ఉత్తరాయణం

ఆ బిల్లు అహేతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీలు ‘ఎన్నికల బాండ్ల’ రూపంలో నిధులు సమీకరించుకోవడానికి వీలు కల్పించే ఫైనాన్స్ బిల్లుకు చట్టసవరణను పార్లమెంటు ఆమోదించడం సరికాదు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు వివిధ ప్రైవేటు, కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలు ఇచ్చే విరాళాల గోప్యత విషయంలో సంస్కరణలు తెస్తామని- కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత భాజపా సర్కారు గొప్పగా ప్రకటించింది. అయితే, ఆ వాగ్దానం విషయం పక్కన పెట్టి గోప్యత పెంచే విధంగా సంస్కరణలు చేపట్టడం విచారకరం. రాజకీయ పార్టీల్లో టికెట్ల కేటాయింపు మొదలు పోలింగ్ వరకు ధనం ఏరులై పారడం దేశ ఎన్నికల ముఖచిత్రంలో సర్వసాధారణ విషయమే. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల, అభ్యర్థుల ఖర్చు నానాటికీ అనూహ్యంగా పెరుగుతోంది. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలతో పాటు ధనం, మద్యం పంపిణీ, అక్రమాలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు ఎన్నికల్లో భాగమైపోయాయి. అందుకే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నికలలో అక్రమాలను అరికట్టడంతోపాటు ధన ప్రవాహాన్ని కట్టడి చెయ్యాలని మేధావులు, సంస్కర్తలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సమాజం నుంచి విజ్ఞప్తులు మొదలయ్యాయి. 1995లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పులో రాజకీయ పార్టీలు తమ ఆదాయ వనరులను, వాటిని ఎలా ఖర్చుచేశారోనన్న వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని, వాటిని వెబ్‌సైట్లలో కూడా పొందుపరచాలని సుప్రీం స్పష్టమైన ఆదేశాలనిచ్చింది. అయితే ఎప్పటిలాగే రాజకీయ అవినీతి విషయంలో తమ విభేదాలు పక్కన పెట్టి ఒకే తాటిమీదకు వచ్చే మన రాజకీయ పార్టీలు ఈ తీర్పును కూడా సంఘటితంగా బుట్టదాఖలు చేశాయి. గతంలో యుపీఏ ప్రభుత్వం రాజకీయ అవినీతిని అరికట్టేందుకు నామమాత్రపు చర్యలను కూడా చేపట్టకపోగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా విమర్శించిన బిజెపి ఇపుడు అధికారంలోకి రాగానే, ఫైనాన్స్ బిల్లును ఆమోదింపజేసుకుంది. ఇది రాజకీయ అవినీతిని ప్రత్యక్షంగా ప్రోత్సహించడమే అవుతుంది. ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకున్న ఈ నిర్ణయంతో రాజకీయ అవినీతికి మరింత ఊతం ఇచ్చినట్టయ్యింది. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్లు, పలువురు ఆర్థిక నిపుణులు సైతం ఈ ఎన్నికల బాండ్ల జారీ ప్రక్రియే లోపభూయిష్టమైందని పేర్కొన్నారు. బాండ్ల జారీ బాధ్యత కేంద్ర ఆర్థిక శాఖకు కట్టబెట్టడం అనుచిత చర్య అని అభిప్రాయపడుతున్నా శరవేగంతో ఈ ఆర్థిక సవరణ బిల్లును ఆమోదింపజేయడం వలన ప్రభుత్వం బోలెడు అప్రతిష్ఠ మూతకట్టుకున్నట్లయ్యింది.
-ఎం.కనకదుర్గ, తెనాలి
చేనేతకు చేయూత లేదా?
ఒకప్పుడు మగ్గం చప్పుళ్లతో కళకళలాడిన గ్రామాల్లో నేడు నిశ్శబ్దం ఆవరిస్తోంది. అనాదిగా నమ్ముకున్న కులవృత్తి నేడు పొట్టనింపకపోవడంతో చేనేత కార్మికులు క్రమంగా ఆ వృత్తిని వీడుతున్నారు. మరికొందరు ఇతర వృత్తుల్లోకి ఇమడలేక ఇందులోనే అనునిత్యం జీవన పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితి తమ పిల్లలకు రాకూడదని వారిని ఇతర వృత్తులకు పంపుతున్నారు. రానున్న రోజులలో చేనేత పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 7, 2015న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ, నేత కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా 2012 నుంచి ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకు సంత్ కబీర్ అవార్డులను అందిస్తున్నారు. నానాటికీ సాంకేతికపరమైన పనిముట్లు పెరగడం, రెడీమేడ్ దుస్తుల ప్రభావం వల్ల మరమగ్గాల జాడ కనుమరుగవుతోంది. చేనేత రంగంలో సరైన సంపాదన లేక, తమ ఉత్పత్తులకు మార్కెట్‌లో తగిన ధర లేక మగ్గాలే నేతన్నలకు ఉరి తాళ్లవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్‌ను పరిశీలిస్తే నూలు మిల్లులకు, మరమగ్గాలకు 6,225 కోట్లు కేటాయించి పెద్దపీట వేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చేనేత రంగంలో రెండున్నర కోట్ల మందికిపైగా ఉపాధి లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులకు సరైన ఉపాధి లభించక సూరత్, ముంబయి, భివాండీ, షోలాపూర్ లాంటి దూర ప్రాంతాలకు వలస పోతున్నారు. దీంతో చేనేత కార్మికులను ఆదుకునే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేనేత లక్ష్మి పథకాన్ని ఆగస్టు 7, 2016న ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితులలో చేనేత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలి. ప్రతి నేతన్నకూ కావాల్సిన సౌకర్యాలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. అన్ని రాష్ట్రాలలో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఉపాధి, ఉత్పత్తి పెరిగి దేశ అభివృద్ధి సూచీకి కొంత తోడ్పడుతుంది. చేనేత రంగంలో అవసరమైన సంస్కరణలు ప్రవేశపెట్టి నూతన శకాన్ని ఆవిష్కరించాలి.
-్భమ్‌రాజ్ చిప్ప, వరంగల్
భయం దేనికి?
‘భాజపా, వైకాపా కుమ్మక్కు... తెదేపాకు వ్యతిరేకంగా కుట్ర రాజకీయాలు...’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిద్రలోకూడా కలవరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పరస్పరం అవగాహన ఉన్న పార్టీలు కలవడం, వ్యతిరేకించుకోవడం రాజకీయ అవసరాల మేరకు జరుగుతాయి. మరి ఆ మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో చంద్రబాబు ఫొటో దిగడం కుమ్మక్కు, కుట్ర అవుతాయా? శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం గాని రాజకీయ పార్టీల మధ్య ఉండవు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరితో కలుస్తారో, ఎవరితో విడిపోతారో చెప్పలేం అని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. అయినా, రెండు పార్టీల నేతలు కలవడం కుట్ర, కుమ్మక్కు అని చంద్రబాబు అంటున్నారంటే ఆ పార్టీల ఐక్యత తనకు ఇబ్బందే అని ఆందోళన చెందడం ఎందుకు?
-సుభాష్, కాకినాడ