ఉత్తరాయణం

కొండవాలు ప్రాంతాల్లో ఆక్రమణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖనగరంలో కొండ వాలు ప్రాంతాలలో పెద్దఎత్తున ఆక్రమణలకు పాల్పడుతూ స్థిర నివాసాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాలలో గుడిసెలు వేసుకునేందుకు అనుమతులు రానందున నగరంలో కొండలను, గుట్టలను ఆక్రమించుకుంటున్నారు. కొండవాలు ప్రాంతాలలో నిర్మాణాలు ప్రమాదంతో కూడుకున్నవని తెలిసినా గతిలేని పరిస్థితులలో పేదలు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇటువంటి 25వేల కుటుంబాలు ప్రమాదాల అంచున జీవిస్తున్నారు. తుఫాను, భారీ వర్షాలలో కొండ చరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం అవుతూ అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా రెవెన్యూ, కార్పొరేషన్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అట్లే గెడ్డలను ఆక్రమించుకోవడంతో భారీ వర్షాల సమయంలో నిర్మాణాలు కుప్పకూలిపోతున్నాయి. ఇంత యధేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మిన్నకుంటుండిపోవడం విస్మయం కలిగిస్తోంది.
- సి.ప్రతాప్, శ్రీకాకులం
బలవంతం ఎందుకు?
వర్షంలో గొడుగు వేసుకుని వెళ్ళకపోతే తడుస్తాం. కాళ్ళకు చెప్పులు లేకపోతే ముళ్ళు, సీసాపెంకులు గుచ్చుకుంటయ్. చలికాలంలో ఒంటిమీద స్వెట్టరో, కోటో వేస్కోకపోతే జలుబు చేస్తుంది. బండిమీద స్పీడుగా పోతే మధ్యలో బ్రేకులు పడకపోతే కష్టం. అట్లాగే శిరస్త్రాణం వుంటే కొంతవరకు ప్రమాదం బారిన పడకుండా తప్పించుకోవచ్చు. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకూ తెల్సిన విషయాలే. వాహనచోదకులు హెల్మెట్ ధరించకపోతే ఫైన్ పడుతుందని చెప్పటం దేనికి? ఎవరి మంచి చెడ్డలు వారికి తెలియవా? తమ సేఫ్టీకోసం ధరిస్తే వాళ్ళకే మంచిది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఫైన్ వెయ్యడం బాగానే వుంది.

- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
మొక్కుబడి సమావేశాలు
పూర్వం అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రజలు తమకు జరిగే మంచి చెడులు గూర్చి చర్చించుకునేవారు. ప్రస్తుతం మొక్కుబడిగా సమావేశాలు జరగడం, జరిగిన కొద్దిరోజుల్లో కొందరు సభ్యులు సభా మర్యాదలకు తిలోదకాలిచ్చే రీతిలో మాట్లాడటం చూస్తే మనం ఓటేసి ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులు వీళ్ళేనా అని సందేసం కలగక మానదు.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
పోటీ బుక్ ఫెస్టివల్స్ నిర్వహించాలి
బుక్ ఫెస్టివల్ అంటే ఇదేనా? అని ప్రశ్నించే లేఖ ఆలోచింపజేసింది. నిజానికి ఇదొక్కటే కాదు, ఎన్నో విద్యా పీఠాల్ని, సాహిత్య, సాంస్కృతిక సంస్థల్ని కూడా ఈ అభ్యుదయ ముసుగువీరులు కబ్జా చేసి ఇతరులకు స్థానం లేకుండా చేశారు. సంఖ్య తక్కువైనా వీరు ఆడింది ఆట, పాడింది పాటగా చెలామణి కావడానకి కారణం రాజకీయ అండదండలు మాత్రమే కాదు, మిగిలిన వారు పట్టించుకోకపోవడం కూడా. అయతే మిగిలిన వారు అంతా చేరి పుస్తకాల పండుగ పేరుతో అక్కడ దొరకనివి ఇక్కడ దొరుకుతాయ అన్న నినాదంతో పోటీ ఫెస్టివల్స్ నిర్వహించడం అత్యంత అవసరం.
- ధర్మతేజ, గొడారిగుంట, తూ.గో. జిల్లా
సోమరుల సత్రం
ఫేస్‌బుక్‌ని పెద్ద సోమరుల సత్రం అనడం సమంజసం. సోమరుల మెదళ్లు దయ్యాల నిలయాలు. సొల్లు కబుర్లు, అబద్ధాలు, చెలరేగుతుంటాయ. ప్రేమలు స్వైరవిహారం చేస్తుంటాయ. ప్రేమ విఫలమైతే కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, ఆత్మహత్యలు విజృంభిస్తాయ. ఫేస్‌బుక్ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతున్నది.
- లక్ష్మి, బృందావనం, తూ.గో.జిల్లా
అనర్హులను తొలగించాలి
ఆధార్ కార్డుల్లో 65 సంవత్సరాలుగా మార్చుకొని, దరఖాస్తు చేస్తున్నారు. 30, 40 ఏళ్ల వ్యక్తులు కూడ ఆధా ర్‌తో వయసు మార్చుకొని పింఛన్లకు దరఖాస్తు చేస్తు న్నారు. వీరికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి. గతంలో పున రుద్ధరణ పేరుతో పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరిలో చాలామంది అనర్హులు ఉన్నారు. ఇలాంటి అనర్హులను ఏరివేయడానికి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. భర్తలు జీవించి ఉన్నా కూడ మరణ ధ్రువీకరణ ప్రతాలు తీసుకొని పింఛన్లకు దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న అనర్హులను వెంటనే తొలగించాలి.
- పెండలం రాఘవ, శుంకెసుల బండ, అనంతపురం జిల్లా
వేలం వెర్రి
వేలం వెర్రిలా మారిన జనవరి 1 చాలామందికి దుఃఖాన్ని కలుగజేస్తున్నది. దీన్ని ప్రభుత్వం నిరోధిం చాలి. ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తప్ప చాలా దేశాల్లో ఈరకమైన అరాచకం లేదు. వందకోట్ల విలువైన మద్యం, 50 టన్నుల మాంసం విక్రమయమవ డం ఎంతటి విపత్తును సూచిస్తున్నదో విజ్ఞులు ఆలోచించాలి. కేవలం కేలండర్ సంవత్సర మార్పుకు ఇంతటి హంగామా, వికృత చేష్టలు, రోడ్డు ప్రమాదాలు, శబ్ద కాలుష్యం తెలుగు రాష్ట్రాలను ఎటు తీసుకెళుతున్నా యని బాధ కలుగుతున్నది. ప్రభుత్వం జనవరి 1న సెలవు దినాన్ని రద్దు చేసింది. అయనా తాగి తూలుతూ రెండో తేదీ కూడా అప్రకటిత సెలవుగా మార్చడం ప్రభుత్వ పనితీరుకు, అదుపులేదనేందుకు నిదర్శనంగా భావిం చాలి. ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. మన సంస్కృతి, పండుగలు ఎంతటి మేలు చేస్తాయో ఇలాంటి నేరపూరిత రోజు గుర్తు చేస్తున్నది. ఆచరణ, ఆదర్శం పైస్థాయ నుండి వస్తే సామాన్యులు ఆచరిస్తారు. లేకపోతే పతనం తప్పదు.
- పి. రాజేశ్వరరావు, జగ్గయ్యపేట