ఉత్తరాయణం

దేశభక్తి గీతాల జాడ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పాఠశాలల్లో దేశభక్తి గేయాలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ‘నేనూ నా దేశం, నీ ధర్మం నీ సంఘం, గాంధీ పుట్టిన దేశం, పుణ్యభూమి నా దేశం, భలేతాత మన బాపూజీ.. వంటి సినీ గేయాలు, సారే జహాసె అచ్చా, హింద్‌దేశ్‌కే నివాసి, పిల్లల్లార పాపల్లార, హోంగే కామియాబ్.. వంటి సామూహిక గీతాలను, ఎల్లలెరుగని వాళ్ళము అనే ప్రపంచ బాలల గీతం.. ఇంకా అనేక దేశభక్తి గీతాలు నేటితరం పిల్లలకు తెలియవు. సందేశాత్మక గీతాలను, దేశభక్తి గేయాలను స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా విధిగా పాఠశాలల్లో వినిపించేవారు. పిల్లలకు వాటిని నేర్పించే వారు. ఈ గీతాలు పిల్లలలో దేశభక్తిని పెంచేవి. కానీ నేడు ఆ పాటలను మరచిపోయే పరిస్థితి వచ్చింది. జెండావందనం కూడా మొ క్కుబడి తంతులా ముగిస్తున్నారు. ఇప్పుడు అతి కొద్ది పాఠశాలల్లోనే దేశభక్తి గీతాలాపన జరుగుతోంది. కొన్ని ఆధునిక గేయాలను రికార్డుల్లో వినిపిస్తున్నారు. పాటల పోటీ అంటే ఇప్పుడు పిల్లల నోటి నుంచి వచ్చేవి సినిమా పాటలే. సాహిత్యంతో సంబంధం లేకుండా మాస్ పాటలే వినాల్సి వస్తోంది. ఈ పరిస్థితి పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో పిల్లలకు నిత్యం దేశభక్తి, సందేశాత్మక గీతాలను నేర్పించాలి. వారిలో దేశభక్తిని పెంపొందింపజేయాలి. వారిని నైతికంగా ఉత్తములను చేయాలి. జాతీయ భావాన్ని పెంచే దేశభక్తి గీతాలను, సామూహిక గేయాలకు శాశ్వత కీర్తిని తేవాలి. పాఠ్యపుస్తకాలలో కొన్ని దేశభక్తి గీతాలను చేర్చాలి. దేశభక్తి పాటలను సీడీలుగా రూపొందించి ప్రభుత్వం అన్ని పాఠశాలలకు సరఫరా చేయాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

‘నాలెడ్జ్ హబ్’ అంటే..?
‘విద్యారంగం అభివృద్ధికి 23వేల కోట్ల రూపాయలు కేటాయించాం.. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చేస్తున్నాం..’ అంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో గొప్పగా చెప్పారు ఏపీ మానవ వనరుల మంత్రి. మాటలు కోటలు దాటడం అంటే ఇదే. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సగం పోస్టులు ఖాళీ. మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్ని దిగజార్చి, కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని ప్రయివేటు కాలేజీలు, ఎక్కడా లేనట్టు లక్షల్లో ఫీజులూ ఏపీలోనే ఉంటున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీలో సీటు వచ్చినా, ఫీజు వాపసు పథకాన్ని కూడా వదులుకుని విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో 34వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయంటే కారణం ఏమిటి? ఇదేనా నాలెడ్జ్ హబ్?
-గునే్నశ్, కొవ్వాడ

ఇదే ఉత్తమ పరిష్కారం..
సినిమా హాళ్లలో తినుబండారాలను అధిక ధరలకి అమ్మడం గురించి చాలా చర్చ, ప్రచారం జరుగుతున్నాయి. నిజానికి నేటి సినిమాలలో సారం లేని విధంగానే థియేటర్లలో అమ్మే తినుబండారాలు, పానీయాలు ఎంత మాత్రమూ ఆరోగ్యప్రదం కాదు. ప్రేక్షకులు అసలు సినిమాలను చూడటమే మానుకుంటే తినుబండారాల ధరలే కాకుండా టికెట్ల ధరలను కూడా తగ్గిస్తారు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లుగా సినిమా పరిశ్రమ వారే మల్టీప్లెక్స్‌ల దోపిడీ, తినుబండారాల రేట్ల విషయం చూసుకుంటారు. ప్రభుత్వం ‘నియంత్రణ చర్యలు’ ఎన్ని తీసుకున్నా కేవలం ఆర్భాటమే తప్ప జరిగేది, ఒరిగేది ఏమీ ఉండదు. అసలు సిసలు పరిష్కారం ప్రజల దగ్గరే ఉంది కాబట్టి.
-ఎన్.మధుసూదన్‌రావు, హైదరాబాద్

ఓహో.. ‘జ్ఞానధార’!
‘జ్ఞానధార’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు యూనివర్సిటీల్లోకి వెళ్లి విద్యార్థుల్ని తెలుగుదేశం పార్టీవైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. యూనివర్సిటీల్లో ఎంత ‘జ్ఞానధార’ ప్రవహిస్తున్నదో విద్యార్థులకు తెలియదా? చాలా యూనివర్సిటీల్లో సగం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కొందరు ప్రొఫెసర్లు మార్కులు, డిగ్రీల ఆశ చూపించి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఓపెన్ యూనివర్సిటీల్లో పరీక్షలు రాయకుండానే చాలామంది ఎలా డిగ్రీలు సంపాదిస్తున్నారో విద్యార్థులందరికీ తెలుసు. సమస్యలు పక్కనపెట్టి, ‘జ్ఞానధర’ అంటూ హడావుడి ఎందుకు?
-సుధీర్, కాకినాడ

మమత అక్కసు...
సుప్రీం కోర్టు పర్యవేక్షణలో అసోంలో జాతీయ పౌర రిజిష్టర్ ముసాయిదా తయారైంది. 40 లక్షల మంది వివరాలు సమగ్రంగా లేనందున వారి పేర్లు పక్కన పెట్టారు. వారు వివరాలు సమర్పించి రిజిస్టర్‌లో నమోదు కావచ్చు. కానీ, ‘రాజకీయ దురుద్దేశంతోనే భాజపా ఇలా పౌరుల్ని విభజించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసింది.. దీంతో అంతర్యుద్ధం వస్తుంది.. రక్తపాతం తప్పదు..’ అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పాలన పట్ల అసంతృప్తికి గురైన హిందువులు భాజపా వైపు తిరిగిపోతారేమో అని ఆమె భయం.
-శుభ, కాకినాడ

వారు చేస్తే తప్పే..
‘మెజీషియన్ టోపీ నుంచి కుందేలు బయటపడినట్టు’ తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ నోటినుంచి అసలు విషయం బయటపడింది. కాంగ్రెస్‌తో పొత్తు కాలమే నిర్ణయిస్తుందని ‘గల్లా’ అనడం సరే. మరి భాజపా, వైకాపా, జనసేనల మధ్య పొత్తు ఉంటుందో ఉండదో గాని ఉంటే మాత్రం జయదేవ్ సూత్రం ప్రకారం తప్పేమిటి? అది కుట్ర ఎలా అవుతుంది? ఎవరు ఎవరితో జట్టుకట్టినా అది ఆయా పార్టీల లెక్కల మేరకు ఉంటుంది. తమ పార్టీ పొత్తును సమర్ధించుకుంటూ, ఇతరుల పొత్తుని నిరసించడం సముచితమా?
- ప్రసన్న, పేర్రాజుపేట