ఉత్తరాయణం

అంతం లేని లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నవ నాగరిక సమాజంలో మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటికి అంతమంటూ లేదు. పసికందుల నుంచి ముసలి వాళ్లవరకూ.. బడికెళ్లే చిన్నారులు మొదలు యువతులు, ఉద్యోగినులు, ఆఖరికి మహిళా మంత్రులు కూడా లైంగిక వేధింపులకు గురివుతున్నారంటే.. ఎలాంటి భయంకర పరిస్థితుల మధ్య నేడు మనం బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఆడవారిని విలాస వస్తువుగా చూసే సమాజంలో ఎన్ని నిర్భయ చట్టాలు వస్తే మాత్రం ఏం లాభం? మహిళలకు భద్రత, లైంగిక వేధింపులనుండి రక్షణ అనేది ఎండమావే అని అర్థవౌతోంది. త్రిపురలో ఇటీవల ఒక అధికారిక కార్యక్రమంలో ఓ మంత్రివర్యుడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో తోటి మహిళా మంత్రిని అసభ్యకర రీతిలో తాకిన సంఘటన అనాగరికం. ప్రభుత్వాలు మహిళలకు రక్షణ విషయంలో భారీ డైలాగులు పేల్చడం తప్ప కర్తవ్య నిర్వహణలో ఎందుకూ కొరగావని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహిళా మంత్రి పట్ల ఆ నేత ప్రవర్తన తీరును ఎండగడుతున్నాయి ప్రతిపక్షాలు. మహిళలకు ఎంతో విలువ ఇస్తన్నామని ఆర్భాటాలు పలికే బిజెపి ప్రభుత్వం కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం, మహిళా మంత్రిని ఆ నేత పొరపాటున తాకాడని ముఖ్యమంత్రి వివరణ ఇవ్వడం మహిళలను స్వయంగా కించపరచడం కాక మరేమిటి? మహిళలను దేవతా స్వరూపులుగా పూజించి, ఆదరించే అద్భుత సనాతన సంఅపదాయం వెలసిల్లే ఈ పవిత్ర భారతావనిలో మహిళలకు తగు రీతిన గౌరవం కనబరచలేని వారిని, మహిళలను విలాస వస్తువులుగా భావించే వారికి, తనను కన్న మాతృమూర్తి కూడా స్ర్తి అని తెలుసుకోలేని కామాంధులకు సభ్యతా సమాజమే తగు రీతిన బుద్ధి చెప్పాలి.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం