ఉత్తరాయణం

స్వలింగ సంపర్కం ప్రకృతి విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో జరుపుకొనే స్వలింగ సంప ర్కం నేరం కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు బాధాకరం. ఈ తీర్పు మన సనాతన భారతీయ జీవన విధానానికి, పవిత్రమైన వివాహ వ్యవస్థకు, కుటుంబ జీవనానికి విఘాతం కలిగించేదిగా వుంది. న్యాయ పాలిక దృష్టిలో ఈ చర్య తప్పుకాకపోవచ్చు కానీ యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలిచిన స్ర్తి, పురుషుల సంబంధ బాంధవ్యాలు, పవిత్ర జీవన విధానం, మన వేదాల్లో చెప్పిన ధర్మయుత శృంగార జీవితానికి సదరు చర్యలు విఘాతం కలిగించేలా వుంటాయి. పాశ్చాత్య దేశాలలో ఇటువంటి అనైతిక, అసభ్యకర, ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యలు సర్వసాధారణం, సహజం కావచ్చు. నైతికత, ధర్మబద్ధ జీవన విధానాలతో ప్రపంచంలోనే విశిష్ఠ స్థానం సంపాదించుకున్న భారతదేశంలో మాత్రం ఇటువంటి చర్యలకు ఎప్పటికీ స్థానం లేదు. ఇటువంటి శృంగారాన్ని నేరం కింద పరిగణించకపోతే ఎన్నో సామాజిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. న్యాయం లేదా చట్టం కోణంలో కాకుండా అపూర్వమైన మన దేశ సంస్కృతి, సంప్రదాయాల దృష్టి నుండి ఆలోచించాల్సిన అవసరం ఎంతో వుంది. ఇప్పటికే సహజీవనం పేరిట స్ర్తి, పురుషులు ఒకే ఇంట్లో ఎటువంటి బాంధవ్యం లేకుండా కలిసి జీవిస్తూ, పిల్లల్ని కంటూ మన పవిత్రమైన వివాహ వ్యవస్థను పక్కదోవ పట్టిస్తున్నారు. స్వలింగ సంపర్కం కూడా న్యాయ సమ్మతం చేస్తే ఇక మన వివాహవ్యవస్థ భ్రష్టుపట్టిపోవడం ఖాయం. స్ర్తి, పురుషుల మధ్య శృంగార జీవితం ఎలా వుండాలో మన పురాతన గ్రంథాలు చాలా స్పష్టంగా తెలిపాయి. ఆఖరుకు మానవ జాతి వినాశాన్ని కాంక్షించే రాక్షసులు కూడా ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన చర్యలకు పాల్పడలేదు. సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాల్సిన మన సెలబ్రిటీలు ఈ తీర్పును స్వాగతించడం చూస్తుంటే పవిత్రత, నైతికత, ధర్మబద్ధ జీవనానికి పుట్టినిల్లు అయిన ఈ దేశం ఏమైపోతోందో అన్న బాధ కలుగుతోంది. లైంగిక వ్యాధుల సంక్రమణ ఎక్కువైపోయి, ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధులు ఇకపై గణనీయంగా పెరుగుతాయి. స్వలింగ సంపర్కం అనేది ఒక మానసిక వ్యాధి, జన్యుపరమైన లోపం అని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, మానసిక నిపుణులు ఏనాడో తేల్చారు. అనేక దుష్పరిణామాలకు దారితీసే ఇటువంటి అనైతిక, ధర్మవిరుద్ధ చర్యలను అనుమతించడం ఎంతవరకు సమంజసమో మేధావులు, మానసిక నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు ఆలోచించాలి. ఈ విషయంలో ముఖ్యంగా యువతను చైతన్యవంతం చేయాలి.

-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం