ఉత్తరాయణం

క్రమశిక్షణ ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రమశిక్షణ లేని జాతి ‘పునాది లేని భవనం’ వంటిది. ఎంత ఎత్తు భవనమైనా పునాది గట్టిగా లేకపోతే పేకమేడలా కూలుతుంది. మన దేశం రెండంకెల వృద్ధిరేటుతో, సెనె్సక్స్‌లో పరుగులు తీసినా ప్రజల్లో క్రమశిక్షణ లోపిస్తే అంతా అరాచకమే. మన నేతలు నిత్యం స్మరించే సింగపూర్, చైనా వంటి దేశాలు కఠోర క్రమశిక్షణతోనే ఈ స్థాయికి చేరాయి. గతంలో పేద దేశమైనా ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలతో భారత్ ప్రశాంతంగానే వుండేది. మన దేశంలో పాశ్చాత్య వినిమయ విలాసాల సంస్కృతి, అవినీతి, అక్రమాలు, అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే ప్రజల్లో చైతన్యం కొరవడుతోంది, క్రమశిక్షణ మృగ్యమవుతోంది.
నేటి పాలకులు ప్రభుత్వ సొమ్మేకదా అని ప్రజలు కోరని వరాలు కూడ కురిపిస్తున్నారు. ఏ సంక్షేమ పథకమైనా సమాజంలో అట్టడుగున వున్న నిరుపేదలు, అనాథలకు దక్కాలి. స్థితిపరులు, సంపాదనాపరులు కూడ ప్రభుత్వ పథకాలను దక్కించుకుంటున్నారు. మరోవైపు యువత తమ బాధ్యతలు మరచి తాగుడు, జూదం వంటి వ్యసనాల పాలవుతుంటే మన కుటుంబ వ్యవస్థే విచ్ఛిన్నమైపోతోంది. సినిమా హాళ్ల వద్ద కంటే మద్యం దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది. మద్యం దుకాణాలను ప్రభుత్వం నియంత్రించాల్సి ఉంది. పాలకులు ఆదర్శంగా వుంటే ప్రజలు కూడ అనుచిత ప్రయోజనాలను ఆశించరు.
సమాజం చైతన్యంగా వుంటే రాజకీయ నేతలు, ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడటానికి జంకుతారని జనం గుర్తించాలి. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో కేవలం రెండు, మూడు ఓట్ల మెజారిటీతో ప్రభుత్వాలు సజావుగానే సాగుతాయి. ఇటీవల ఒక యూరోపియన్ దేశంలో నెలనెలా కుటుంబ పెన్షన్‌లా ఇంటింటికీ లక్ష రూపాయలకు పైగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే అత్యధిక శాతం ప్రజలు వ్యతిరేకించారట. ఎన్ని రాయితీలు, ప్రజాకర్షక పథకాలైనా, ఆ భారాన్ని తిరిగి పరోక్ష పన్నుపోట్లతో మనకు వెన్నుపోట్లు తెస్తాయని గ్రహించాలి. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మాభిమానంతో బాధ్యతగల పౌరులుగా మెలిగితేనే సమాజం మారుతుంది. అదే నిజమైన అభివృద్ధి. దేశ గౌరవం కూడ ఇనుమడిస్తుంది.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట