ఉత్తరాయణం

దేవస్థానం- న్యాయస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దుచేస్తూ సుప్రీం కోర్టు విలక్షణమైన తీర్పు వెలువరించింది. మహిళలు ఆ గుడిలోకి ప్రవేశించవచ్చునంటూ తేల్చిచెప్పింది. ఇది మహిళల పట్ల ఉన్న వివక్షను రద్దుచేసే తీర్పుగా ఎక్కువమంది అభినందిస్తున్నారు. మతం అన్నది వ్యక్తిగత భావన. మన దేశం మత రహిత దేశం కాదు, మతతత్వ దేశం కూడా కాదు. అన్ని మతాలనూ ఒకే గౌరవభావంతో చూసే దేశం. తమకు, తోటివారికి ఎలాంటి హాని, అసౌకర్యం కలగకుండా ఉన్నంతవరకూ ఎవరెలాంటి ఆరాధన, భక్తి కార్యక్రమాలు చేసుకున్నా అభ్యంతరం లేదు. తమ విశ్వాసాల్ని, భక్తిని కలిగి ఉండే హక్కుని రాజ్యాంగం ప్రసాదించింది. శబరిమల దేవాలయం మాత్రమే మహిళల ప్రవేశాన్ని నిషేధించే ఆచారాన్ని పాటిస్తూ వస్తోంది. అది ఆ దేవాలయంకే పరిమితమైన ఒక ఆచారం. ఉన్నత న్యాయస్థానం ఇందులో కలుగజేసుకోవాల్సినంత అవసరం ఉందా? అన్నదే సందేహం. కొన్ని విషయాల్లో చట్టం చెయ్యడం శాసన వ్యవస్థ బాధ్యత, వాటిని రాజ్యాంగపరంగా సరిగ్గా ఉన్నాయో లేదో చూడడమే తమ బాధ్యత అని కోర్టు తేల్చిచెప్పింది. ఎలాంటి హానీ లేని ఆచారాల్ని సంబంధిత మతాలకే వదిలేస్తేనే మంచిదనిపిస్తోంది. ఈ అంశాన్ని మహిళా వివక్ష కోణంలో చూడడం అవసరమా?
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఆదర్శ పాఠశాలల గతి ఏమిటి?
ఆదర్శ పాఠశాలలను ఏపీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకురావల్సిన అవసరం ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆదర్శ పాఠశాలలు ‘ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ సొసైటీ’ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని విద్యాశాఖ చెబుతున్నప్పటికీ 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం వీటి నిర్వహణకు సొసైటీని కొత్తగా ఏర్పరచలేదు. ఈ పాఠశాలల నిర్వహణపై విధాన నిర్ణయం ప్రకటించవలసి ఉన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ‘సమగ్ర శిక్షా’ పేరుతో ‘రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్’, ‘సర్వశిక్షా అభియాన్’పేరున ఉన్న సొసైటీలను విలీన ప్రకటనకు అనుగుణంగా రాష్ట్రం కూడా ‘సమగ్ర శిక్షా’ ఏర్పాటు చేస్తుంది. కేంద్రం ద్వారా అమలుఅవుతున్న ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. మరి ఆదర్శ పాఠశాలలను ఇదివరకే కేంద్రం రద్దుచేసినప్పుడు రాష్ట్రంలో ఈ పాఠశాలలు ఏ విభాగంలోకి వస్తాయి? ఇంత పెద్ద మోడల్ స్కూల్స్ ప్రాజెక్టును నిర్వహించే సంస్థ ఏదో నిర్ణయించకపోవడం ప్రభుత్వ తప్పిదమే అవుతుంది. ఆదర్శ పాఠశాలలను రాష్టమ్రే నిర్వహించాలన్న ఒకే ఒక్క నిర్ణయం పెండింగ్‌లో ఉన్న కారణంగా వీటి నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ప్రత్యేక సొసైటీగా మోడల్ స్కూల్స్‌ని ఉంచుతారా? విద్యాశాఖలో విలీనం చేస్తారా? అనేది ప్రభుత్వం తేల్చాలి. అన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆదర్శ పాఠశాలల అభివృద్ధిపై అజెండాలో చేర్చాలి. ఆదర్శ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై, ఉపాధ్యాయుల డిమాండ్లపై హామీ ఇవ్వాలి.
- బి.సురేష్, శ్రీకాకుళం