా ఉంటాయి. హైదరాబాద్‌లోని సినీ ఆర్టిస్టుల సంఘం (మా) కూడా ఇటువంటి చర్యలను తీవ్రంగా పరిగణించి దోషులను కఠినంగా శిక్షించేలా అమెరికా ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంది. అమాయకులు వంచనకు గురికాకుండా, ఇలాంటి అనైతిక చర్యలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. బాధితులను కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. సెక్స్ రాకెట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అందరినీ చట్ట ప్రకారం శిక్షించాలి.
- ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం
అలంకార ప్రాయమేనా?
ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు హామీలు కురిపిస్తూ జనాల్ని ఊహల పల్లకిలో ఊరేగించడం నేతలకు అలవాటే. ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి కనెన్షన్ ఇస్తారట. దీని కోసం 22వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వేసవిలో కుళాయిల్లోంచి నీరురాక పోయినా నెలకు రూ.100 పన్ను చెల్లించాల్సి వస్తోంది. 2020 నాటికి అందరికీ తాగునీరు లభ్యం అవుతుందని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. అంటే ఇప్పుడు కుళాయిలేసి అప్పుడు నీరిస్తారా? ప్రస్తుతం ఉన్న కుళాయిలనుంచే నీరు రావటం లేదు. కొత్త కుళాయిల నుంచి ఎలా వస్తుంది? కుళాయిలు కేవలం అలంకారం కోసమా?

- సంపూర్ణ, కాకినాడ
చట్ట సవరణ ఏదీ?
నిత్యం వాడే ఆహార పదార్థాలు కల్తీమయం అవుతున్నాయి. పసుపు, కారం, వంటనూనెలు, కిందిపప్పు, పండ్లు కలుషితం అవుతున్నాయి. పాలు, మందులను కూడా కల్తీ చేస్తూ అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ ఆహారాన్ని విక్రయించినా, తయారుచేసినా నేరమే. ప్రస్తుతం ఉన్న చట్టాలకు తోడు ఇటీవల ‘ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ’ కీలకమైన సిఫారసులతో చట్టసవరణకు ప్రతిపాదించింది. చట్టంలోని సెక్షన్-59 ప్రకారం వ్యక్తులు,వ్యాపార సంస్థలు ఆహార ఉత్పత్తులను కల్తీచేస్తే కనీసం 7 ఏళ్ల జైలుశిక్ష విధించటం, కల్తీ తీవ్రతను బట్టి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించాలని కీలక ప్రతిపాదనలు చట్టసవరణలో చేర్చాలని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించేందుకు పాలకులు కృషిచేయాలి.
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి