ఉత్తరాయణం

యుద్ధోన్మాదం మంచిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సాగుతున్న ప్రకటనలు యుద్ధోన్మాదాన్ని చాటుతున్నాయి. ఆయా దేశాల వైఖరి, ప్రకటనలు మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అన్న భయాన్ని కలిగిస్తున్నాయి. ఈమధ్యకాలంలో చైనా దుందుడుకు వైఖరి యుద్ధ వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ప్రపంచంలోని దేశాలన్నీ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూంటే ఒకటి రెండు దేశాలు యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నాయి. ఒకవేళ యుద్ధమే జరిగితే ఆ రెండు దేశాలతో పాటు మానవాళి మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది.
-బి.మధుసూదన రెడ్డి, బేతంచర్ల
అర్థంలేని విమర్శ
ఆర్యవైశ్యులపై కంచ ఐలయ్య అభిప్రాయాలను స్వామి పరిపూర్ణానంద విమర్శించడంపై సిపిఐ రామకృష్ణ చేసిన ప్రతి విమర్శల్లో అర్థం లేదు. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా పరిపూర్ణానంద కూడా ముఖ్యమంత్రి కావాలని తపిస్తున్నారన్నది రామకృష్ణ విమర్శ. కమ్యూనిస్టు నేతలతో వచ్చిన చిక్కే ఇది. వారు ఎవరినైనా విమర్శించవచ్చు కానీ ఇతరులు విమర్శిస్తే కమ్యూనిస్టులు, ఉదారవాదుల్లో అసహనం మొదలవుతుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక్కరి సొత్తుకాదు. వామపక్ష నాయకుల వైఖరి హాస్యాస్పదం.
-మరుదకాశి, కరప
పారిశుద్ధ్యం మెరుగుపడాలి
అందాల కోనసీమలో ముఖ్యమైన పట్టణం అమలాపురం. ఆ పేరుకు మురికిలేని పురమని అర్థం. స్వచ్ఛమైన పట్టణంలో ఇటీవలి కాలంలో కొంత అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. కోళ్ల దుకాణాల నిర్వాహకులు వాటి వ్యర్థాలను ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారు. అందువల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అమలాపురం ప్రతిష్ఠకు ఈ పరిణామాలు మచ్చ తెస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది తక్షణం స్పందించాలి.
-కె.మధుసూదనరావు, రోళ్లపాలెం