ఉత్తరాయణం

విషజ్వరాల వీర విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే అభివృద్ధిలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా డెంగ్యూ, మలేరియా, డయెరియా, స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి ఈ ప్రాంతాన్ని రోగపీడిత జిల్లాగా మార్చేశాయి. పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం, గాడి తప్పిన వైద్య ఆరోగ్యశాఖ పనితీరు, ముందస్తు చర్యలను చేపట్టడంలో అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపాలుగా మారాయి. వృద్ధిరేటు, తలసరి ఆదాయంతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలోనే ఈ జిల్లా అగ్రస్థానంలో ఉందని ప్రభుత్వ యంత్రాంగం గొప్పలు చెప్పుకుంటుంటే మరొక పక్క జ్వర పీడితుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా అంతటా విషజ్వరాలు వీర విహారం చేస్తున్నాయి. పేద వర్గాలతోపాటు ధనిక వర్గాలను సైతం జ్వరాలు వదలడం లేదు. జిల్లాలోని సర్కారీ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. ప్రాణాంతకమైన డెంగ్యూ కేసులు జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రెండు నెలల క్రితం జిల్లాను ఒక కుదుపు కుదిపిన విష జ్వరాలు మళ్లీ విజృంభించాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్యం కారణంగా విష జ్వరాలు ప్రబలుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా నిర్వహించాల్సిన పారిశుద్ధ్య చర్యలు ఏ మాత్రం పల్లెల్లో కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ మరణాలు సంభవించినా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం వాటిని నిర్ధారణ చేయకపోవడం గమనార్హం. సిబ్బంది లేమి, నిధుల కొరత, అధికారుల అలసత్వం కారణంగా జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులలో వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స లభించని కారణంగా ప్రజలు వేలకువేలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకోవలసి వస్తోంది. అదను చూసి ప్రైవేట్ వైద్యకేంద్రాలు టెస్టులు, మందులు పేరిట బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ నిర్లిప్తవైఖరి అవలంబించడం బాధాకరం. ఇటీవల పక్షం రోజులపాటు స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించినా అవి ప్రచారానికే పరిమితం అయ్యాయి. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులు స్పందించి డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
జోరుగా ఆహార పదార్థాల కల్తీ
అంతా కల్తీ మయం.. ఈ జగమంతా కల్తీమయంగా మారింది. పాలు, పండ్లు, నూనె, తేనె, ఉప్పు, పప్పు, సబ్బులు, కారం, పసుపు, టీ పొడి, తాగే మంచినీరు.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు మారింది పరిస్థితి. కల్తీ పదార్థాలు అని తెలిసినా కట్టడి చేయలేని పరిస్థితి అధికారుల నిర్వాకానికి నిదర్శనం. రాష్ట్రంలో ఆహార తనిఖీ అధికారులు అంటూ ఉన్నారా? అసలు వీరు వస్తువులు అమ్మే దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారా? .. అందరిలో మెదిలే ప్రశ్నలు ఇవి. ముఖ్యంగా పల్లెటూళ్లలో సైతం మిల్క్‌పార్లర్‌లు పుట్టుకువస్తున్నాయి. రకరకాల ప్యాకింగ్‌లతో ‘చిక్కదనం, రుచికి మారుపేరు తమ పాల ఉత్పత్తులు’అని గోడలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలలో నీళ్ళతోపాటు చిక్కదనం కోసం పిండి పదార్థాలను కలుపుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. టీ పొడిలో రంపపు పొట్టును వాడుతున్నారని, పిల్లలు ఇష్టంగా తినే ఐస్‌క్రీములలో ప్రమాదకరమైన రంగులు వాడుతున్నారని అందరికీ తెలుసు. ఇక బేకరీ, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల పరిస్థితి మరింత అధ్వానం. కాలేజీ విద్యార్థులు ప్రతీరోజూ బేకరీలకు వెళ్లడం కడుపారా ఆరగించడం, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది. బేకరీలలో రుచికోసం రసాయనాల నూనెలు వాడటం వల్ల వాటిని తినేవారికి రోగాలు తప్పనిసరి అవుతున్నాయి. స్వచ్ఛమైన గొర్రె మాంసం, కోడి మాంసం దొరకడం లేదు. చనిపోయిన మేకలు, గొర్రెలను కోయడం, మిగిలిపోయిన మటన్‌ను ఫ్రిజ్‌లో నిల్వవుంచి మరుసటి రోజున విక్రయించడం జరుగుతోంది. కోళ్లు త్వరగా పెరగడానికి వాటికి ఇంజక్షన్‌లు చేయడం, చికెన్ రుచిగా లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో కోళ్లు, ఇతర జంతువులను కోయడం యథేచ్ఛగా జరుగుతున్నాయి. మార్కెట్టులో దొరికే ప్రతి వస్తువు రెండవ, మూడవ రకంగా అమ్మడం పరిపాటిగా మారింది. మరోవైపు ఆఫర్ల పేర నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. వివిధ హోటళ్ల ముందు తినుబండారాలను బయటనే పెట్టడం, దానిమీద దుమ్ము, ధూళి పడడం, కల్తీ నూనెలతో పదార్థాలు చేయడం సర్వసాధారణమయింది. చాలా దుకాణాలలో గడువుముగిసిన ప్యాకేజీ ఫుడ్‌ను అమ్ముతున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల కొరత వల్ల, ఉన్న అధికారుల దాడులు చేయకపోవడం వల్ల వ్యాపారులు బరితెగించి సామాన్య జనానికి కల్తీ వస్తువులు, పదార్థాలు అంటగడుతున్నారు. ప్రజలలో చైతన్యం రావాలి. తాము కొన్న ప్రతి వస్తువుకు విధిగా రసీదు తీసుకోవాలి. ఈ పరిస్థితులపై యువత స్పందించాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
‘ఆదర్శ’ టీచర్లకు జీతాలు ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో బోధన చేస్తున్న ప్రిన్సిపాల్స్‌కు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్లకు, (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు) ఆగస్టు వేతనాలను ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేయలేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని కేటగిరీ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెలా 1వ తారీఖున జీతాలు అందుకునే పరిస్థితి ఉంది. కేవలం మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మాత్రమే జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి మోడల్ స్కూల్ సిబ్బందికి (2054 మంది) తక్షణం వేతనాలు అందే విధంగా తగు చర్యలు చేపట్టాలి. ఈ ఉపాధ్యాయులు ప్రతి చిన్న సమస్యకు రోడ్డెక్కి పోరాటాలు చేసే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొని రాకూడదు. ఇప్పటికైనా మోడల్ స్కూల్స్‌పై ప్రభుత్వం అనుసరించబోతున్న విధానమేమిటో స్పష్టం చేయాలి.
- బి.సురేష్, శ్రీకాకుళం