ఉత్తరాయణం

రామమందిరంతో సయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే అది సర్వమత సయోధ్యకు నిదర్శనంగా నిలుస్తుంది. జాతి శ్రేయస్సు దృష్ట్యా రామమందిరం నిర్మించాలి, రామరాజ్యం స్థాపించాలి. అందుకు అన్ని వర్గాల వారూ తప్పక సహకరించాలి. ‘రామ్‌ధరా భారత్’గా ఈ దేశం వర్థిల్లాలి. మానవతా నియమాలే రామధర్మ సందేశం. మమతానురాగాలను పాటించాలన్నది శ్రీరాముడి ఆదేశం. అయోధ్యలో రామమందిరం జాతి జనుల ఐక్యతకు నిదర్శనం కావాలి. అందుకే ‘రామ్‌ధరా భారత్’గా మరాలి ఈ దేశం. రాముడొక ఆదర్శ దివ్య పురుషుడు. ‘‘దేవ్యతి ఇతి. దేవః.’ దివ్య లక్షణాలను ప్రకాశించే వాడు దేవుడు.
రామధర్మం మతం కాదు- అన్ని ధర్మాలకు ఆలవాలమైన ధర్మవృక్షానికి పాదు. రామధర్మం సామాజిక సంయమనం, శాంతిమార్గ సహనశీల సహజీవన సంజీవనం పేరిమిగల పితృభూమి- ఓరిమిగల క్షాత్రశక్తి. తమ్ముల పట్ల త్యాగబుద్ధి- తల్లుల పట్ల ధర్మవిధి- ప్రజల పట్ల వాత్సల్యత- భార్య పట్ల ఏకపత్నీవ్రత బద్ధత- ఆశ్రీతులకు ఆరవ ప్రాణం, బాధితులకు ఆర్తత్రాణ పరాయణత, మంచివారికి మధుర స్వప్నం, వంచకులకు సింహస్వప్నం. దీనుల రక్షణలో రామభద్రుడు, దానవులను శిక్షించడంలో దారుణ కోదండ ధరుడు. దీనిని మతమంటారా? అత్యున్నత మానవ మహాపురుష ధర్మమంటారా? ఆలోచించండి!- అది అధిమానవ లక్ష్యానికి ఆదర్శమార్గం- అందుకే రాక్షస మాయావి మారీచుడు ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటూ ప్రశంసించాడు. చంచలులైన వానరులను చరితార్ధులుగా చేశాడు రాముడు. రామభక్తితో దేవుడుగా మారాడు హనుమంతుడు. అందుకే కావాలి- అయోధ్యలో రామమందిరం. రామునికి ముస్లింలంటేనే ప్రేమ ఘనం. ముస్లిం ప్రభువైన తానీషాకు కలిగింది రామలక్ష్మణ దర్శనం. కలలో ముస్లింను చూడటం, అది రామునిగా చెపుతుంది స్వప్న శాస్త్ర నిర్వచనం- తులసీదాసుకు దర్శనమిచ్చారు రామలక్ష్మణులు. అశ్వారూఢులైన ముస్లిం సర్దారులుగా తమిళనాట ఆంగ్లేయ కలెక్టర్‌కు, అర్ధరాత్రి భోరున వర్షంలో చెరువుకట్ట పోస్తూ కనిపించారు రామలక్ష్మణులు. రామభక్తులలో ప్రసిద్ధుడు కబీర్ ముస్లిం. రాముని మాతృస్థానం కోసల రాజ్యం. అలనాడది భారత వర్షం- ద్వాపరంలో పారశీక దేశం. మొన్న మొన్నటి వరకూ పర్షియాగా ఈనాడు పిలుస్తున్నాం ఇరాన్‌గా! అందుకే ముస్లిం సోదరులారా- సహకరించండి మనసారా. అయోధ్యలో రామమందిరం అందరికీ శుభదాయకం. రామనామానికి ఓటమి లేదు- రామధర్మానికి సాటిలేదు. అందుకే కావాలి రామమందిరం.
-ఉమాపతి బి.శర్మ, హైదరాబాద్

దిగజారుడు ప్రసంగాలు
ఎన్నికల నగారా మోగినవేళ రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటల యుద్ధాన్ని ప్రారంభించాయి. రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన విమర్శలకు బదులు- అసంబద్ధమైన అసభ్య పదజాలంతో కూడిన ప్రసంగాలు చోటు చేసుకోవడం ప్రజలకు బాధను కలిగిస్తున్నాయి. టీవీ మాధ్యమాలు టిఆర్‌పి రేటింగులను పెంచుకునేందుకు వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయడం, పదే పదే అవే ‘పంచ్’లను వినిపించడం, రాజకీయ నాయకులు అప్రజాస్వామికంగా భావోద్వేగాలను రెచ్చగొడుతూ ప్రసంగాలను ప్రసారం చేయడం రాజకీయ వ్యవస్థను అప్రదిష్టపాలు చేస్తోంది. రాజకీయాలలో పదవులు రావాలని అనుకోవడంలో తప్పులేదు కానీ వాటి కోసం పార్టీలు పోటీపడే ప్రయత్నంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, వారిని కుల, మత, వర్గ, ప్రాంతీయ ప్రాతిపదికలపై విడగొట్టి తమ పబ్బం గడుపుకోవడం సరికాదు. ఒకరిపై ఒకరు బురద జల్లుకొని, అది చాలక ఆ బురదను ప్రజలపైకి విసరడం శోచనీయం. ఇప్పటికైనా వోటుబ్యాంకు రాజకీయాలకు నేతలు స్వస్తి పలికి, ప్రజల బాగోగులపై, భావోద్వేగాలకు అతీతంగా శ్రద్ధవహిస్తే, వారు ఆశించి పదవులను ప్రజలే స్వచ్ఛందంగా కట్టబెడతారు. దిగజారుడు రాజకీయ ప్రసంగాలు ఎంతో కాలం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ సాగించలేవు.
- సి.కనకదుర్గ, హైదరాబాద్

ఆర్థిక వ్యవస్థ విధ్వంసం
రిజర్వ్ బ్యాంకు చట్టంలోని ఏడవ సెక్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించడం ద్వారా ఆ బ్యాంకు స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోంది. భారత ప్రజాస్వామ్యానికి చీకటి దినాలుగా చరిత్రకెక్కిన 1975 అత్యవసర పరిస్థితి, 1991లో విదేశీ మారక చెల్లింపుల్లో తీవ్ర లోటు ఏర్పడి అతలాకుతలమైనప్పుడు లేదా ప్రపంచాన్ని కుదిపేసిన 2008 ఆర్థిక మాంద్యం- ఇలాంటి సందర్భాల్లో సైతం వినియోగించని సెక్షన్ 7ను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. మితిమీరిన రుణ బకాయిలు, దిగజారుతున్న రూపాయి విలువ, కోలుకోలేని రీతిలో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతుండడంతో ఆ భారాన్ని, అందుకు బాధ్యతను రిజర్వ్ బ్యాంకు పైకి నెట్టివేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం- ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోనికి నెడుతుందని నిపుణులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రభుత్వం చేసిన తాజా ప్రయత్నాన్ని వ్యతిరేకించి రాజీనామాకు కూడా సిద్ధపడడం కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. కార్పొరేట్లకు భారీగా రుణమాఫీ చేయడమేగాక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అధిక మొత్తంలో సొమ్ము అందుబాటులో వుండేలా చిన్న, మధ్యతరగతి సంస్థలకు (ఎంఎస్‌ఎంఇ) జామీనులు, తనఖాల కోసం పట్టుబట్టకుండా బ్యాంకులు ఉదారంగా రుణాలిచ్చేలా ఆర్‌బిఐ నిబంధనలు సడలించాలని కేంద్ర రిజర్వ్ బ్యాంక్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. అధికారం, పలుకుబడి ఉపయోగించి వేల కోట్ల ఋణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఘరానా మోసగాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుసుకోకుండా ఉదాసీన వైఖరిని అవలంభించింది. పెద్దనోట్ల రద్దుతో స్థూల జాతీయోత్పత్తి కుంటుపడడమేగాక దేశ ఆర్థిక వ్యవస్థ- ప్రధానంగా బ్యాంకింగ్ రంగం కుప్పకూలే స్థితి దాపురించింది. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా వుండాలంటే రిజర్వ్ బ్యాంక్ కఠినంగా వ్యవహరించాల్సి వుంటుంది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వెళిపోతే ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం అనివార్యం. దేశ భవిష్యత్తుకు ఇటువంటి పరిణామాలు ఎంతగానో చేటు కలిగిస్తాయి.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం