ఉత్తరాయణం

వలసలు తెచ్చిన సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాంలో భారత ప్రభుత్వం చేపట్టిన జాతీయ పౌరుల గుర్తింపు జాబితా ముసాయిదాలో నలభై లక్షల మంది పేర్లులేకపోవడం పెద్ద సమస్యే. అస్సాంలో అసలు పౌరసత్వం ఉన్న స్థానికులకన్నా వచ్చి చేరిన జనాభా అధికంగా మారడంతో కొన్ని దశాబ్దాలుగా ఆందోళన నెలకొంది. బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో లక్షలాది మంది అక్కడినుండి వలసవచ్చి చేరారు. అంతకుముందు తేయాకు, ఇతర పంటల సాగుకు బిహార్, బెంగాల్ ప్రాంతాల్లోనుండి వచ్చి స్థిరపడిన వారి వల్ల ఎలాంటి సమస్య లేకపోయినా తరువాత స్థానికుల భూములు, సంస్కృతి, ఉద్యోగావకాశాలపై పెద్దపెట్టున వత్తిడి రావడంతో విద్వేషాలు మొదలయ్యాయి. సమస్య పరిష్కారం దిశగా గతంలో రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు పౌరుల గుర్తింపుకై ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం అమలు జాప్యం కారాదని సుప్రీం తన పర్యవేక్షణలో తీసుకున్న చొరవ ఫలితమే ఈ ముసాయిదా. 40లక్షల మంది తాము భారత పౌరులమేనని ఆధారాలు చూపాల్సిరావడం కష్టసాధ్యమే. వారికి ప్రభుత్వం సానుకూలతతో, సహనుభూతితో సహకరించాలి. వంద మంది అక్రమవలసదారులు లాభపడినా పరవాలేదు. కానీ ఒక్క భారత పౌరుడు కూడా నష్టపోరాదన్న విజ్ఞతచూపాలి. ఈ ప్రక్రియలో రాజకీయాల్ని, మతాన్ని చొరబడనివ్వరాదు. సకల పక్షాలూ సంయమనం చూపి సమస్య పరిష్కారానికి దోహదపడాలి. ఇది సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, అస్తిత్వ విషయాల్ని ప్రభావితంచేసే క్లిష్ట సమస్య. అలవోకగా మాట్లాడి జఠిలంచేస్తే తీరని నష్టమే. లక్షలాదిగా మిగలబోయే వలసదారుల పట్ల న్యాయమైన ప్రవర్తన చూపడం, పునరావాసం అందించడం అన్నది దేశం ముందున్న తప్పించుకోలేని సమస్య.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

రోడ్డు ప్రమాదాలను నివారించాలి
జాతీయ రహదారిపై ప్రమాదాలకు అంతే లేకుండాపోయింది. నిత్యం ఎన్నో ప్రమాదాలు జరిగి, ఎన్నో ప్రాణాలు అనంతవాయువుల్లో కలుస్తున్నా అధికారులు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. అతి వేగం, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాసింగ్, యువత దూకుడు, చిన్నవయసులోనే డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్స్, మద్యం మత్తులో వాహనాలను నడపడం, ప్రైవేట్ వాహనాలు మితిమీరిన జనాన్ని ఎక్కించుకొని వేగంగావెళ్ళడం తదితర కారణాలు రోడ్డుప్రమాదాలను పెంచుతున్నాయి. ఎంతోమంది వాహన చోదకులు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తున్నా పోలీసులలో చలనం లేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిత్యం పెట్రోలింగ్ జరగాలి. వాహనాల వేగాలను నియంత్రించాలి. రోడ్ల రిపేర్లను చేపట్టాలి. నిర్లక్ష్యానికి భారీగా జరిమానాలను వెంటనే వసూలుచేయాలి. లేదంటే జైలుశిక్ష విధించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

పవన్ వాదన సరికాదు
సినీనటుడు చిరంజీవి నేతృత్వంలోని ‘ప్రజారాజ్యం’ 2009 ఎన్నికల్లో ఓటమి చవిచూడగా, ఆ పార్టీలోని చాలామంది నాయకులు ఎవరి దారి వారు చూసుకున్నారు. ‘ప్రజారాజ్యం’ నేతలంతా చిరంజీవికి అండగానిలబడి ఉంటే 2014 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ వాపోయాడు. కానీ, ప్రజారాజ్యం పార్టీ పుట్టుకే ప్రతిపక్షాల ఓట్లు చీల్చి కాంగ్రెస్‌కు మేలుచేయడానికని అప్పట్లో విశే్లషకులు చెప్పారు. కాంగ్రెస్‌లో కలిసిపోయే సూచనలు కనిపించగానే ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రజారాజ్యం నేతలు సర్దుకున్నారు. అందులో వారి తప్పులేదు. నిజానికి ప్రజారాజ్యంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు మోసపోయారు. పవన్ నింద సహేతుకం కాదు.
-సోనాలి, కాకినాడ

అది నిందితుల హక్కు
చెన్నైలో దివ్యాంగ బాలికపై లైంగిక దాడి ఘటనలో నిందితుల తరఫున వకాల్తా తీసుకోబోమని తమిళనాడు న్యాయవాదులు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపునేని రాజకుమారి స్వాగతించి ఏ.పి. న్యాయవాదులు కూడా ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని కోరడం చట్టం పట్ల అవగాహన లేకపోవడమే. నిందితుల తరఫున వాదన వినకుండా ప్రపంచంలో ఏ న్యాయస్థానమూ శిక్ష విధించదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హంతకుల తరఫున వాదనలు వినిపించారు లాయర్లు. ఆ లాయర్లు దేశద్రోహులు కాదు, చట్టం పట్ల గౌరవం ఉన్నవాళ్లే.
- స్నేహమాధురి, పెద్దాపురం

రెండోవైపూ చూడాలి..
ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ అంతా ఆందోళన చెందుతుంటే- పవన్, జగన్‌లు తనను విమర్శిస్తూ కుట్రలు పన్నుతున్నారని సీఎం చంద్రబాబు అదే పనిగా బోరెత్తిస్తున్నారు. బాలకృష్ణ ఓ సినిమాలో చెప్పిన ‘ఒకవైపే చూడు.. రెండో పక్క చూడకు..’ అన్న డైలాగు మాదిరి బాబు వైఖరి ఉంది. ‘మోదీనే విమర్శించు.. నన్ను విమర్శించకు..’ అనేది ఆయన వైఖరి. ఈ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తిని సూచించదు. పవన్, జగన్‌ల ప్రశ్నలు సహేతుకంగానే ఉన్నాయి. బాధ్యతాయుత నేత ఆ విమర్శలకు ప్రశాంతంగా గణాంకాలతో వివరించాలి గాని కుట్ర, కుమ్మక్కు అంటూ ఆ ప్రశ్నలను కొట్టిపారెయ్యడం తగదు.
- లంబకర్ణ, కాకినాడ