ఉత్తరాయణం

కక్ష సాధిస్తున్న అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా పెత్తనాన్ని ధిక్కరిస్తూ సామ్యవాదాన్ని అవలంబిస్తున్న దేశంగా నిలిచిన వెనెజులా తీవ్ర సంక్షోభంలో ఉంది. గత కొనే్నళ్లుగా ఆర్థిక యుద్ధంలో ఉన్నట్లు ప్రకటించిన ఆ దేశం ప్రస్తుతం రాజకీయ, సామాజిక సంక్షోభంలో చిక్కుకోవడంలో అమెరికా హస్తం ఉంది. ఆ దేశపు తిరుగులేని నేత చావెజ్ మరణించిన పిమ్మట అధ్యక్షుడిగా మదురో ఎన్నిక కాబడినా ఆ దేశపు రాజకీయ, ఆర్థిక అంతర్గత విషయాల్లో నేరుగా తలదూర్చడం అమెరికా పెద్దల వశం కాలేదు. అందుకనే పరోక్ష పద్ధతుల్లో వెనెజులా దేశాన్ని దారిలోకి తెచ్చుకోడానికి అమెరికా పాలకులు చూస్తున్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలైన ఆంక్షల యుద్ధం ట్రంప్ జమానాలో మరింత ఉధృతమైంది. వెనెజులా దేశానికి ఆదాయంలో ముఖ్యభాగం పెట్రోల్ ఎగుమతులు ద్వారా వస్తుంది. అమెరికా అంచెలంచెలుగా ఆ దేశం నుండి పెట్రోల్ దిగుమతులు తగ్గిస్తూ వచ్చింది. గత కొద్ది ఏళ్లుగా పెట్రోల్ ధరలు తగ్గుతూ రావడంతో వారి ఆదాయం తగ్గింది. ద్రవ్యోల్బణం కొన్ని లక్షల శాతం పెరిగింది. మందులు, తిండిగింజల కొరత పెరిగింది. ఇలాంటి సందర్భంలో రాజకీయ సంక్షోభం ఆ దేశానికి మరో శాపమైంది. ప్రజాభిప్రాయంతో ఎన్నికల ద్వారా మదురో అధ్యక్షుడిగా ఉన్నారు. జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు గైడో తాను దేశాధ్యక్షునిగా ప్రకటించుకొంటే వెంటనే అమెరికా, దాని మిత్రదేశాలు అతణ్ణి గుర్తిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే వెనెజులా సైన్యం కూడా గైడో నాయకత్వాన్ని ఆమోదించలేదు. ఈ అంతర్గత వివాదాన్ని చూపి అమెరికా వెనెజులాలో అతిపెద్ద ప్రభుత్వ పెట్రోలియం సంస్థ లావాదేవీల్ని స్తంభింపచేసింది. తద్వారా మరింత ఆర్థిక నష్టాల్లోకి ఆ దేశాన్ని నెట్టడం, దారిలోకి తెచ్చుకోవడం అమెరికా ఎత్తుగడ. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, వ్యాపార నిబంధనలకు విరుద్ధం. అంతర్జాతీయ సమాజం ఈ దుందుడుకు చర్యను ఖండించాలి.
-డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం