ఉత్తరాయణం

ఇది మోదీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం ఆర్థిక దిగ్గజం అయిన ఫ్రాన్స్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలో ఆరవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్న వార్త గత నాలుగేళ్ళుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషికి లభించిన విజయంగా అభివర్ణించవచ్చు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మన దేశ స్థూల జాతీయోత్పత్తి రెండున్నర లక్షల కోట్ల డాలర్లకు పెరిగి అత్యధిక జిడిపిగా కొత్త రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే పెరుగుదల నమోదుచేసిన పక్షంలో బ్రిటన్‌ను కూడా వెనక్కి నెట్టి అయిదవ స్థానం పొందగలిగే అవకాశాలు మెండు అన్న సదరు నివేదిక పేర్కొంది. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టీ వలన గత రెండేళ్ళుగా భారత్ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందన్న విపక్షాల విమర్శలకు ఘాటైన జవాబు ఇచ్చింది. భారత్ ఆర్థిక వృద్ధి రేటుపై ప్రపంచవ్యాప్తంగా సానుకూల సంకేతాలు వెలువడుతున్న తరుణంలో అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడిదారులు నూతనోత్సాహంతో దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామం. ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు అధికారం చేపట్టిన నాటి నుండి మోదీ సర్కారు ఎన్నో సంస్కరణలు, చర్యలు చేపట్టింది. స్థిర వృద్ధిరేటు సాధిస్తూ ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించేందుకు ప్రధాని చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం.

--ఎం.కనకదుర్గ, తెనాలి