ఉత్తరాయణం

వరద బాధితులకు బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల విలయంతో అతలాకుతలమై అవస్థలు పడుతున్న కేరళ వరద బాధితులకు దేశ ప్రజలంతా మానవతా దృక్పథంతో అండగా నిలవాలి. కేరళ అనగానే ప్రకృతి సోయగాలు, పర్యాటక ప్రాంతాలు, కొబ్బరి తోటలు, దేవాలయాలు దర్శనమిస్తాయి. వరుణుడు పగబట్టినట్లు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురియడంతో వరదల ధాటికి కేరళలో వందల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. భారీగా పంట నష్టం, ఆస్తినష్టం జరిగింది. లక్షలాది కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఎన్నో గ్రామాలు, పట్టణాలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి మిగతా రాష్ట్రాలు భారీగా విరాళాలు అందజేయడం అభినందనీయం. తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకం. మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించడం వారి ఔదార్యానికి నిదర్శనం. టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన హీరోలు, హీరోయిన్లు కూడా తమవంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇదే రీతిలో ప్రజానీకం అంతా మానవతా హృదయంతో స్పందించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, కుల సంఘాలు, యువజన సంఘాలన్నీ వరద బాధితులకు ఆపన్నహస్తం అందించాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
కేరళను ఆదుకోవాలి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం ఇప్పుడు దీనస్థితిని ఎదుర్కొంటోంది. జల విలయానికి రోడ్లు, ఇళ్లు, గ్రామాలు నామరూపాలు లేకుండాపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచినీరు, ఆహారం కరవై వరద బాధితులు విలవిలలాడుతున్నారు. భారీ ఆస్తినష్టం జరిగింది. ఇప్పట్లో ఆ రాష్ట్రం కోలుకోవడం కష్టమే. ఇలాంటి కష్టాన్ని చూచి ‘అయ్యో..’ అనడం కాదు. ప్రతి ఒక్కరూ స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ధనవంతులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, అన్ని వర్గాల వారూ స్పందించి యథాశక్తిన ఆర్థిక సాయం చేయాలి. వీలైతే అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ స్పందించి కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
సమర్ధతే గీటురాయి
తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు- నరేంద్ర మోదీ అప్పటికి ఇంకా రాజకీయాల్లోకి రాలేదని, తనకంటే మోదీకి అనుభవం తక్కువ అని ఏపీ సీఎం చంద్రబాబు ఈమధ్య చెప్పుకున్నారు. కానీ, అనుభవానికి- సమర్ధతకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆయనకు తెలియదా? ఏ అనుభవం లేకుండానే రాజీవ్ గాంధీ దేశాన్ని ఏలలేదా? ఉద్యోగుల్ని 60 ఏళ్ల వయసుకు లేదా 30 ఏళ్ల సర్వీసుకు ఎందుకు రిటైర్ చేస్తున్నారు? 60 ఏళ్లు దాటిన వారంతా అనుభవజ్ఞులే కదా. వాళ్లని ఎందుకు కొనసాగించరు? ఆనాటి ఇందిర నుంచి ఈనాటి సోనియా వరకు సమర్ధులైన యువ బృందాన్ని కోటరీగా ఏర్పాటు చేసుకొని వారి సలహాల ప్రకారం పాలించినవారే కదా. సోనియా అయితే ప్రధానిని కీలుబొమ్మ చేసి వెనక నుంచి పాలించిన సమర్ధురాలు. ఆమె కూడా రిటైర్ కాక తప్పలేదు!
-శాండీ, కాకినాడ
*
ఈ పేజీకి రచనలు పంపవలసిన చిరునామా
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003
*
email: editpage@andhrabhoomi.net