ఉత్తరాయణం

కేంద్రం నిర్ణయం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం కోర్టు సిఫార్సుల నేపథ్యంలో పదును కోల్పోయిన ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో నిబంధనల్ని పునరుద్ధరిస్తూ సవరణ బిల్లు పెట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం హర్షణీయం. సకాలంలో తీసుకున్న సరైన నిర్ణయం ఇది. అత్యాచార చట్టం దుర్వినియోగం అవుతుందన్న సాకుతో నిందితునికి బెయిల్ ఇచ్చే అవకాశం కల్పించడంపై అధికారుల అనుమతి వచ్చేవరకూ కేసు నమోదు చెయ్యరాదనడం ఈ చట్టం స్ఫూర్తిని, ఉద్దేశాన్ని నీరుగార్చేవే. ఈ తరహా సడలింపులతో బలమైన నిందితుడికి లాభం, బలహీనుడైన బాధితుడికి తీరని నష్టం. సుప్రీం ఆదేశంతో మరింత నష్టం జరిగే అవకాశమున్నందున బాధిత వర్గాలూ, పౌర సమాజం ఆందోళన వెలిబుచ్చాయి. నిరసన కార్యక్రమాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే చట్టం రూపం దాల్చాలి. చిరిగిన రక్షణ కవచం మళ్లీ మునుపటి దృఢత్వంతో బాధిత వర్గాలకు బాసట కావాలి. ఈ చట్టం స్ఫూర్తి పాలకుల క్రియాశీలతలో ప్రతిబింబించాలి. సదరు కేసుల్లో అత్యధిక భాగం విచారణ వరకూ నిలవకపోవడానికి అసలు కారణం న్యాయప్రక్రియలో తీరని జాప్యం. కేసు నమోదు, దర్యాప్తు, విచారణ ప్రక్రియల్లో జవాబుదారితనం లోపించడం, చట్టాలు బలీనులవైపున్నా, అమలు చేసే యంత్రాంగం బలమైన వారివైపు నిలబడడం- ఈ లోపాల్ని అధిగమిస్తేనే అసలు న్యాయం జరుగుతుంది.
-డా. డి.వి.జి.శంకర్‌రావు, పార్వతీపురం

తమరు చేసిందేమిటో..?
కొన్ని సరకులపై వస్తుసేవా పన్ను (జీఎస్టీ) రేట్ల తగ్గింపు అసెంబ్లీ ఎన్నికల పుణ్యమేనని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం ఎద్దేవా చేయనక్కరలేదు. ఎన్నికలకు ముందు జనరంజక బడ్జెట్, రాయితీలు, ప్రోత్సాహకాల విషయంలో కాంగ్రెస్‌దే రికార్డు. గత ఎన్నికలకు ముందు రాష్ట్రాలను సంప్రదించకుండా, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండానే ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఒక రాష్ట్రంలోనైనా గెలుస్తామన్న నమ్మకంతోనే ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించింది హడావుడిగా. ఈ రెండు చర్యలూ విఫలం అవడం వేరే సంగతి. నిజానికి ఎన్నికల ముందు జనరంజక వరాలు కురిపించడం తప్పేమీ కాదు! అందరూ చేసేదే! ఎదుటివారు చేస్తే తప్పు అనడం సరికాదు.
-ప్రసన్న, పేర్రాజుపేట