ఉత్తరాయణం

భారత్ గ‘ఘన’ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఖ్యాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన ప్రయోగాల్లో ‘బాహుబలి’ లాంటి భారీ జియో స్టేషనరీ ఉపగ్రహ వాహక ప్రయోగాన్ని పూనుకొన్న సమయంలోనే ‘గజ’ తుపాను అక్కడికి దగ్గరలోనే తీరం దాటుతుందని మొదట ఆందోళన నెలకొంది. అయితే, ‘బాహుబలి’ని చూసి గజరాజు గజ గజలాడినట్టుగానే గజ తుఫాన్ కూడా గబగబా దిశ మార్చుకున్నట్టుంది. భారత్ సంకల్పానికి ఆ విధంగా ప్రకృతి కూడా తన వంతు పూర్తి మద్దతు తెలిపినట్టయింది. ఎలాంటి వాయిదాలు, అవాంతరాలు అవసరం లేకుండానే భారీ ప్రయోగం విజయవంతమయ్యింది. తమ ప్రయోగాలన్నింటిలో ఈ ప్రయోగమే ఎవరెస్టు శిఖరంతో సమానం అని ‘ఇస్రో’ చైర్మన్ అభిప్రాయపడడంలోనే ఈ ప్రయోగమెంత ప్రాముఖ్యత ఉన్నదో అర్థవౌతుంది. కాదా మరి! ఆరువేల కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాల్ని కక్ష్యలోకి పంపగలగడమంటేనే క్లిష్టమైన పని. అందుకు అవసరమైన జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ని సొంతంగా తయారు చేసుకోవడం ఇంకా పెద్ద సవాలు. అందులో భాగమైన క్రయోజెనిక్ ఇంజన్ తయారీకి అమెరికా మొహం చాటెయ్యగా, రష్యా విపరీతమైన ధరల్ని కోరిందట. అందుకనే మన దేశపు శాస్తవ్రేత్తల బృందం పట్టుదలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆ తయారీని సాధించింది. మొదటి ప్రయోగమే విజయవంతం కావటానికి కారణమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు, అండదండలందించిన ప్రభుత్వానికి అభినందనలు. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి చేరిన జీశాట్-29 సమాచార ఉపగ్రహం పదేళ్లు ఆధునిక సమాచార సేవలందిస్తుంది. పైగా ఇదే జిఎస్‌ఎల్‌వి రాకెట్ ముందు ముందు మానవ సహిత గగన్‌యాన్, చంద్రయాన్-2 ప్రయోగాలకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతరిక్ష ప్రయోగాలు భారత్‌కి కీర్తినందించడమే కాకుండా, అతి చవకగా, పూర్తి నాణ్యతతో కూడినందున ఇతర దేశాల నుండి వాణిజ్యాన్ని తీసుకువస్తున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలకు దేశం పెట్టిన పెట్టుబడి ఊరికే పోదని, వృథా కాదని నిరూపిస్తున్నాయి. ఈ విజయాలు దేశంలో శాస్ర్తియ విజ్ఞానం విస్తరించడానికి తగిన ఉత్తేజాన్ని, వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇది దేశ ప్రజలందరూ పండుగలా భావించాల్సిన చారిత్రక సందర్భం.

-డా. డీవీజీ శంకర్‌రావు, పార్వతీపురం